BSNL Landline: బీఎస్​ఎన్​ఎల్​ ల్యాండ్‌లైన్ యూజర్లకు గుడ్​న్యూస్​.. పాత ల్యాండ్​లైన్​ నంబర్​తోనే...​

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) రోజురోజుకు సేవలను విస్తరిస్తూ ఎక్కువ మంది యూజర్లను చేరుకుంటోంది. తాజాగా బీఎస్​ఎస్​ఎల్​ తమ ల్యాండ్​ లైన్​ యూజర్లకు గుడ్​న్యూస్​ చెప్పింది. పాత ల్యాండ్​లైన్ నెంబర్​తోనే ఫైబర్ టు హోమ్ (FTTH) బ్రాడ్‌బ్యాండ్​కు మైగ్రేట్ కావడానికి అవకాశం కల్పిస్తోంది.

  • Share this:
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) రోజురోజుకు సేవలను విస్తరిస్తూ ఎక్కువ మంది యూజర్లను చేరుకుంటోంది. తాజాగా బీఎస్​ఎన్‌ఎల్​ తమ ల్యాండ్​ లైన్​ యూజర్లకు గుడ్​న్యూస్​ చెప్పింది. పాత ల్యాండ్​లైన్ నెంబర్​తోనే ఫైబర్ టు హోమ్ (FTTH) బ్రాడ్‌బ్యాండ్​కు మైగ్రేట్ కావడానికి అవకాశం కల్పిస్తోంది. హువావే, యూటీ స్టార్‌కామ్ ల్యాండ్‌లైన్ నంబర్లతో సహా అన్ని బీఎస్​ఎన్​ఎల్ ల్యాండ్​లైన్​​ యూజర్లకు ఈ మైగ్రేట్​ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అయితే సీడీఓటీ యూజర్లకు మాత్రం ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు.

బీఎస్​ఎన్​ఎల్ ఈ స్కీమ్​ను గతేడాది సెప్టెంబర్​లోనే ప్రారంభించింది. దీని ప్రకారం బీఎస్​ఎన్​ఎల్​ ల్యాండ్‌లైన్ కస్టమర్లు తమ ల్యాండ్‌లైన్ నంబర్‌ను భారత్ ఫైబర్ వాయిస్ లేదా వాయిస్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌కు ట్రాన్స్​ఫర్​ చేసుకోవచ్చు. బీఎస్​ఎన్​ఎల్​ కేరళ టెలికాం సర్కిల్​ ముందుగా దీన్ని అమల్లోకి తెచ్చింది. యూజర్లు తమ ల్యాండ్‌లైన్ నంబర్‌ని ఫైబర్ కేటగిరీగా మార్చేందుకు వారి సిస్టమ్‌లో కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను చేర్చింది. బీఎస్​ఎన్​ఎల్​ ల్యాండ్​లైన్​ కస్టమర్లు బ్రాండ్​ బ్యాండ్​ సేవలకు మైగ్రేట్​ కావాలనుకుంటే వెంటనే సమీపంలోని బీఎస్​ఎన్​ఎల్​ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించి, రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Jio New Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్... ఈ కొత్త ప్లాన్స్‌తో హాట్‌స్టార్‌లో కొత్త బెనిఫిట్స్

ప్రీమియం ప్రీపెయిడ్​ ప్లాన్లలో మార్పులు..
మరోవైపు, బీఎస్​ఎన్​ఎల్​ ప్రస్తుతం అమలు చేస్తున్న రూ. 1999, రూ. 2399 ప్రీమియం ప్రీపెయిడ్ ప్లాన్లను సవరించింది. రూ. 2399 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీని 60 రోజులు పెంచింది. ఇప్పుడు ఈ ప్లాన్​ 425 రోజుల వాలిడిటీతో వస్తుంది. ప్లాన్ కింద రోజుకు 3GB డేటా లభిస్తుంది. ఆ తర్వాత డేటా వేగం 80 Kbps కి పడిపోతుంది. దీనికి అదనంగా రోజుకు 100 SMS లు లభిస్తాయి. బీఎస్​ఎన్​ఎల్​ ట్యూన్‌లతో పాటు ఈరోస్ నౌ కంటెంట్‌కు కూడా 425 రోజుల పాటు యాక్సెస్ అందిస్తుంది.

ఇక, రూ. 1999 ప్లాన్ విషయానికి వస్తే.. దీని కింద 500GB రెగ్యులర్ డేటాతో పాటు 100GB అదనపు డేటా లభిస్తుంది. ఈ ప్లాన్​ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. వ్యాలిడిటీ పూర్తయ్యాక ఇంటర్నెట్​ స్పీడ్​ 80 Kbps కి పడిపోతుంది. ఏ నెట్‌వర్క్‌కు అయినా రోజుకు 100 SMS లను అందిస్తుంది. మరోవైపు 365 రోజుల పాటు లోక్‌ధున్ కంటెంట్‌కు యాక్సెస్, 365 రోజుల పాటు ఈరోస్ నౌ ఎంటర్​టైన్​మెంట్​ సర్వీసులకు యాక్సెస్ అందిస్తుంది.

బీఎస్​ఎన్​ఎల్​ కొత్తగా రూ .1498 ధరతో కొత్త ప్రీపెయిడ్ వార్షిక డేటా వోచర్‌ను కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ డేటా వోచర్ కింద అన్​లిమిటెడ్​ స్పీడ్​ గల 2GB డేటా అందిస్తోంది. ఆ తర్వాత డేటా స్పీడ్​ 40 Kbps కి పడిపోతుంది. ఈ ప్లాన్ ఆగస్టు 23 నుంచి అన్ని సర్కిళ్లలో అందుబాటులోకి వచ్చింది.
Published by:Sambasiva Reddy
First published: