BREAKING NEWS TWITTER DEAL TEMPORARILY ON HOLD TWEETS ELON MUSK SS
Breaking News: ట్విట్టర్ డీల్‌కు తాత్కాలికంగా బ్రేక్... ట్వీట్ చేసిన ఎలాన్ మస్క్
Breaking News: ట్విట్టర్ డీల్‌కు తాత్కాలికంగా బ్రేక్... ట్వీట్ చేసిన ఎలాన్ మస్క్
(Elon Musk File Photo)
Twitter Deal | ఎలాన్ మస్క్ 44బిలియన్ డాలర్ల డీల్‌తో ట్విట్టర్‌ని సొంతం చేసుకుంటున్నట్టు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ డీల్‌కు బ్రేక్ పడిందని ఆయన ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ డీల్‌కు (Twitter Deal) తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ ట్వీట్ (Elon Musk Tweets) ద్వారా ప్రకటించారు. ట్విట్టర్ నుంచి స్పామ్ బాట్స్‌ని తొలగించడం తన ప్రాధాన్యతల్లో ఒకటని అన్నారు. ఎలాన్ మస్క్ 44బిలియన్ డాలర్ల డీల్‌తో ట్విట్టర్‌ని సొంతం చేసుకుంటున్నట్టు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ డీల్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడిందని ఆయన ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. స్పామ్, నకిలీ ఖాతాలను పరిగణలోకి తీసుకుంటే వాస్తవాని కన్నా 5 శాతం కంటే తక్కువ యూజర్లను సూచిస్తున్నాయని, ట్విట్టర్ యూజర్ల లెక్కకు మద్దతునిచ్చే వివరాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు. అందుకే స్పామ్ బాట్స్‌ని తొలగించడమే తన ప్రాధాన్యతల్లో ఒకటని అన్నారు.
Twitter deal temporarily on hold pending details supporting calculation that spam/fake accounts do indeed represent less than 5% of usershttps://t.co/Y2t0QMuuyn
ఎలాన్ మస్క్ ట్వీట్‌తో ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో ట్విట్టర్ షేర్లు 20 శాతం పతనం అయ్యాయి. దీనిపై ట్విట్టర్ స్పందించాల్సి ఉంది. కంపెనీ మొదటి త్రైమాసికంలో డైలీ యాక్టీవ్ యూజర్లలో 5 శాతం కంటే తక్కువ తప్పుడు లేదా స్పామ్ అకౌంట్స్ ఉన్నట్టు అంచనా వేసింది. ఎలాన్ మస్క్‌తో ఒప్పందం ముగిసే వరకు, ప్రకటనదారులు ట్విట్టర్లో ప్రకటనలు కొనసాగించాలా వద్దా అనే దానితో సహా, ఇతర రిస్కులు ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మొదట ట్విట్టర్లో 9 శాతం వాటాలు కొన్నట్టు ఏప్రిల్ 4న ప్రకటించారు. ట్విట్టర్లో 9.2 శాతం వాటా సొంతం చేసుకున్నట్టు వెల్లడించారు. ఆ తర్వాత 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను సొంతం చేసుకుంటున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఈ డీల్ హోల్డ్‌లో ఉన్నట్టు ఆయన ట్వీట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది.
మరోవైపు ట్విట్టర్ తన అగ్ర నాయకత్వాన్ని పునర్నిర్మిస్తోంది. ట్విట్టర్ తన కన్స్యూమర్ ప్రొడక్ట్ లీడర్ అయిన కేవాన్ బేక్‌పౌర్, రెవెన్యూ ప్రొడక్ట్ హెడ్ బ్రూస్ ఫాల్క్‌లను తొలగించింది. వీరిద్దరు ట్విట్టర్ ఫీచర్స్‌తో పాటు రెవెన్యూ విభాగాలను చూసుకున్నారు. ఇక 2021 నవంబర్‌లో కన్స్యూమర్ ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరిన జే సల్లివాన్ ట్విట్టర్ కన్స్యూమర్ ప్రొడక్ట్ టీమ్‌ను చూసుకుంటారు. టెస్లా అధినేత ట్విట్టర్ డీల్ తర్వాత ఈ సోషల్ మీడియా సంస్థలో మార్పులు జరుగుతుండటం విశేషం. ఇంతలో మస్క్ డీల్ హోల్డ్‌లో ఉన్నట్టు ప్రకటించడం గందరగోళంగా మారింది. మరి ఈ డీల్ ముందుకు వెళ్తుందా? ఏం జరుగుతుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.