Home /News /technology /

BREAKING NEWS CENTRAL GOVERNMENT BANS 22 YOUTUBE NEWS CHANNELS CHECK ALL DETAILS HERE SS

Breaking News: యూట్యూబ్ న్యూస్ ఛానెళ్లపై కేంద్రం కొరడా... 22 ఛానెళ్లపై నిషేధం

Breaking News: యూట్యూబ్ న్యూస్ ఛానెళ్లపై కేంద్రం కొరడా... 22 ఛానెళ్లపై నిషేధం
(ప్రతీకాత్మక చిత్రం)

Breaking News: యూట్యూబ్ న్యూస్ ఛానెళ్లపై కేంద్రం కొరడా... 22 ఛానెళ్లపై నిషేధం (ప్రతీకాత్మక చిత్రం)

Breaking News | ఐటీ రూల్స్‌ని ఉల్లంఘిస్తున్నారన్న కారణంతో కేంద్ర ప్రభుత్వం 18 భారతీయ యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్, 4 పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెల్స్, 3 ట్విట్టర్ అకౌంట్స్, 1 ఫేస్‌బుక్ అకౌంట్, 1 న్యూస్ వెబ్‌సైట్‌ని నిషేధించింది.

ఇప్పటికే చైనా యాప్స్‌పై నిషేధాస్త్రాన్ని సంధించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం కొరడా ఝళిపించింది. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రతకు భంగం కలిగిస్తున్నాయన్న కారణంతో ఇప్పటికే 320 యాప్స్‌ని నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు 2021 ఐటీ రూల్స్‌ని ఉల్లంఘిస్తున్నారన్న కారణంతో 22 యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్, 3 ట్విట్టర్ అకౌంట్స్, 1 ఫేస్‌బుక్ అకౌంట్, 1 న్యూస్ వెబ్‌సైట్‌ని నిషేధించింది. బ్యాన్ చేసిన యూట్యూబ్ ఛానెళ్లు, ట్విట్టర్ అకౌంట్స్, ఫేస్‌బుక్ అకౌంట్, న్యూస్ వెబ్‌సైట్ వివరాలను కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వం నిషేధించిన యూట్యూబ్ ఛానెళ్లలో మొత్తం వ్యూయర్‌షిప్ 260 కోట్లకు పైగా ఉన్నట్టు తేలింది. ఈ యూట్యూబ్ ఛానెల్స్ జాతీయ భద్రత, భారతదేశ విదేశీ సంబంధాలకు సంబంధించి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నాయని, సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

గతేడాది ఐటీ రూల్స్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యూట్యూబ్ న్యూస్ పబ్లిషర్స్‌పై చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన యూట్యూబ్ న్యూస్ ఛానెళ్లలో 18 భారతదేశానికి చెందినవి కాగా, 4 పాకిస్తాన్‌కు చెందినవి. ఈ యూట్యూబ్ ఛానెల్స్ అన్నీ భారత సాయుధ బలగాలు, జమ్మూ కాశ్మీర్ లాంటి అంశాలపై ఫేక్‌న్యూస్ సర్క్యులేట్ చేస్తున్నాయి.

Poco X4 Pro: రూ.18,999 విలువైన మొబైల్ రూ.6,549 ధరకే... నేటి నుంచే ఆఫర్


పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్న పలు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా భారతదేశానికి వ్యతిరేకంగా కంటెంట్ పోస్ట్ చేస్తున్నట్టు భారత ప్రభుత్వం గుర్తించింది. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు సంబంధించి భారతీయ యూట్యూబ్ ఛానెళ్లు ప్రసారం చేస్తున్న కంటెంట్ భారతదేశ విదేశీ సంబంధాలను దెబ్బతీసే లక్ష్యంతో ఉన్నట్టు గుర్తించింది.

బ్లాక్ చేయబడిన భారతీయ యూట్యూబ్ ఛానెల్స్ ప్రముఖ టీవీ వార్తా ఛానెళ్ల లోగోలు, యాంకర్ల ఫోటోలు ఉపయోగిస్తూ వీక్షకుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. తప్పుడు థంబ్‌నెయిల్స్ ఉపయోగించి వీడియోలను పబ్లిష్ చేస్తున్నాయి. ఆ వీడియోలను వైరల్ చేసేందుకు టైటిల్స్, థంబ్‌నెయిల్స్ రూపొందిస్తున్నాయి.

BSNL Plan: ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్‌పై రూ.1,50,000 వరకు ప్రైజ్ మనీ... పూర్తి వివరాలివే

పాకిస్తాన్ నుంచి భారతదేశ వ్యతిరేక తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. జాతీయ భద్రత, భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, పబ్లిక్ ఆర్డర్ లాంటివాటిని దృష్టిలో పెట్టుకొని 2021 డిసెంబర్ నుంచి కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ 78 యూట్యూబ్ బేస్డ్ న్యూస్ ఛానెల్స్‌, సోషల్ మీడియా అకౌంట్స్ నిషేధించాలని ఆదేశాలు జారీ చేసింది.

భారత ప్రభుత్వం ప్రామాణికమైన, విశ్వసనీయమైన, సురక్షితమైన ఆన్‌లైన్ వార్తా మీడియా వాతావరణాన్ని నిర్ధారించడానికి కట్టుబడి ఉందని, భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్‌ను అణగదొక్కే ప్రయత్నాలను అడ్డుకుంటుందని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం నిషేధించిన 18 భారతీయ యూట్యూబ్ ఛానెల్స్


ARP News
AOP News
LDC News
SarkariBabu
SS ZONE Hindi
Smart News
News23Hindi
Online Khabar
DP news
PKB News
KisanTak
Borana News
Sarkari News Update
Bharat Mausam
RJ ZONE 6
Exam Report
Digi Gurukul
दिनभरकीखबरें

కేంద్ర ప్రభుత్వం నిషేధించిన 4 పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెల్స్ ఇవే...


DuniyaMeryAagy
Ghulam NabiMadni
HAQEEQAT TV
HAQEEQAT TV 2.0

కేంద్ర ప్రభుత్వం నిషేధించిన వెబ్‌సైట్: Dunya Mere Aagy

కేంద్ర ప్రభుత్వం నిషేధించిన పాకిస్తాన్ ట్విట్టర్ అకౌంట్స్: Ghulam NabiMadni, DunyaMeryAagy, Haqeeqat TV

కేంద్ర ప్రభుత్వం నిషేధించిన ఫేస్‌బుక్ అకౌంట్: DunyaMeryAagy
Published by:Santhosh Kumar S
First published:

Tags: Youtube, Youtube channel

తదుపరి వార్తలు