Home /News /technology /

BRING BEST FLAGSHIP OF 2020 ONEPLUS 8T SMARTPHONE TO YOUR HOME IN THIS FESTIVE SEASON SS

ఈ పండుగ సీజన్ మీ ఇంటికి తీసుకువచ్చే సరికొత్త ఫోన్: 2020 ఉత్తమ Flagship OnePlus 8T

ఈ పండుగ సీజన్ మీ ఇంటికి తీసుకువచ్చే సరికొత్త ఫోన్: 2020 ఉత్తమ Flagship OnePlus 8T

ఈ పండుగ సీజన్ మీ ఇంటికి తీసుకువచ్చే సరికొత్త ఫోన్: 2020 ఉత్తమ Flagship OnePlus 8T

OnePlus 8 నుండి మెరుగుపరచబడిన OnePlus 8T లోని క్వాడ్-కెమెరా మెరుగైన AI ఆప్టిమైజేషన్లతో మరియు నైట్ స్కేప్ కలిగిన మెరుగైన నైట్ మోడ్‌ ఉండడంతో బయట వెలుతురుతో సంబందం లేకుండా అద్భుతమైన ఫోటోలను అందిస్తుంది.

  OnePlus 8T ప్రపంచంలోనే అత్యుత్తమమైన స్మార్ట్ ఫోన్లలో ఒకటిగా నిలిచి మరోసారి తన ఉనికిని చాటుకుంది. తరచుగా కనిపించే ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో సరసమైన ధరలకే లభిస్తూ ఆకట్టుకునే స్పెక్స్ కలిగిన OnePlus 8T మంత్ర ఇటీవలే విడుదలై మన ముందుకు వచ్చేసింది. 120Hz ఫ్లూయిడ్ AMOLED, సరికొత్త Snapdragon 865 చిప్, తక్కువ కాంతితోనే మెరుగైన పనితీరు కలిగి సురక్షితమైన క్వాడ్-కెమెరా వంటి అద్భుతమైన ఫీచర్లు కలిగిఉన్న ఫ్లాగ్‌షిప్ పోన్ ఆండ్రాయిడ్ 11 తో ఈ పండగ ప్రత్యేకతను సంతరించుకుంది.

  120Hz ఫ్లూయిడ్ డిస్‌ప్లే:


  Corning Gorilla Glass 5 తో కూడిన 6.55” ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లే స్పష్టతని అందించడమే కాకుండ 120Hz ఫ్లూయిడ్ డిస్‌ప్లే లో స్క్రోలింగ్ కూడ గమ్మతుగా ఉంటుందని OnePlus 8T డిస్‌ప్లే మరోసారి నిరూపించింది. 1100 నిట్ల అత్యంత ప్రకాశంతో ఉండే OnePlus 8T ని ఎటువంటి పరిస్థితులలోనైన సునాయాసంగ ఉపయోగించగలరు. మీకు నచ్చిన కార్యక్రమాలు చూడడానికి, మీరు మెచ్చిన ఆటలు ఆడేసమయంలో ఫోను వేడెక్కడం, మధ్యలో ఆగిపోవడం వంటి ఎటువంటి ఆసౌకర్యాలు లేకుండా OnePlus 8Tను తయారుచేయడం జరిగింది.

  65W ఫాస్ట్ ఛార్జింగ్:


  అత్యంత మెరుగైన 65W వ్రాప్ ఛార్జ్‌ను చేర్చడం వలన OnePlus 8T తనదైన ప్రత్యేకతను సంపాదించుకుంది. 4500 mAh బ్యాటరీ రోజువారీ పనులకు సరిపోవడమే కాకుండ 45నిమిషాల కంటే తక్కువ వ్యవదిలోనే ఫుల్ చార్జింగ్ అవ్వటంతో పాటు, 15నిమిషాల చార్జింగ్ తోనే రోజుమొత్తం సరిపోయే సామర్థ్యం ఉండడంతో ఎక్కడికైన హడావిడిగ వెళ్ళాలంటే ఇప్పుడు దిగులే అవసరం లేదు.

  అద్భుతమైన కెమెరాలు:


  OnePlus 8 నుండి మెరుగుపరచబడిన OnePlus 8T లోని క్వాడ్-కెమెరా మెరుగైన AI ఆప్టిమైజేషన్లతో మరియు నైట్ స్కేప్ కలిగిన మెరుగైన నైట్ మోడ్‌ ఉండడంతో బయట వెలుతురుతో సంబందం లేకుండా అద్భుతమైన ఫోటోలను అందిస్తుంది. OnePlus 8T లోని అల్ట్రా-వైడ్ కెమెరా సంపూర్ణమైన 123-డిగ్రీలు వీక్షిస్తూ, 5MP మాక్రో కెమెరా కంటే ఎక్కువ రెజల్యూషన్‌ తో ఫ్లాగ్‌షిప్-క్వాలిటీ ఇమేజెస్ మరియు వీడియోలను అందించడమేకాకుండా వీడియో ఫోకస్ ట్రాకింగ్, వీడియో పోర్ట్రెయిట్ మరియు వీడియో నైట్‌స్కేప్ వంటి అత్యద్భుతమైన లక్షణాలను కలిగిఉంది. ఇది బోకే -లాంటి పోర్ట్రెయిట్ ప్రభావాన్ని జోడించడం, స్థిరమైన వీడియోలను షూట్ చేసేటప్పుడు లేదా చిత్రీకరించేటప్పుడు ఒక ఫ్రేమ్‌లో వస్తువులను ట్రాక్ చేయడం, వీడియోలను రికార్డ్ వంటి పనులను సునాయాసంగా చేయగలగడం వలన కల్కి కోచ్లిన్ పూర్తి వీడియో OnePlus 8Tని ఉపయోగించి చిత్రీకరించబడటంలో ఆశ్చర్యం లేదు.

  అధునాతన Android 11:


  సరికొత్త Android 11, OxygenOS11 కు సమానమైన క్లీన్ UI తో Google కు అనుసందానం లేని స్మార్ట్‌ఫోన్‌లలో OnePlus 8T మొట్టమొదటిది. OxygenOS11లో డిజిటల్ డీటాక్ష్ లక్ష్యాలను చేరుకోవడంలో మెరుగుపరిచిన Zen మోడ్, ఎల్లప్పుడూ ఆన్-డిస్ప్లే, కొత్త గడియార ఎంపికలు, కొత్త వన్‌ప్లస్ సాన్స్ ఫాంట్ వంటి మరెన్నో లక్షణాలు కలిగిఉన్నాయి.

  ఆఫర్లు:


  OnePlus 8T లూనార్ సిల్వర్, ఆక్వామారిన్ గ్రీన్ రెండు రంగులలో అందుబాటులో ఉండి 42,999/- రూపాయలకు 8GB RAM, 128GB స్టోరేజ్ మరియు 45,999/- రూపాయలకు 2GB RAM, 256GB స్టోరేజ్ లను పొందవచ్చు. Amazon India Citibank, Kotak Bank మరియు ICICI Bank జారీ చేసిన కార్డులతో కొనుగోలు చేస్తే ప్రస్తుతం 10% తక్షణ డిస్కౌంట్ మరియు ఆరు నెలల వరకు ఖర్చు లేని EMI ని అందిస్తోంది. మీ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌ ను మీరు 14,500/- రూపాయల వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ కూడ పొందవచ్చు. OnePlus online store ప్రముఖ బ్యాంకులలో మూడు నెలల నో-కాస్ట్ EMI తో పాటు HDFC Bank కార్డులపై 2000/- రూపాయల తగ్గింపు, సులువైన EMIతో మరిన్ని ఆఫర్లను అందిస్తోంది, మీరు 4990/- బదులుగా 4491/-INR కే ఇప్పుడు OnePlus Buds కూడా పొందవచ్చు.
  అత్యద్భుతంగా పనిచేసే సూపర్ డిస్‌ప్లే, క్లియర్ వీడియోలు చిత్రించే కెమెరా, ముఖ్యంగా 65W ద్వారా వేగంగా ఛార్జింగ్ అయ్యే బ్యాటరీ పనితీరు వంటి అత్యుత్తమమైన ఫోన్ OnePlus 8T కంటే మంచి బహుమతి ఈ పండగకు ఏముంటుంది.
  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Amazon Great Indian Festival Sale, AMAZON INDIA, Oneplus, Smartphone

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు