boAt Smartwatch: దేశీయ ఆడియో బ్రాండ్‌గా మంచి గుర్తింపు పొందిన బోట్(boAt) సరసమైన ధరలకు టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌లను తీసుకొస్తుంది. ఇటీవల కాలంలో ఈ కంపెనీ ప్రొడక్ట్స్‌కు భారత్‌లో డిమాండ్ పెరుగుతోంది. దీంతో మార్కెట్‌ను మరింత విస్తరించే ప్లాన్‌లో భాగంగా సంస్థ వరుసగా స్మార్ట్‌వాచ్‌లను లాంచ్ చేస్తోంది. వేవ్ లైనప్‍లో తాజాగా రగెడ్ స్మార్ట్‌వాచ్ ‘బోట్ వేవ్ ఆర్మర్’ను (boAt Wave Armour) రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ ధర, స్పెసిఫికేషన్స్ పరిశీలిద్దాం.
* స్పెసిఫికేషన్స్
వేవ్ ఆర్మర్ అనేది boAt నుంచి వచ్చిన మొట్టమొదటి రగెడ్ స్మార్ట్‌వాచ్. ఇది డిజైన్ పరంగా యాపిల్ వాచ్ ఆల్ట్రాను పోలి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ బాడీని జింక్ అల్లాయ్‌బిల్ట్ చేశారు. IP68 డస్ట్, స్వెట్, స్ప్లాష్ రెసిస్టెన్స్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. దీని 1.83 అంగుళాల HD డిస్‌ప్లే, 550 నిట్స్ మ్యాగ్జిమం బ్రైట్‌నెస్, 240 x 284 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాచ్ స్పష్టంగా కనిపిస్తుందని కంపెనీ పేర్కొంది. దీనికి ఉండే టూ-టోన్ పట్టీ సౌకర్యవంతంగా ఉంటూ మంచి పట్టును అందిస్తుంది. దీంతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ స్మార్ట్‌వాచ్‌ను ధరించవచ్చు.
* 20కి పైగా స్పోర్ట్స్ మోడ్స్
బోట్ వేవ్ ఆర్మర్ స్మార్ట్‌వాచ్.. హార్ట్ బీట్ రేటు, SpO2, డైలీ యాక్టివిటీ ట్రాకర్, స్లీప్ అండ్ సెడెంటరీ అలర్ట్ వంటి ట్రాకింగ్ ఫీచర్స్‌తో వస్తుంది. దీంట్లో మైక్, స్పీకర్ ఇన్- బిల్ట్‌గా ఉంటాయి. ఇది బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. గరిష్టంగా 10 కాంటాక్ట్‌లను సేవ్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.2 ప్రోటోకాల్‌ను డివైజ్ ఉపయోగిస్తుంది. 100 కంటే ఎక్కువ వాచ్ ఫేసెస్‌ను కంపెనీ దీంట్లో ఇంటిగ్రేట్ చేసింది. ఇది క్రికెట్, హైకింగ్ సహా మొత్తం 20కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ అందిస్తుంది.
ఈ స్మార్ట్‌వాచ్‌లో 410 mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ ఏడు రోజుల పాటు ఉంటుంది. అయితే బ్లూటూత్ కాలింగ్‌ను నిరంతరయంగా ఉపయోగిస్తే బ్యాటరీ లైఫ్ కేవలం రెండు రోజులు మాత్రమే వస్తుంది. ఛార్జింగ్ పెట్టిన రెండు గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.
Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? తప్పక తెలుసుకోవాల్సిన 3 విషయాలివే..
* ధర ఎంత?
బోట్ వేవ్ ఆర్మర్ స్మార్ట్‌వాచ్‌ను అమెజాన్ , బోట్ ఇ-స్టోర్ ద్వారా కంపెనీ విక్రయించనుంది. ఇప్పటికే అమ్మకాలు కూడా ప్రారంభమైనట్లు సమాచారం. బోట్ ఇ-స్టోర్‌లో దీన్ని కొనుగోలు చేస్తే డిస్కౌంట్ కూడా పొందవచ్చు. రగెడ్ స్టైలింగ్, మన్నికైన డిస్‌ప్లే, అడ్వాన్స్‌డ్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉన్న ఈ ప్రొడక్ట్ రూ.1899 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఇది యాక్టివ్ బ్లాక్, ఆలివ్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Smartwatch