హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OTT Subscription: బంపరాఫర్.. రూ.249కే 8 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్!

OTT Subscription: బంపరాఫర్.. రూ.249కే 8 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్!

OTT Subscription: బంపరాఫర్.. రూ.249కే 8 ఓటీటీ ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రిప్షన్!

OTT Subscription: బంపరాఫర్.. రూ.249కే 8 ఓటీటీ ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రిప్షన్!

BSNL Offer | కేవలం రూ. 249కే అదిరిపోయే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ సొంతం చేసుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? ఈ ఆఫర్ కేవలం బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

OTT Platform | ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంచింది. తక్కువ ధరకే ఎక్కువ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ సొంతం చేసుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ డీల్ గురించి తెలుసుకోవాల్సిందే. బీఎస్ఎన్ఎల్ (BSNL) బ్రాడ్‌బాండ్ ప్లాన్స్‌తో పాటుగా ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రిప్షన్ కూడా తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది. కేవలం రూ. 249కే 8 రకాల ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. దీని వల్ల బీఎస్‌ఎన్ఎల్ బ్రాడ్‌బాండ్ కస్టమర్లకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం మార్కెట్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు డిమాండ్ బాగుంది. కోవిడ్ 19 వచ్చిన దగ్గరి నుంచి చూస్తే.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలు చూసే వారు కూడా ఎక్కువ అయ్యారు. టీవీ షోలు తెగ చూసేస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ రూ. 249 ప్లాన్ కింద 8 రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. జీ5, సోనీ లివ్, వూట్ సెలెక్ట్, యప్ టీవీ, అహా, లయన్స్‌గేట్ ప్లే, హంగామా, డిస్నీ హాట్‌స్టర్ వంటి తదితర ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.

రియల్‌మి కొత్త ఏసీలు.. ధర తక్కువ, ఫీచర్లు అదుర్స్.. 20 నిమిషాల్లో రూమ్ కూల్!

బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బాండ్ సర్వీసులు పొందే కస్టమర్లు ఈ ఓటీటీ సర్వీసులు కూడా పొందొచ్చు. రూ. 249 చెల్లిస్తే సరిపోతుంది. ఇలా మీరు ప్రతి నెలా రూ. 249 చెల్లిస్తూ రావాలి. కాగా బీఎస్ఎన్ఎల్ ఎంట్రీ లెవెట్ బ్రాడ్‌బాండ్ ప్లాన్ ధర రూ. 399గా ఉంది. కంపెనీ ఇటీవలనే తన రూ. 329 ప్లాన్‌ను తొలగించింది. రూ. 329 ప్లాన్ కింద కస్టమర్లకు 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 1 టీబీ డేటా లభించేది. కంపెనీ ఇటీవలనే ఈ ప్లాన్‌ను తీసేసింది.

ఫ్లిప్‌కార్ట్ ఊరించే ఆఫర్.. రూ.999కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ!

కాగా మీరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్‌ను విడిగా తీసుకోవాలని భావిస్తే.. మాత్రం చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. అందువల్ల మీరు ఇలాంటి బండిల్ ప్లాన్స్ కొనుగోలు చేస్తేనే ఉత్తమం. తక్కువ ధరలో అన్ని రకాల ప్లాట్‌ఫామ్స్‌ను చూడొచ్చు. లేదంటే ఒక్కో ఓటీటీ ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రిప్షన్ పొందాలంటే కనీసం రూ. 500కు పైగానే చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే ఈ బండిల్ ప్లాన్స్ బెస్ట్. ఇకపోతే బీఎస్ఎన్ఎల్ కంపెనీ పలు రకాల బ్రాడ్‌బాండ్ ప్లాన్స్‌పై ఈ ఓటీటీ బండిల్ సర్వీసులను అందుబాటులో ఉంచింది. అందువల్ల మీరు ఇప్పటికే ఓటీటీ సేవలు వినియోగిస్తూ ఉంటే.. ఇబ్బంది లేదు. అలా కాకుండా కొత్తగా ఓటీటీ సేవలు పొందాలని భావించే వారు రూ. 249కు చెల్లించి సర్వీసులు సొంతం చేసుకోవచ్చు.

First published:

Tags: BSNL, Disney plus hotstar, Disney+ Hotstar, Ott platform

ఉత్తమ కథలు