• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • BSNL BROADBAND USERS CAN BUY GOOGLE NEST MINI SMART SPEAKER JUST AT RS 99 KNOW OFFER DETAILS SS GH

Google Nest Mini: రూ.99 ధరకే గూగుల్ నెస్ట్ మినీ స్మార్ట్ స్పీకర్... వారికి మాత్రమే

Google Nest Mini: రూ.99 ధరకే గూగుల్ నెస్ట్ మినీ స్మార్ట్ స్పీకర్... వారికి మాత్రమే

Google Nest Mini: రూ.99 ధరకే గూగుల్ నెస్ట్ మినీ స్మార్ట్ స్పీకర్... వారికి మాత్రమే (ప్రతీకాత్మక చిత్రం)

Google Nest Mini | స్మార్ట్ స్పీకర్ కొనాలనునేవారికి గుడ్ న్యూస్. గూగుల్ నెస్ట్ మినీ స్పీకర్‌ను రూ.99 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ అవకాశం వారికి మాత్రమే.

  • Share this:
ప్రభుత్వ యాజమాన్యంలోని టెల్కో సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) వరుస ఆఫర్లను ప్రకటిస్తూ యూజర్ల సంఖ్యను పెంచుకుంటోంది. ఇటీవలే బ్రాడ్​బ్యాండ్​ లేదా ల్యాండ్​లైన్ కనెక్షన్ ఇన్​స్టాలేషన్​ ఛార్జీలను మాఫీ చేస్తూ బంపరాఫర్​ ప్రకటించిన బీఎస్​ఎన్​ఎల్​.. తాజాగా, మరో బంపరాఫర్​తో ముందుకొచ్చింది.​ తన భారత్​ ఫైబర్ వినియోగదారుల​ కోసం ప్రత్యేకంగా గూగుల్ బండిల్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఆఫర్‌లో భాగంగా బిఎస్‌ఎన్‌ఎల్ భారత్ ఫైబర్ వినియోగదారులకు గూగుల్ నెస్ట్, గూగుల్ మినీ స్మార్ట్ డివైజెస్ కొనుగోలు​పై డిస్కౌంట్​ అందజేస్తుంది. అయితే, ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే​. ఈ ఆఫర్​ జూలై 14 వరకు అందుబాటులో ఉంటుందని బీఎస్​ఎన్​ఎల్​ ప్రకటించింది. వార్షిక బ్రాడ్‌బ్యాండ్- ఎఫ్‌టిటిహెచ్, ఎయిర్‌ఫైబర్ లేదా డిఎస్‌ఎల్ ప్లాన్లలో భాగంగా నెలవారీ చందా కింద రూ .799 లేదా అంతకంటే ఎక్కువ చెల్లించే కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంటుందని బీఎస్​ఎన్​ఎల్​ తెలిపింది.

Credit Card Data Leak: అక్కడ షాపింగ్ చేసినవారికి షాక్... 10 లక్షల మంది క్రెడిట్ కార్డ్ డేటా లీక్

Oppo A54: ఇండియాలో రిలీజైన ఒప్పో ఏ54... ధర ఎంతంటే

సంబంధిత ప్లాన్ల 12, 13 నెలల సభ్యత్వాన్ని ఒకేసారి చెల్లించిన వారు.. గూగుల్ నెస్ట్ మినీ, గూగుల్ నెస్ట్ హబ్ స్మార్ట్ డివైజెస్​ను నెలవారీ చందా కింద వరుసగా రూ.99, రూ.199లకే కొనుగోలు చేయవచ్చు. అర్హత కలిగిన చందాదారులు వార్షిక, ద్వైవార్షిక, త్రైమాసిక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఛార్జీలను ముందుగా చెల్లిస్తేనే బిఎస్ఎన్ఎల్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా బండిల్‌ ఆఫర్​ సభ్యత్వం లభిస్తుందని బీఎస్​ఎన్​ఎల్​ స్పష్టం చేసింది. కాగా, ఈ ఆఫర్​ కోసం వార్షిక, ద్వైవార్షిక, త్రైమాసిక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్​లను ఎంచుకున్న కస్టమర్లు వరుసగా 10.5 నెలలు, 20.5 నెలలు, 30.5 నెలలు ఛార్జీలను ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఈ ఆఫర్​ను తొలుత కేరళ టెలికాం సర్కిల్​ ప్రకటించింది.

WhatsApp: వాట్సప్ వాడేవాళ్లు అస్సలు ఈ తప్పులు చేయొద్దు

Samsung Galaxy A32: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.3,000 తగ్గింది... రూ.1,500 డిస్కౌంట్ కూడా

జులై 14 వరకే ఆఫర్ వర్తింపు​


ప్రస్తుతం గూగుల్ నెస్ట్ మినీ రూ.4999లకు లభిస్తుంది. 12 నెలల పాటు బిఎస్‌ఎన్‌ఎల్ భారత్​ ఫైబర్​ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లకు సబ్​స్క్రైబ్​ చేసుకున్న చందాదారులు గూగుల్ నెస్ట్ మినీ పరికరాన్ని రూ.1188 లకే కొనుగోలు చేయవచ్చు. గూగుల్ నెస్ట్ మినీ డివైజ్​ హ్యాండ్​ ఫ్రీ అసిస్టెన్స్​ ఇస్తుంది. దీని సహాయంతో మన ఇంట్లో చూట్టూ ఉన్న ఎలక్ట్రానిక్​ పరికరాలను వాయిస్​ కంట్రోల్​ ఆపరేట్​ చేయవచ్చు. గూగుల్ మినీ పరికరాన్ని మ్యూజిక్​, ఆడియో బుక్స్​ వినడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇక, గూగుల్ నెస్ట్ హబ్ విషయానికి వస్తే.. ఇది ప్రస్తుతం, రూ.9999లకు అందుబాటులో ఉంది. అయితే, బిఎస్ఎన్ఎల్ బ్రాడ్​బ్యాండ్​ ప్లాన్స్​ తీసుకున్న చందాదారులకు మాత్రం నెస్ట్ హబ్ కేవలం రూ.2587లకే లభిస్తుంది. ఒక బిఎస్‌ఎన్‌ఎల్ యూజర్ ఏదైనా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను 12 నెలలు పాటు సబ్​స్క్రైబ్​ చేసుకున్నప్పుడు.. అతడు నెలవారీ చందా కింద 12 నెలల పాటు రూ.199 చెల్లిస్తే సరిపోతుంది. అటువంటి వారికి గూగుల్​ నెస్ట్​ హబ్​ డివైజ్​ కేవలం రూ.2388లకే లభిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:

అగ్ర కథనాలు