Boult Neckband: మార్కెట్లోకి బౌల్ట్ ప్రోబాస్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్లు లాంచ్.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందించిన బౌల్?

ప్రతీకాత్మకచిత్రం

వైర్‌లెస్ ఇయర్ పాడ్స్, నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్లను ఇటీవల కాలంలో యువత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా నెక్ బ్యాండ్ స్టైల్ ఆడియో డివైజ్‌లను విరివిగా ఉపయోగిస్తున్నారు. వీరిని ఆకర్షించేందుకు సరికొత్త ఇయర్‌ఫోన్లను లాంచ్ చేసింది బౌల్ట్ సంస్థ.

  • Share this:
వైర్‌లెస్ ఇయర్ పాడ్స్, నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్లను ఇటీవల కాలంలో యువత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా నెక్ బ్యాండ్ స్టైల్ ఆడియో డివైజ్‌లను విరివిగా ఉపయోగిస్తున్నారు. వీరిని ఆకర్షించేందుకు సరికొత్త ఇయర్‌ఫోన్లను లాంచ్ చేసింది బౌల్ట్ సంస్థ. తాజాగా బౌల్ట్ ఆడియో నుంచి ‘బౌల్ట్ ప్రో బాస్ క్యూ ఛార్జ్ నెక్‌బ్యాండ్’ స్టైల్ ఇయర్ ఫోన్లు భారత మార్కెట్లో విడుదలయ్యాయి. వీటిలో ఫాస్ట్ ఛార్జింగ్, 24 గంటల బ్యాటరీ లైఫ్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అందుబాటులో ధరలో, మూడు విభిన్న కలర్స్‌లో ఇవి లభ్యమవుతున్నాయి. వాటర్ రెసిస్టెంట్‌, వర్చువల్ అసిస్ట్స్ అయిన గూగుల్ అసిస్టెంట్, సిరి యాక్సెస్ వంటి ప్రత్యేకతలు కూడా వీటిలో ఉన్నాయి. బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లను యూజర్లు పొందవచ్చని బౌల్ట్ ప్రకటించింది. ధర తక్కువగా ఉన్నప్పటికీ సౌండ్ క్వాలిటీలో ఏమాత్రం రాజీపడట్లేదు ఈ కంపెనీ. వీటిలో ప్రీమియం సౌండ్ క్వాలిటీని అందిస్తోంది. తక్కువ ధరలో ఇయర్ ఫోన్లు కావాలనుకునేవారికి వీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వవచ్చు.

బౌల్ట్ ప్రో బాస్ క్యూఛార్జ్ నెక్ బ్యాండ్ ధర..
ప్రో బాస్ క్యూఛార్జ్ నెక్ బ్యాండ్‌ను రూ.1199కు సొంతం చేసుకోవచ్చు. ఈ ఇయర్ ఫోన్లు అమెజాన్‌లో లభ్యమవుతున్నాయి. బ్లాక్, బ్లూ, గ్రీన్ లాంటి మూడు విభిన్న రంగుల్లో అందుబాటులోకి వచ్చిన ఈ ఇయర్ ఫోన్లకు, సంస్థ ఓ సంవత్సరం వారంటీ ఇచ్చింది.

ఇది చదవండి : Cloud Professionals: భారత్‌లో క్లౌడ్ ప్రొఫెషనల్స్‌కు పెరుగుతున్న డిమాండ్... 2025 నాటికి 20 లక్షల మంది అవసరం

స్పెసిఫికేషన్లు..
ఈ సరికొత్త ఇయర్ ఫోన్లలో ఎయిరో స్పేస్ గ్రేడ్ అల్లాయ్ మైక్రో వూఫర్లు ఉన్నాయి. ఫలితంగా మెరుగైన ఆడియో క్వాలిటీని ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా ఎక్స్‌ట్రా బాస్ కూడా ఇందులో పొందుపరిచారు. సింగిల్ ఛార్జింగ్‌తో 24 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయి. యూఎస్బీ టైప్-సీ పోర్టుతో 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే బ్యాటరీ లైఫ్ 15 గంటల వరకు ఉంటుంది. బౌల్ట్ ప్రోబాస్ ఫిట్నెస్ ఔత్సాహికులకు గొప్ప డివైజ్. ఎందుకంటే ఇందులో వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌ ఉంది. ఎర్గోనామిక్, సౌకర్యవంతమైన డిజైన్, మ్యాగ్నెటిక్ ఇయర్ బడ్స్ దీని సొంతం. ఉపయోగించనప్పుడు వీటి వైర్లు చిక్కుకుపోకుండా ఉండేలా వీటిని రూపొందించారు.
Published by:Krishna Adithya
First published: