• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • BOLLYWOOD ACTRESS PRIYANKA CHOPRA BACKED DATING APP BUMBLE LAUNCHING A AI ENHANCED PRIVATE DETECTOR FEATURE TO BLOCK NUDE IMAGES SS

Artificial Intelligence: న్యూడ్ ఫోటో పోస్ట్ చేస్తే ఏఐ కళ్లకు దొరికిపోతారు

Artificial Intelligence: న్యూడ్ ఫోటో పోస్ట్ చేస్తే ఏఐ కళ్లకు దొరికిపోతారు

Artificial Intelligence: న్యూడ్ ఫోటో పోస్ట్ చేస్తే ఏఐ కళ్లకు దొరికిపోతారు (ప్రతీకాత్మక చిత్రం)

Artificial Intelligence | అసభ్యకరంగా, అశ్లీలంగా ఉన్న ఫోటోలను గుర్తించడంలో 'ప్రైవేట్ డిటెక్టర్' ఫీచర్‌ 98 శాతం ఖచ్చితత్వంతో పనిచేస్తోందని బంబుల్ చెబుతోంది.

  • Share this:
    డేటింగ్ యాప్‌లో అప్‌లోడ్ చేసే న్యూడ్ ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తించి డిలిట్ చేయనుంది. డేటింగ్ యాప్ 'బంబుల్' ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే 'ప్రైవేట్ డిటెక్టర్' ఫీచర్‌ను రూపొందించింది. అసభ్యకరంగా, అశ్లీలంగా ఉన్న ఫోటోలను గుర్తించడంలో 'ప్రైవేట్ డిటెక్టర్' ఫీచర్‌ 98 శాతం ఖచ్చితత్వంతో పనిచేస్తోందని బంబుల్ చెబుతోంది. లండన్‌కు చెందిన ఓ కంపెనీకి Badoo, Bumble, Chappy, Lumen పేర్లతో నాలుగు డేటింగ్ యాప్స్ ఉన్నాయి. ఈ నాలుగు యాప్స్‌లో 'ప్రైవేట్ డిటెక్టర్' ఫీచర్‌ను యాడ్ చేస్తామని ఆ కంపెనీ ప్రకటించింది. ఈ యాప్స్‌లో జూన్ నుంచి 'ప్రైవేట్ డిటెక్టర్' ఫీచర్‌ చూడొచ్చు. బంబుల్ డేటింగ్ యాప్ గతేడాది ఇండియాలో రిలీజైంది. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఈ డేటింగ్ యాప్‌లో ఇన్వెస్ట్ చేయడం విశేషం.

    'ప్రైవేట్ డిటెక్టర్' ఫీచర్‌ ఎలా పనిచేస్తుంది?


    'ప్రైవేట్ డిటెక్టర్' ఫీచర్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రూపొందించిన ఆల్గరిథమ్‌తో పనిచేస్తుంది. ఎవరైనా ప్రొఫైల్స్‌లో ఫోటో అప్‌లోడ్ చేయగానే రియల్‌టైమ్‌లో ఫోటోను క్యాప్చర్ చేసి అందులో అశ్లీల, అసభ్య, నగ్న చిత్రాలు ఉంటే గుర్తిస్తుంది. ఇలా గుర్తించడంలో 98 శాతం ఖచ్చితత్వం ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది. న్యూడ్ ఫోటోలను గుర్తించడం మాత్రమే కాదు... అప్‌లోడ్ కాకుండా ఏఐ అడ్డుకుంటుంది. ఒకవేళ ఒక యూజర్ మరో యూజర్‌కు న్యూడ్ ఫోటో పంపినా, ఆ ఫోటో బ్లర్ అవుతుంది. ఫోటో రిసీవ్ చేసుకున్న యూజర్ క్లిక్ చేస్తేనే ఒరిజినల్ పిక్ కనిపిస్తుంది. ఈ ప్రైవేట్ డిటెక్టర్ కేవలం నగ్న చిత్రాలను గుర్తించడం మాత్రమే కాదు... గన్స్ ఫోటోలను కూడా గుర్తించగలదు.

    Bollywood Actress Priyanka Chopra, Bumble dating app, Bumble dating app private detector feature, AI Enhanced private detector feature, AI Blocks nude images, Artificial Intelligence Blocks nude images, Artificial Intelligence, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, బంబుల్ డేటింగ్ యాప్, ప్రైవేట్ డిటెక్టర్ ఫీచర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    ప్రతీకాత్మక చిత్రం


    సాంకేతికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతీ రంగానికి విస్తరిస్తున్న తీరు అద్భుతం. మనుషుల్లాగానే ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, పనిచేయడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రత్యేకత. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకసారి విన్న మాటల్ని గుర్తుపెట్టుకుంటుంది. అదే స్పీచ్ రికగ్నిషన్. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లల్లో ఈ ఫీచర్ కనిపిస్తుంది. ఇదొక్కటే కాదు... మెషీన్ లెర్నింగ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎన్నో ఉన్నాయి. సాంకేతిక రంగంలోని ప్రతీ విభాగంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఓ భాగమైపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రాణాంతక రోగాలను ముందే గుర్తించి చికిత్స అందిస్తున్న ఘనత వైద్య రంగానిది. అందుకే అన్ని రంగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకుంటున్నాయి.

    Photos: రెడ్‌మీ 7 రిలీజ్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా...

    ఇవి కూడా చదవండి:

    SBI Loans: ఎస్‌బీఐ ఆఫర్ చేస్తున్న లోన్స్ ఇవే...

    Sony TV: టీవీ ధర రూ.50 లక్షలు... సైజ్ 98 అంగుళాలు

    Amazon Summer Sale: అమెజాన్‌లో సమ్మర్ సేల్... ఆఫర్లు ఇవే...
    First published:

    అగ్ర కథనాలు