ఈ కరోనా కష్ట కాలంలో గ్యాస్ సిలిండర్ ధరలు పేదల పాలిట గుదిబండలాగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతుం హైదరాబాద్ లో 14.2 కేజీల సిలిండర్ ధర రూ. 861గా ఉంది. కరోనా దెబ్బకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న అనేక మంది గ్యాస్ సిలిండర్ ను ఇంత ధరతో బుక్ చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రముఖ పేమెంట్స్ యాప్ పేటీఎం గ్యాస్ సిలిండ్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్యాస్ బుకింగ్ పై భారీ క్యాష్ బ్యాక్ ను ప్రకటించింది సంస్థ. గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై రూ. 800 వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నట్లు తెలిపింది. అంటే రూ. 61కే సిలిండర్ పొందే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్ ఈ నెల 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మొదటి సారి పేటీఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారికి మాత్రం వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది.
ఈ ఆఫర్ పొందడం కోసం గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.
1.మొదటగా పేటీఎం యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
2.అనంతరం ‘Recharge and Pay Bills’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
3. తర్వాత మీకు ‘book a cylinder’ ఆప్షన్ మీకు కనిపిస్తుంది.
4.అనంతరం మీ గ్యాస్ ప్రొవైడర్ ను ఎంచుకుని మీ వివరాలు నమోదు చేయాలి.
5. అనంతరం ‘Proceed to Pay’ ఆప్షన్ పై క్లిక్ చేసి బిల్ చెల్లించాలి.
Online Banking: ఆన్ లైన్ బ్యాంకింగ్ చేసే వారికి అలర్ట్.. ఈ 12 తప్పులు అస్సలు చేయకండి
6.ఇలా మొదటి సారి బుక్ చేసిన వారికి అటోమెటిగా ఆఫర్ అప్లై అవుతుంది.
7.గ్యాస్ సిలిండర్ బుకింగ్ అనంతరం స్క్రాచ్ కార్డు వస్తుంది.
8.ఆ స్క్రాచ్ కార్డును ఓపెన్ చేసి క్యాష్ బ్యాక్ ను పొందొచ్చు.
9. క్యాష్ బ్యాక్ రూ. 10 నుంచి రూ.800 ఎంతైనా రావొచ్చు.
10. స్క్రాచ్ కార్డును 7 రోజుల్లోగా వినియోగించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bharat Gas, HP gas, Indane Gas, LPG Cylinder, Paytm