హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

BSNL Plan: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు షాక్.. ఇక ఈ చౌక ప్లాన్ అందుబాటులో ఉండదు!

BSNL Plan: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు షాక్.. ఇక ఈ చౌక ప్లాన్ అందుబాటులో ఉండదు!

 బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు షాక్.. ఇక ఈ 2 చౌక ప్లాన్లు ఉండవు!

బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు షాక్.. ఇక ఈ 2 చౌక ప్లాన్లు ఉండవు!

Freedom 75 Plan | మీరు బీఎస్ఎన్ఎల్ కస్టమర్లా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకని అనుకుంటున్నారా? ఎంట్రీ లెవెల్ చౌక ధరల ప్లాన్ ఇక కనిపించవు. ఈ ప్లాన్ ఎప్పటి నుంచి అందుబాటులో ఉండదో ఇప్పుడు తెలుసుకుందాం.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  BSNL Broadband Plans | ప్రభుత్వ రంగానికి చెందిన టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ (BSNL) కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్. వచ్చే నెల నుంచి చౌక ధరల బ్రాడ్‌బాండ్ ప్లాన్ కనిపించదు. కంపెనీ 2022 ఇండిపెండెన్స్ డే సందర్భంగా కొత్త ఫైబర్ బ్రాడ్‌బాండ్ ప్లాన్‌ను (Broadband Plans) తీసుకువచ్చింది. దీని ధర రూ. 275. ఒక నెల వాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ వల్ల యూజర్లకు 3300 జీబీ డేటా వస్తుంది. స్పీడ్ 60 ఎంబీపీఎస్. డేటా లిమిట్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది.

  ఇది చాలా అందుబాటు ధరలోని ప్లాన్. బీఎస్ఎన్ఎల్ సర్వీస్ పొందాలని భావించే వారిలో చాలా మంది ఈ ప్లాన్‌ను ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఇది ప్రమోషనల్ ఆఫర్ మాత్రమే. అందుకే లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లాన్ ఎక్స్‌పైరీ డేట్ దగ్గరకు వచ్చేసింది. వచ్చే నెల నుంచి ఈ ప్లాన్ అందుబాటులో ఉండదు.

  రూ.5 వేలకే టీవీ, రూ.7 వేలకే ఫ్రిజ్.. ఫ్లిప్‌కార్ట్‌లో క్రేజీ ఆఫర్లు!

  బీఎస్ఎన్ఎల్ రూ. 275 ఫైబర్ బ్రాడ్‌బాండ్ ప్లాన్ రెండు ఆప్షన్ల రూపంలో అందుబాటులో ఉంది. ఈ రెండు ఆప్షన్లలోనూ ఫీచర్లు ఒకేలా ఉంటాయి. అయితే ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం వేర్వేరుగా ఉంటుంది. ఒక ఆప్షన్‌లో అయితే స్పీడ్ 30 ఎంబీపీఎస్‌గా, మరో ఆప్షన్‌లో 60 ఎంబీపీఎస్‌గా ఉంటుంది. టెలికం టాక్ రిపోర్ట్ ప్రకారం చూస్తే.. ఈ రెండు ప్లాన్లు అక్టోబర్ 13న క్లోజ్ అవుతాయి. అంటే తర్వాత రోజు నుంచి ఈ ప్లాన్ అందుబాటులో ఉండదు.

  స్మార్ట్‌‌టీవీపై రూ.19 వేల డిస్కౌంట్.. రూ.28 వేల టీవీ రూ.8,500కే కొనేయండి!

  అంటే కస్టమర్లు అక్టోబర్ 13 తర్వాత ఈ ప్లాన్‌ను రీచార్జ్ చేసుకోలేరు. ఆఫర్ అయిపోయిన తర్వాత కస్టమర్లు రూ. 449, రూ. 599 ప్లాన్లతో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెలవారీ ప్లాన్లు. ఫైబర్ బేసిస్ (30 ఎంబీపీఎస్), ఫైబర్ బేసిక్ ప్లస్ (60 ఎంబీపీఎస్ స్పీడ్) ఆప్షన్లలో దేనిని అయినా ఎంచుకోవచ్చు. ఇకపోతే కంపెనీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా గత నెలలో ఫ్రీడమ్ 75 ఆఫర్ తీసుకువచ్చింది.

  అందువల్ల ఎవరైనా ఫ్రీడమ్ ప్లాన్ తీసుకోవాలని భావిస్తే.. ఆలస్యం చేయకుండా ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం ఉత్తమం. లేదంటే వచ్చే నెల నుంచి ఈ ప్లాన్ అందుబాటులో ఉండదు. కాగా మరోవైపు బీఎస్ఎన్ఎల్ సూపర్ స్టార్ ప్రీమియం ప్లస్ ప్లాన్ ధరను తగ్గించేసింది. అయితే ఇది కూడా పరిమిత కాలం వరకే ఉంటుంది. దీని ద్వారా కస్టమర్లకు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దీని ధర రూ. 775. తొలి 75 రోజులు ఇదే ధర వర్తిస్తుంది. 75 రోజులు దాటితే మాత్రం అప్పుడు దీని రేటు రూ. 999 అవుతుంది.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: AIRTEL, Airtel recharge plans, BSNL, Jio, Reliance Jio

  ఉత్తమ కథలు