ఫేస్‌బుక్‌కు బ్రిటీష్ రెగ్యులేటర్ జరిమానా!

కేంబ్రిడ్జ్ అనలిటికా స్కామ్‌లో ఫేస్‌బుక్ బుక్కైంది. యూజర్ల డేటాను రీసెర్చ్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వాడుకున్న వ్యవహారంలో ఫేస్‌బుక్‌కు 5,00,000 పౌండ్ల జరిమానా విధించనుంది బ్రిటీష్ రెగ్యులేటర్.


Updated: July 11, 2018, 2:37 PM IST
ఫేస్‌బుక్‌కు బ్రిటీష్ రెగ్యులేటర్ జరిమానా!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రీసెర్చ్ సంస్థ అయిన కేంబ్రిడ్జ్ అనలిటికా 8 కోట్లకు పైగా ఫేస్‌బుక్ యూజర్ల పర్సనల్ డేటాను దుర్వినియోగం చేసిన వ్యవహారం సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. అమెరికాతో పాటు యురోపియన్ యూనియన్ విచారణను ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్క్ ఎదుర్కొన్నారు కూడా. డేటా రక్షణ చట్టాన్ని ఉల్లంఘించిన ఫేస్‌బుక్‌కు జరిమానా విధించాలని అనుకుంటున్నట్టు బ్రిటన్‌కు చెందిన ఇన్ఫర్మేషన్ రెగ్యులేటర్ తెలిపింది.

రీసెర్చ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా ఫేస్‌బుక్ యూజర్ల డేటాను రాజకీయ ప్రచారాల కోసం ఉపయోగించుకున్నట్టు బ్రిటన్‌‌ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎలిజబెత్ డెన్హామ్ విచారణలో తేలింది. 5,00,000 పౌండ్లు(సుమారు 4.5 కోట్లు) జరిమానా విధిస్తున్నట్టు తెలిపారామె. అయితే 40 లక్షల కోట్ల మార్కెట్‌ విలువగల ఫేస్‌బుక్‌కు ఈ జరిమానా చాలా చాలా తక్కువ. అయితే డేటా రక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తే విధించే గరిష్ట జరిమానా ఇంతే.

యూజర్ల సమాచారాన్ని రక్షించడంలో ఫేస్‌బుక్ విఫలమైందని, డేటా ఇతర ప్లాట్‌ఫామ్స్ ఎలా ఉపయోగించుకుంటాయన్న విషయంపై పారదర్శకంగా వ్యవహరించలేదు. కొత్త టెక్నాలజీ ద్వారా ఒక్కో ఓటర్‌ను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసేందుకు డేటా అనలిటిక్స్ ఉపయోగపడుతోంది. కానీ ఇది చట్టం దృష్టిలో ఏమాత్రం పారదర్శకం, న్యాయం, సమ్మతించదగ్గది కాదు.
ఎలిజబెత్ డెన్హామ్, బ్రిటన్‌‌ ఇన్ఫర్మేషన్ కమిషనర్


బ్రిటన్‌‌ ఇన్ఫర్మేషన్ కమిషనర్ తుది నిర్ణయం తీసుకోకముందే స్పందిస్తామని ఫేస్‌బుక్ చెబుతోంది. కేంబ్రిడ్జి అనలిటికా వ్యవహారంలో గతంలోనే లోతుగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాల్సింది అని ఫేస్‌బుక్ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ ప్రకటన విడుదల చేశారు. ఇన్ఫర్మేషన్ కమిషనర్ కార్యాలయంతో పాటు మిగతా దేశాల్లోనూ అధికారులతో కలిసి పనిచేస్తున్నామన్నారు.
Published by: Santhosh Kumar S
First published: July 11, 2018, 2:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading