హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp: గూగుల్‌ డ్రైవ్‌ లేకుండా కొత్త ఫోన్‌లోకి వాట్సప్​ డేటా ట్రాన్స్‌ఫర్‌ చేయండిలా

WhatsApp: గూగుల్‌ డ్రైవ్‌ లేకుండా కొత్త ఫోన్‌లోకి వాట్సప్​ డేటా ట్రాన్స్‌ఫర్‌ చేయండిలా

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

WhatsApp | అమెజాన్ సేల్ లేదా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నారా? పాత మొబైల్‌లోని వాట్సప్ డేటాను (WhatsApp Data Transfer) కొత్త మొబైల్‌లోకి గూగుల్ డ్రైవ్ అవసరం లేకుండా ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో తెలుసుకోండి.

ప్రముఖ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్ ​వాట్సాప్​ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఛాటింగ్​తో పాటు ఎంతో కీలకమైన డేటా వాట్సాప్​లో (WhatsApp) ఉంటుంది. అయితే, కొత్త ఫోన్​ కొన్నప్పుడుపాత ఫోన్​లోని డేటాను కొత్త దానిలోకి ట్రాన్స్​ఫర్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు చాలా మంది.ఈ క్రమంలో ఒక ఫోన్‌లోని వాట్సప్ డేటా మరో ఫోన్‌లోకి సులభంగా ట్రాన్స్‌ఫర్‌ (WhatsApp Data Transfer) చేసుకునేందుకు అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.ఇటీవలే గూగుల్‌ డ్రైవ్‌, ఐక్లౌడ్‌ బ్యాకప్స్‌ వంటి ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ అయ్యే సదుపాయాన్ని వాట్సాప్‌ యాడ్‌ చేసింది. వీటితో సులభంగా డేటా ట్రాన్స్​ఫర్​ చేసుకోవచ్చు.

అయితే గూగుల్‌ డ్రైవ్‌ లేకుండా డేటా ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు మీకు RAR లాంటి ఫైల్‌ కంప్రెషన్‌ యాప్‌ అవసరం. మీ పైల్స్‌ అన్ని ఆఫ్‌లైన్‌లో బ్యాకప్‌ చేసుకొని వాటిని ఒక సింగిల్‌ ఫోల్డర్‌లో వేసి మరో ఫోన్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవాలి. మీకు వై-ఫై అందుబాటులో లేని సమయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. వాట్సాప్​ డేటా ట్రాన్స్​ఫర్​కు ఉన్న ఆప్షన్ల గురించి తెలుసుకుందాం.

Moto E40: మోటో ఇ40 సేల్ మొదలైంది... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ ధర రూ.8,550 మాత్రమే

వాట్సప్‌లో లోకల్‌ బ్యాకప్‌ క్రియేట్‌ చేయాలి


వాట్సప్‌ హోమ్‌ పేజీలో కుడి వైపు కనిపించే త్రీ డాట్స్‌ వైపు వెళ్లి క్లిక్‌ చేసి అక్కడ కనిపించే సెట్టింగ్స్‌/చాట్‌/చాట్‌ బ్యాకప్‌లో బ్యాకప్‌పై ట్యాప్‌ చేయాలి.లోకల్‌ బ్యాకప్‌ క్రియేట్‌ అయిన తర్వాత గూగుల్‌ డ్రైవ్ర్ ప్రాంప్ట్‌ను మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. మీ ఫోన్‌ ఇంటర్నల్‌ స్టోరేజీలో లోకల్‌ బ్యాకప్‌ క్రియేట్ అవుతుంది. లోకల్‌ బ్యాకప్‌ రెడీ అయిన తర్వాత మీరు మీ పాత డివైస్‌లో వాట్సప్‌ అన్‌ ఇన్‌స్టాల్‌ చేయవచ్చు.

RAR లేదా ఏదైనా ఫైల్‌ కంప్రెషన్‌ అప్లికేషన్ ఇన్‌స్టాల్‌ చేసుకోవడం


గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి RAR యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని సెటప్‌ పూర్తి చేయాలి. మీ మొత్తం వాట్సప్‌ డేటాను సింగిల్‌ ఫైల్‌గా కంప్రెస్‌ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. RAR కాకపోతే మీకు నచ్చిన వేరే ఏదైనా యాప్‌ ఎంచుకోవచ్చు.

Banned Apps: మరిన్ని యాప్స్ బ్యాన్ చేసిన గూగుల్... ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా?

వాట్సప్‌ డేటా కంప్రెస్‌ చేయడం


RAR యాప్‌లో మీరు మీ ఫోన్‌ ఇంటర్నల్‌ స్టోరేజీ డైరెక్టరీని చూడవచ్చు. అందులోని ‘కామ్‌ వాట్సప్‌’ ఫోల్డర్‌ను ఎంచుకోండి. దాని పక్కనుండే టిక్‌ మార్క్‌ సెలక్ట్ చేసి ఆ ఫోల్డర్‌ పైన కనిపించే+ సింబల్​పై క్లిక్​ చేయండి.మొత్తం ఫోల్డర్‌ ఒక .rar ఫైల్‌లో సేవ్​అవుతుంది. మీ మొత్తం వాట్సప్‌ డేటాను కంప్రెస్‌ చేసేందుకు చాలా టైమ్‌ పడుతుంది. దానికి బదులుగా మీరు .zip ఫైల్‌ ఎంచుకోవడం మంచిది.

కొత్త ఫోన్‌లోకి డేటా ట్రాన్స్‌ఫర్‌ చేయడం


కంప్రెస్‌ చేసిన .rar లేదా .zip ఫైల్‌ను మీరు కొత్త ఫోన్‌లోకి ట్రాన్స్​ఫర్​ చేసుకోండి.ఆ ఫైల్‌ను అన్‌జిప్‌ చేసేందుకు మరోసారి RAR ఉపయోగించండి. దీనిని ఇంటర్నల్‌ స్టోరేజ్‌/ఆండ్రాయిడ్‌/మీడియాలోలో స్టోర్‌ చేయాలి.

కొత్త ఫోన్‌లో వాట్సప్‌ ఇన్‌స్టాల్‌ చేయడం


ఇప్పుడు మీరు కొత్త ఫోన్‌లో వాట్సప్‌ ఇన్‌స్టాల్‌ చేయండి. గూగుల్‌ డ్రైవ్‌ బ్యాకప్‌ ప్రాంప్ట్‌ స్కిప్‌ చేయండి. తద్వారామనం రిస్టోర్‌ చేసిన ఫైల్స్‌ను అది గుర్తిస్తుంది.బ్యాకప్‌ను రిస్టోర్‌ చేసి ఇన్‌స్టాలేషన్‌ ప్రాసెస్‌ కొనసాగించండి.ఇది పూర్తైందంటే మీ కొత్త ఫోన్‌లో వాట్సప్‌ అకౌంట్‌ సిద్ధమైనట్టే. ఆ తర్వాత .rar లేదా .zip ఫైల్స్​నుక్రియేట్‌ చేసి డిలీట్‌ చేయవచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Mobile News, Mobiles, Smartphone, Whatsapp

ఉత్తమ కథలు