Home /News /technology /

BONANZA OF CAR COMPANIES ON THE OCCASION OF FESTIVE SEASON READY TO GIVE A HUGE DISCOUNT TAKE A LOOK UMG GH

Passenger Vehicles: కార్ల కంపెనీల బంపర్ బొనాంజా.. పండగకు భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు రెడీ !

 పండుగ సీజన్  సందర్భంగా  కార్ల కంపెనీల బొనాంజా .. భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు రెడీ ! లుక్కేయండి

పండుగ సీజన్ సందర్భంగా కార్ల కంపెనీల బొనాంజా .. భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు రెడీ ! లుక్కేయండి

పండుగ(Festival) సీజన్‌కు ముందు ప్యాసింజర్ వెహికల్‌ ప్రొడక్షన్‌ను పెంచుతున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు. పండుగ సమయాల్లో స్పెషల్ డిస్కౌంట్లు అందించి, సేల్స్(Sales) పెంచుకోవడానికి సిద్ధమవుతున్నాయి. కంపెనీల నుంచి అవుట్‌పుట్‌ పెరగడంతో డీలర్‌షిప్‌ల వద్దకు ఎక్కువ స్టాక్‌ చేరుకుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
పండుగ(Festival) సీజన్‌కు ముందు ప్యాసింజర్(Passenger) వెహికల్‌ ప్రొడక్షన్‌ను పెంచుతున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు. పండుగ సమయాల్లో స్పెషల్ డిస్కౌంట్లు అందించి, సేల్స్ పెంచుకోవడానికి సిద్ధమవుతున్నాయి. కంపెనీల నుంచి అవుట్‌పుట్‌ పెరగడంతో డీలర్‌షిప్‌ల వద్దకు ఎక్కువ స్టాక్‌ చేరుకుంది. గత నాలుగు నెలల్లో రిటైల్ అమ్మకాలు హోల్‌సేల్స్‌లో కంపెనీలు వెనుకబడి ఉన్నాయి. ఇది డిమాండ్-సప్లై మిస్‌మ్యాచ్‌ను సూచిస్తుంది. అయితే సంవత్సరం ప్రారంభంలో 120,000గా ఉన్న టోటల్‌ ఇండస్ట్రీ ఇన్వెంటరీ ప్రస్తుతం 212,000కి పెరిగిందని మారుతి సుజుకి (Maruti Suzuki) ఇండియా లిమిటెడ్ చెబుతోంది. ఎక్కువ మొత్తంలో స్టాక్‌లు బెటర్‌ ప్రొడక్షన్‌ను సూచిస్తున్నాయి. ప్రస్తుతం బుకింగ్స్ పెరుగుతూనే ఉన్నందున పరిశ్రమ ఇప్పుడు కొన్ని మోడళ్లకు ఉన్న డిమాండ్‌ తీర్చేలా ఉండాలి.

పెరుగుతున్న కార్ల ఉత్పత్తి
మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ‘గత కొన్ని నెలలుగా మా ప్రొడక్షన్ ప్లాన్‌లలో 95 శాతానికి దగ్గరగా ఉన్నాం. డిమాండ్ ప్రకారం వెహికల్స్‌ ప్రొడ్యూస్‌ చేయడం అనేది మారుతి సుజుకి, ఇతర తయారీదారులకు పెద్ద సవాలు. మాకు పెండింగ్‌లో ఉన్న బుకింగ్స్ చాలా ఉన్నాయి. కానీ అదే సమయంలో, రిటైల్ అమ్మకాల కంటే హోల్‌సేల్‌లు ఎక్కువగా వస్తున్నాయి. ప్రొడక్షన్‌ వాస్తవ డిమాండ్‌తో సరిపోలనప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న చెల్లింపులతో దీన్ని సరిపోల్చడం అనేది పండుగ సీజన్‌లో పెద్ద సవాలుగా ఉంది. మాకు పరిశ్రమలో అత్యధిక సంఖ్యలో ప్యాసింజర్ వెహికల్‌ మోడళ్లు ఉన్నాయి. ఆల్టో 800, S-ప్రెస్సో, వ్యాగన్‌ఆర్(Wagon R ), విటారా బ్రెజ్జా వంటి చిన్న కార్లు కూడా కొత్త వాటితో భర్తీ అవుతున్నాయి. స్పోర్ట్-యుటిలిటీ వెహికల్ (SUV) సెగ్మెంట్‌లోని కొత్త మోడళ్లతో పోలిస్తే బ్రెజ్జా మోడల్ ఎక్కువ డిస్కౌంట్‌లో లభిస్తుంది.’ అని అన్నారు.

మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్(Tata motors), మహీంద్రా అండ్ మహీంద్రా వంటి ప్రధాన వెహికల్‌ మేకర్స్‌ భారీ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. కంపెనీలు ఇన్వెంటరీని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఎంట్రీ-లెవల్, తక్కువ జనాదరణ పొందిన మోడళ్ల స్టాక్‌ను క్లియర్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎంట్రీ-లెవల్ ద్విచక్ర వాహనాల విషయంలో కూడా ఈ ధోరణి కనిపిస్తోంది. ఇక్కడ డిమాండ్ కంటే ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటోంది.

వెయిటింగ్‌ పీరియడ్‌ తగ్గుతుంది
ఫెడరేషన్ ఆఫ్ ఆటోమోటివ్ డీలర్స్ అసోసియేషన్ (FADA) ప్రెసిడెంట్ వింకేష్ గులాటి మాట్లాడుతూ..‘డీలర్లు ఎంట్రీ లెవల్‌లో ప్యాసింజర్ వెహికల్‌ విక్రయాలు పెరుగుతున్నట్లు గుర్తిస్తున్నారు. ఆగస్టులో కూడా ఇన్వెంటరీ స్థాయిలు పెరగడాన్ని చూస్తాం. కాబట్టి నెమ్మదిగా కదులుతున్న కేటగిరీలలో అధిక డిస్కౌంట్‌లు ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.’ అని చెప్పారు. జులైలో రిటైల్ అమ్మకాలు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 4.6 శాతం తగ్గాయని FADA తెలిపింది.

ఇదీ చదవండి: Raksha Bandhan:రక్షా బంధన్‌కి ఇలా ప్లాన్ చేయండి.. మీ సోదరి ఎంత సంతోషిస్తుందో తెలుసా !జులై ప్యాసింజర్ వెహికల్‌ నంబర్‌లలో బ్లిప్ ఉన్నప్పటికీ, పరిశ్రమ నిరంతరం కొత్త మోడళ్లను పరిచయం చేస్తోందని, ముఖ్యంగా కాంపాక్ట్ SUV విభాగంలో కొత్త మోడళ్లు వస్తున్నాయని గులాటి పేర్కొన్నారు. రాబోయే నెలల్లో మెరుగైన సరఫరా, వెయిటింగ్ పీరియడ్ తగ్గడం వంటివి కస్టమర్ ఆందోళనను తగ్గిస్తాయని తెలిపారు. ప్యాసింజర్ వెహికల్ ఒరిజినల్-ఎక్విప్‌మెంట్ తయారీదారులందరూ మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా తమ సరఫరాలను రీకాలిబ్రేట్ చేయాలని తెలిపారు.ఎంట్రీ లెవల్ కార్లపై డిస్కౌంట్ బొనాంజా
హ్యుందాయ్ శాంత్రో, i10 NIOS, Aura, i20, Xcent, Kona EV వంటి మోడళ్లపై రూ.13,000-రూ.50,000 రేంజ్‌ క్యాష్‌ డిస్కౌంట్‌లు ఉన్నాయి. ఎక్స్ఛేంజ్‌ బెనిఫిట్స్‌, అదనపు ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయి. S-Presso, Alto800, Swift, Celerio సెలక్టెడ్‌ వేరియంట్‌లపై మారుతి సుజుకి రూ.9,000 నుంచి రూ.60,000 వరకు ఆఫర్‌లు ప్రకటించింది. టాటా మోటార్స్ వివిధ మోడళ్లపై పండుగ సీజన్ డిస్కౌంట్లు, రూ.20,000- రూ.40,000 విలువైన స్కీమ్స్‌ను అందిస్తోంది. మహీంద్రా అండ్‌ మహీంద్రా వంటి ఇతర కంపెనీలు కూడా XUV 300, Bolero, Bolero Neo వంటి మోడళ్లపై డిస్కౌంట్లను అందిస్తున్నారు. రెనాల్ట్, టయోటా కొన్ని మోడళ్లపై డిస్కౌంట్లను కూడా విడుదల చేశాయి.
Published by:Mahesh
First published:

Tags: Festival, MARUTI SUZUKI, Tata Motors, Tayota

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు