BOAT SMARTWATCH THE LATEST SMARTWATCH LAUNCH FROM BOAT COMPANY PREMIUM DEVICE WITH BLUETOOTH CALLING SUPPORT GH VB
boAT Smartwatch: బోట్ కంపెనీ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్.. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌తో వచ్చిన 'ప్రిమియా' డివైజ్..
ప్రతీకాత్మక చిత్రం
ఇండియన్ టెక్ బ్రాండ్ బోట్ (boAt) సరికొత్త ప్రొడక్ట్‌ను లాంచ్ చేసింది. ఈ కంపెనీ మొట్టమొదటి బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ బోట్ ప్రిమియాను (boAt Primia) లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
boAT Smartwatch: బోట్ కంపెనీ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్.. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌తో వచ్చిన 'ప్రిమియా' డివైజ్ ఇండియన్ టెక్ బ్రాండ్ బోట్ (boAt) సరికొత్త ప్రొడక్ట్‌ను(Product) లాంచ్ చేసింది. ఈ కంపెనీ(Company) మొట్టమొదటి బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ బోట్ ప్రిమియాను (boAt Primia) లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది పెద్ద రౌండ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. డివైజ్(Device) నుంచి నేరుగా వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్‌ను యాక్సెస్ చేయడానికి ఇన్‌బిల్ట్ స్పీకర్, మైక్రోఫోన్(Microphone) ఉన్నాయి. బడ్జెట్(Budget) స్మార్ట్‌వాచ్‌ల మాదిరిగా కాకుండా ప్రిమియా వాచ్ మెటాలిక్ డిజైన్(Design), క్లాసిక్ లెదర్ స్ట్రాప్‌తో ఆకట్టుకుంటోంది. యూజర్లు వివిధ ఫిట్నెస్ ఫీచర్లను యాక్సెస్ చేసుకోవచ్చు. boAt Crest యాప్‌తో ఫిట్నెస్ రికార్డ్స్ ట్రాక్ చేయవచ్చు.
ఇండియాలో ప్రిమియా వాచ్ ధర బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌తో వచ్చిన బోట్ ప్రిమియా స్మార్ట్‌వాచ్.. అమెజాన్‌తో పాటు బోట్ అధికారిక వెబ్సైట్లో లభిస్తుంది. మొదటి 1,000 మంది కస్టమర్లు దీన్ని రూ. 3,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీని తర్వాత ఈ స్మార్ట్ వాచ్ రూ. 4,499కి అందుబాటులో ఉంటుంది.
బోట్ ప్రిమియా స్పెసిఫికేషన్స్ఈ స్మార్ట్‌వాచ్ 454×454 పిక్సెల్‌లతో కూడిన 1.39-అంగుళాల AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ వాచ్ నుంచి నేరుగా వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. కస్టమర్లు స్మార్ట్ఫోన్లలో గూగుల్, సిరి వాయిస్ అసిస్టెంట్స్‌తో కనెక్ట్ కావచ్చని కంపెనీ తెలిపింది. దీంతో పాటు బోట్ ప్రైమా స్మార్ట్‌వాచ్‌లో ఇన్‌బిల్ట్ హార్ట్ రేట్, SpO2 (బ్లడ్ ఆక్సిజన్ లెవెల్), స్ట్రెస్ లెవెల్ ట్రాకర్లు ఉన్నాయి. ఈ ఫీచర్ల ద్వారా యూజర్లు తమ ఫిజికల్ హెల్త్‌ను ట్రాక్ చేసుకోవచ్చు. స్టెప్ కౌంట్స్, కేలరీ బర్న్ రికార్డ్స్, ఇతర హెల్త్ ట్రాకర్స్ ఉన్నాయి. నిద్ర అలవాట్లను ట్రాక్ చేసే డీప్ స్లీప్ ట్రాకర్ ఫీచర్ కూడా ఉందులో ఉంది. బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, స్పిన్నింగ్, క్లైంబింగ్, సైక్లింగ్, యోగా, ట్రెడ్మిల్, రన్నింగ్ వంటి 11 యాక్టివ్ స్పోర్ట్స్ మోడ్స్‌తో వస్తుంది.
కనెక్టివిటీ ఫీచర్లతో ఈ స్మార్ట్‌వాచ్ ద్వారా డివైజ్‌లో ఇష్టమైన సాంగ్ ప్లే చేయవచ్చు. ఫోటోలను క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇతర ఫీచర్లలో IP67 రేటింగ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వంటివి ఉన్నాయి. boAt Crest యాప్‌తో కస్టమర్లు తమ ఫిట్నెస్ జర్నీ షేర్ చేసుకోవడానికి స్నేహితులు, కుటుంబ సభ్యులతో గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. వెల్నెస్ క్రూ గార్డియన్స్ ఈ గ్రూప్ మెంబర్స్ హెల్త్‌ను ట్రాక్ చేస్తాయి. ఈ రికార్డ్స్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.