BOAT WAVE PRO 47 BUDGET SMARTWATCH WITH 7 DAY BATTERY LAUNCHED IN INDIA HERE PRICE AND SPECIFICATIONS DETAILS NS GH
boAT Wave Pro 47: భారత మార్కెట్లోకి బోట్ వేవ్ ప్రో 47 బడ్జెట్ స్మార్ట్‌వాచ్.. ధర, ఫీచర్ల వివరాలివే!
ప్రతీకాత్మక చిత్రం
స్వదేశీ దిగ్గజ స్మార్ట్ బ్రాండ్ బోట్(boAt) వేవ్ ప్రో 47 పేరుతో కొత్త స్మార్ట్ వాచ్(Smartwatch)ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ యపిల్ వాచ్‌ను పోలి ఉంటుంది. ఇది 24×7 హెల్త్ మానిటర్లు, ఫిట్నెస్ ప్లాన్లు, లైవ్ క్రికెట్ స్కోర్లు వంటి మరెన్నో ఫీచర్లను కలిగి ఉంటుంది.
స్వదేశీ దిగ్గజ స్మార్ట్ బ్రాండ్ బోట్ వేవ్ ప్రో 47 పేరుతో కొత్త స్మార్ట్ వాచ్(Smartwatch) ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ యపిల్ వాచ్‌ను పోలి ఉంటుంది. ఇది 24×7 హెల్త్ మానిటర్లు, ఫిట్నెస్ ప్లాన్లు, లైవ్ క్రికెట్ స్కోర్లు వంటి మరెన్నో ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. దీన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు, ఆపిల్ ఐఫోన్లతో కనెక్ట్ చేసుకోవచ్చు.ఈ స్మార్ట్ వాచ్ నాయిస్, ఆంబ్రేన్ వంటి మరెన్నో బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లకు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది.
బోట్ వేవ్ ప్రో 47 ధర
బోట్ వేవ్ ప్రో 47 ధర విషయానికి వస్తే.. ఇది రూ. 3,199 వద్ద లభిస్తుంది. ఇది యాక్టివ్ బ్లాక్, డీప్ బ్లూ, పింక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు బోట్ ఇండియా వెబ్సైట్, పార్ట్నర్ ఛానెల్‌ల ద్వారా వాచ్‌ని కొనుగోలు చేయవచ్చు. ఇది ఒక సంవత్సరం వారంటీతో వస్తుంది. బోట్ క్రెస్ట్ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ ఉచితంగా లభిస్తుంది. Apple Watch: యాపిల్ వాచ్ వాడుతున్నారా? అనారోగ్యాలను గుర్తించే హెల్త్ నోటిఫికేషన్స్ ఇలా ఎనేబుల్ చేసుకోండి..
బోట్ వేవ్ ప్రో 47 స్పెసిఫికేషన్లు
బోట్ వేవ్ ప్రో 47 'మేడ్ ఇన్ ఇండియా' స్మార్ట్‌వాచ్. కాబట్టి, బోట్ వేవ్ ప్రో 47 భారతీయ జెండా, మ్యాప్‌తో కూడిన కస్టమ్ వాచ్ ఫేస్‌లను కలిగి ఉంటుంది. ఇది 1.69 -అంగుళాల HD డిస్ప్లేతో వస్తుంది. 500 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. కస్టమర్లు 100కి పైగా క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్‌లను ఎంచుకోవచ్చు. హెల్త్ సెన్సార్ల పరంగా, స్మార్ట్ వాచ్ హృదయ స్పందన రేటు, శరీర ఉష్ణోగ్రత, బ్లడ్ ఆక్సిజన్ లెవల్ (SpO2) మానిటర్ చేయగలదు. Redmi X43 Smart TV: షియోమి నుంచి సరికొత్త స్మార్ట్ బ్యాండ్, స్మార్ట్‌టీవీలు లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలివే..
వాకింగ్, ట్రెడ్మిల్, రన్నింగ్, ఇండోర్ సైక్లింగ్, క్రికెట్, బాక్సింగ్, కరాటే, టేబుల్ టెన్నిస్, పైలేట్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్‌తో సహా మల్టీ స్పోర్ట్స్ మోడ్లతో డైలీ యాక్టివిటీ ట్రాకర్ కూడా ఉంటుంది. డైలీ యాక్టివిటీ ట్రాకర్ మీ రోజువారీ కేలరీలు, దూరాన్ని ఆటోమేటిక్‌గా రికార్డ్ చేస్తుంది. వినియోగదారులు ఈ వివరాలను ఆండ్రాయిడ్, iOS కోసం బోట్ క్రెస్ట్ యాప్ ద్వారా ట్రాక్ చేయవచ్చు.
ఈ స్మార్ట్ వాచ్ ‘ఫిట్నెస్ బడ్డీస్’తో వస్తుంది. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో మీ ఫిట్నెస్ గోల్స్ షేర్ చేసుకోవచ్చు. బోట్ వేవ్ ప్రో 47 ‘హైడ్రేషన్ అలర్ట్‌లను’ పంపుతుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ను మొబైల్‌తో కనెక్ట్ చేయడం ద్వారా వాచ్ టెక్స్ట్, సోషల్ మీడియా నోటిఫికేషన్లను చూసుకోవచ్చు. మీరు ఎక్కడ ఉన్నా సరే లైవ్ క్రికెట్ స్కోర్లను ట్రాక్ చేయవచ్చు. ఐపీఎల్ నుండి T-20 వరకు తాజా మ్యాచ్ అప్డేట్లను తెలుసుకోవచ్చు. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 7- రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.