BSNL ANNOUNCED SEVERAL FREE BENEFITS TO CUSTOMERS HERE FULL DETAILS NS GH
BSNL: కరోనా కష్టకాలంలో కస్టమర్లకు అండగా బీఎస్ఎన్ఎల్.. వ్యాలిడిటీ పొడగింపుతో పాటు ఉచిత సేవలు.. వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
కరోనా నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కస్టమర్లకు ఉచిత ప్రయోజనాలను అందిస్తామని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్(BSNL) ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆఫర్లు వర్తించే పివి ప్లాన్లు ఇవే..
బీఎస్ఎన్ల్ సంస్థ ప్రస్తుతం అందిస్తున్న ఉచిత వాలిడిటీ పొడగింపు ఆఫర్ మూడు పీవీలకు వర్తిస్తుంది. వీటిలో PV107, PV197, PV 397 వంటివి ఉన్నాయి. ఏప్రిల్ 1తో ప్లాన్ గడువు ముగిసే కస్టమర్లకు మాత్రమే ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి. PV107 ప్లాన్ 100 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది 60 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. దీని కింద 100 నిమిషాలు వాయిస్ కాలింగ్, 3GB డేటా లభిస్తుంది. ఇక, PV197 ప్లాన్ 180 రోజుల వాలిడిటీ కలిగి ఉంటుంది. దీని కింద అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMS లభిస్తాయి. అంతేకాక, 18 రోజుల పాటు ట్యూన్స్, జింగ్ మ్యూజిక్ ఉచితంగా అందిస్తుంది.
చివరగా, PV 397 ప్లాన్ ఏడాది వాలిడిటీ కలిగి ఉంటుంది. దీని కింద కస్టమర్లకు రోజుకు 2 జిబి డేటా, రోజుకు100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. దీనికి అదనంగా బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్, లోక్ధన్ కంటెంట్ 60 రోజుల పాటు ఉచితంగా అందిస్తుంది. ప్రస్తుత అనిశ్చితి సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కనెక్ట్ అవ్వడానికి ఈ ఆఫర్లను ప్రకటిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.
జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఇలా..
ఈ ఆపత్కర సమయంలో తమ కస్టమర్లకు సహాయపడేందుకు ప్రముఖ టెలికాం సంస్థలు జియో (Jio), ఎయిర్టెల్ (Airtel), వీఐ(Vi) ముందుకొచ్చాయి. వోడాఫోన్ ఐడియా తక్కువ -ఆదాయం గల కస్టమర్లకు ఉచితంగా రూ .49 ప్లాన్ ప్రకటించింది. దీనితో పాటు రూ. 79 కాంబో వోచర్‌పై రెట్టింపు ప్రయోజనాలను అందిస్తుంది. ఇక, రిలయన్స్ జియో తన కస్టమర్లకు నెలకు 300 ఉచిత నిమిషాల అవుట్గోయింగ్ కాల్స్ (రోజుకు 10 నిమిషాలు) అందిస్తామని తెలిపింది. ఇక, మరో టెలికాం దిగ్గజం 55 మిలియన్ల మంది తక్కువ ఆదాయ కస్టమర్లకు రూ .49 ప్యాక్‌ను ఉచితంగా అందిస్తామని తెలిపింది. 28 రోజుల వ్యాలిడిటీ గల ఈ ప్యాక్‌తో రూ .38 టాక్‌టైం, 100 ఎంబి డేటా లభిస్తుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.