BSNL Plans: బీఎస్ఎన్ఎల్ నుంచి అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్స్... లాభాలివే

BSNL new plans | బీఎస్ఎన్ఎల్ సరికొత్తగా రెండు రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించింది. రూ.108, రూ.1,999 ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటే వచ్చే లాభాలేంటో తెలుసుకోండి.

news18-telugu
Updated: January 31, 2020, 11:20 AM IST
BSNL Plans: బీఎస్ఎన్ఎల్ నుంచి అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్స్... లాభాలివే
BSNL (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారత ప్రభుత్వానికి చెందిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL రెండు అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది. రూ.108, రూ.1,999 ప్లాన్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రైవేట్ టెలికామ్ ఆపరేటర్ల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న బీఎస్ఎన్ఎల్ తమ యూజర్ బేస్‌ను కాపాడుకోవడంతో పాటు సబ్‌స్క్రైబర్లను పెంచుకోవడం కోసం సరికొత్త ప్లాన్స్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా రూ.108, రూ.1,999 ప్లాన్స్‌ని ప్రకటించింది. ప్రస్తుతం కేరళలో ప్రారంభించిన ఈ ప్లాన్స్ చెన్నైతో పాటు తమిళనాడు సర్కిల్స్‌లో అందుబాటులో ఉంటుంది. మరి మిగతా సర్కిల్స్‌లో ఈ ప్లాన్స్‌ని ఎప్పుడు ప్రవేశపెడతారో చూడాల్సి ఉంది.

BSNL Rs 1,999 Plan: రూ.1,999 రీఛార్జ్ చేసినవారికి రోజూ 250 నిమిషాల వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజూ 3 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. 3జీబీ డేటా పూర్తైన తర్వాత స్పీడ్ 80 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. బీఎస్ఎన్ఎల్ టీవీ, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ సబ్‌స్క్రిప్షన్స్ ఉచితం. రిపబ్లిక్ డే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌లో భాగంగా జనవరి 26 నుంచి ఫిబ్రవరి 15 మధ్య రూ.1,999 రీఛార్జ్ చేసేవారికి ఈ బెనిఫిట్స్ 436 రోజులు లభిస్తాయి. ఆ తర్వాత రీఛార్జ్ చేసుకుంటే వేలిడిటీ 365 రోజులు మాత్రమే. అంటే ఫిబ్రవరి 15 లోగా రీఛార్జ్ చేస్తే 71 రోజుల వేలిడిటీ అదనంగా లభిస్తుంది.

BSNL Rs 108 Plan: రూ.108 రీఛార్జ్ చేసేవారికి రోజూ 250 నిమిషాల వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజూ 1 జీబీ డేటా, 500 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. 1జీబీ డేటా పూర్తైన తర్వాత స్పీడ్ 80 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. వేలిడిటీ 28 రోజులు.

ఇవి కూడా చదవండి:

Jeff Bezos: 15 నిమిషాల్లో రూ.94 వేల కోట్ల సంపాదన... అమెజాన్ అధిపతి సంచలనం

Home Loan: హోమ్ లోన్‌కు అప్లై చేసేముందు ఈ టిప్స్ గుర్తుంచుకోండి

EPFO: షాక్... 9 లక్షల ఈపీఎఫ్ అకౌంట్లను బ్లాక్ చేసిన ఈపీఎఫ్ఓ 

PPF Rules: పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
First published: January 31, 2020, 11:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading