• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • BSNL DISCONTINUES TWO BHARAT FIBER BROADBAND PLANS KNOW ABOUT OTHER PLANS SS GH

BSNL Bharat Fiber: బీఎస్ఎన్ఎల్ బ్రాడ్​బ్యాండ్​ యూజర్లకు షాక్... ఆ రెండు ప్లాన్లు లభించవు

BSNL Bharat Fiber: బీఎస్ఎన్ఎల్ బ్రాడ్​బ్యాండ్​ యూజర్లకు షాక్... ఆ రెండు ప్లాన్లు లభించవు

BSNL Bharat Fiber: బీఎస్ఎన్ఎల్ బ్రాడ్​బ్యాండ్​ యూజర్లకు షాక్... ఆ రెండు ప్లాన్లు లభించవు (ప్రతీకాత్మక చిత్రం)

BSNL Bharat Fiber | బీఎస్ఎన్ఎల్ రెండు భారత్ ఫైబర్ బ్రాడ్​బ్యాండ్​ ప్లాన్లను నిలిపివేసింది. ఎందుకో తెలుసుకోండి.

  • Share this:
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్​ లిమిటెడ్ (BSNL) తన సొంత ఫైబర్ ఇంటర్నెట్ సర్వీసులను ‘భారత్ ఫైబర్’ పేరుతో అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా బీఎస్​ఎన్​ఎల్​ తన బ్రాడ్​బ్యాండ్​ యూజర్లకు షాకింగ్​ న్యూస్​ చెప్పింది. నేటి నుండి కొన్ని ఫైబర్ ప్లాన్‌లను నిలిపియనున్నట్లు ప్రకటించింది. ఇకపై ఈ బ్రాడ్​బ్యాండ్​ ప్లాన్లు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. బీఎస్​ఎన్​ఎల్​ సంస్థ తన యూజర్లకు 2020 అక్టోబర్​ 1 నుండి ఫైబర్​ బేసిక్​, ఫైబర్​ వాల్యూ, ఫైబర్​ ప్రీమియం, ఫైబర్​ అల్ట్రా పేర్లతో నాలుగు బ్రాడ్​బ్యాండ్​ ప్లాన్లను అమలు చేస్తోంది. ఈ నాలుగు ప్లాన్లలో రెండు ప్లాన్లను ఇప్పుడు నిలిపివేసింది. దీంతో, ఇకపై బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ యూజర్లకు కేవలం ఫైబర్ బేసిక్ ప్లస్, ఫైబర్ ప్రీమియం ప్లస్ అనే రెండు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫైబర్ బేసిక్ ప్లస్ ప్లాన్‌ కోసం ప్రతి నెలా రూ .599 (పన్నులు మినహాయించి) ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక, ఫైబర్ ప్రీమియం ప్లస్ ప్లాన్‌కు ప్రతినెలా రూ .1,277 (పన్ను మినహాయించి) ఖర్చవుతుంది. ఈ ప్లాన్ల గురించి మరిన్ని వివరాలు తెలసుకుందాం.

Budget Smartphones: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.15,000 లోపు బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్ ఇవే

IRCTC Tour: విశాఖపట్నం నుంచి ఐఆర్‌సీటీసీ టూర్... కాశీ, అయోధ్య యాత్రకు వెళ్లండిలా

ఫైబర్ బేసిక్ ప్లస్ బ్రాడ్​బ్యాండ్​ ప్లాన్


బీఎస్ఎన్ఎల్ ఫైబర్ బేసిక్ ప్లస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ నెలకు రూ .599 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్‌తో యూజర్లు 60 ఎమ్‌బిపిఎస్ డౌన్‌లోడ్ /అప్‌లోడ్ స్పీడ్​తో కూడిన 3.3 టిబి లేదా 3,300 జీబి డేటాను పొందుతారు. ఈ డేటా లిమిట్​ పూర్తయిన తర్వాత బ్రౌజింగ్​ స్పీడ్​ 2 Mbpsకి పడిపోతుంది. ఈ ప్లాన్​ వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్‌ సదుపాయాన్ని కూడా అందిస్తుంది.

ఫైబర్ ప్రీమియం ప్లస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్


బీఎస్ఎన్ఎల్ ఫైబర్ ప్రీమియం ప్లస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ నెలకు రూ .1,277 వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్‌తో యూజర్లు 200 ఎమ్‌బిపిఎస్ డౌన్‌లోడ్/ అప్‌లోడ్ స్పీడ్​తో కూడిన 3.3 టిబి లేదా 3,300 జిబి డేటాను పొందుతారు. ఈ డేటా లిమిట్​ పూర్తయిన తర్వాత, బ్రౌజింగ్​ స్పీడ్​ 15 Mbps కి పడిపోతుంది. బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు ఇకపై ఈ రెండు ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. తాజాగా, తొలగించిన ప్లాన్​లలో ఒకటైన ‘ఫైబర్ బేసిక్’ ప్లాన్​ నెలకు రూ.449 ధర వద్ద లభించేది. దీన్ని ఎంట్రీ-లెవల్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్​గా పేర్కొనవచ్చు. ఈ ప్లాన్​ కింద యూజర్లకు 3.3TB లేదా 3,300GB డేటా 30 Mbps డౌన్‌లోడ్/అప్‌లోడ్ స్పీడ్​తో లభించేది.

Poco X3 Pro: రేపే పోకో ఎక్స్3 ప్రో సేల్... డిస్కౌంట్‌తో కొనండి ఇలా

Samsung Galaxy F12: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్12, ఎఫ్02ఎస్ రిలీజ్... భారీ బ్యాటరీతో పాటు మరెన్నో ప్రత్యేకతలు

ఈ ప్లాన్లను మొదట డిసెంబర్ 29 న నిలిపివేయాలని నిర్ణయించారు. కానీ, వీటి డిమాండ్​ కారణంగా 2021 ఏప్రిల్ 4 వరకు పొడిగించింది బీఎస్​ఎన్​ఎల్​. కాగా, ప్రస్తుతం మార్కెట్​లో దూసుకుపోతున్న ప్రైవేటు టెలికాం సర్వీసు ప్రొవైడర్లు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్, జియోఫైబర్లకు బీఎస్​ఎన్​ఎల్​ భారత్​ ఫైబర్​ గట్టి పోటీనిస్తున్నందున.. వీటిని మరికొంత కాలం పాటు కొనసాగిస్తారని అంతా ఊహించారు. కానీ, కొన్ని కారణాల వల్ల, బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్​లను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం యూజర్లకు నిరాశ కలిగించినప్పటికీ.. అతి త్వరలోనే ఆకర్షనీయమైన బ్రాడ్​బ్యాండ్​ ప్లాన్లతో ముందుకు వస్తుందని వారు ఆశిస్తున్నారు.
Published by:Santhosh Kumar S
First published: