Boat Headphone: గేమ్స్ ఎక్కువగా ఆడతారా? ఈ హెడ్‌ఫోన్ మీకోసమే

Boat Headphone: గేమ్స్ ఎక్కువగా ఆడతారా? ఈ హెడ్‌ఫోన్ మీకోసమే

Boat Immortal 1000D | మీరు ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడుతుంటారా? బోట్ గేమింగ్ హెడ్‌ఫోన్ లాంఛ్ అయింది. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  • Share this:
ప్రముఖ ఎలక్ట్రానిక్​ బ్రాండ్​ బోట్ తన మొట్టమొదటి గేమింగ్ హెడ్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ‘ఇమ్మోర్టల్ 1000 డి’ (Immortal 1000D) పేరుతో ఈ హెడ్​ఫోన్​ను లాంచ్​ చేసింది. ఇవి ప్రీమియం గేమింగ్, ఎంటర్​టైన్​మెంట్​ ఎక్స్​పీరియన్స్​ అందిస్తాయని బోట్ తెలిపింది. హై-ఫిడిలిటీ ఆడియో కోసం వీటిలో 50 ఎంఎం డ్రైవర్లను అందించినట్లు పేర్కొంది. దీన్ని గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ హెడ్​​ఫోన్స్​​ మంచి ఆడియో ఎక్స్​పీరియన్స్​ అందిస్తాయి. కాబట్టి గేమింగ్‌ను అమితంగా ఆస్వాదించవచ్చు. ఓ వైపు గేమ్​ ఆడుతూనే మరోవైపు ఇమ్మోర్టల్ 1000D లో మీకు ఇష్టమైన మ్యూజిక్​ వినవచ్చు.
ఈ సరికొత్త హెడ్‌ఫోన్‌ల గురించి బోట్​ సహ వ్యవస్థాపకుడు సమీర్ మెహతా మాట్లాడుతూ ‘మా మొట్టమొదటి గేమింగ్ హెడ్‌ఫోన్ -ఇమ్మోర్టల్ 1000Dని భారత మార్కెట్​లోకి తేవడం సంతోషంగా ఉంది. వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ కారణంగా భారతీయ గేమింగ్ ఈ–గేమింగ్ మార్కెట్​ వేగంగా వృద్ధి చెందుతోంది. మహమ్మారి కారణంగా ఆన్‌లైన్ గేమింగ్‌ మార్కెట్​ మరింత విస్తరించింది. ప్రొఫెషనల్ గేమర్స్ ప్రత్యేకమైన ఆడియో డివైజెస్, పెరిఫెరల్స్ కోసం చూస్తున్నారు. వారి అన్ని అవసరాలకు తగ్గట్లు మా ఇమ్మోర్టల్​ 1000Dని రూపొందించాం’ అన్నారు.

Redmi 9i: రూ.8,299 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.999 ధరకే... కాసేపట్లో సేల్

Nothing Ear 1 TWS: ఈ ఇయర్‌బడ్స్ కావాలా? వేలంపాటలో కొనుక్కోవాలి

ధర, లభ్యత


బోట్ ఇమ్మోర్టల్​ 1000D భారత మార్కెట్​లో రూ.2499 వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ హెడ్‌ఫోన్‌లు బ్లాక్, వైట్ సాబెర్ అనే రెండు కలర్​ వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. బోట్, అమెజాన్ ఇండియా వెబ్‌సైట్​ల ద్వారా ఇమ్మోర్టల్ 1000Dని కొనుగోలు చేయవచ్చు.

Ola e-Scooter: రూ.499 ధరకే ఓలా స్కూటర్ రిజర్వేషన్... బుకింగ్ చేయండి ఇలా

WhatsApp: ఒకే వాట్సప్ అకౌంట్ 4 డివైజ్‌లలో వాడుకోవచ్చు... కొత్త ఫీచర్ వచ్చేసింది

స్పెసిఫికేషన్లు


బోట్ ఇమ్మోర్టల్ 1000Dలో 50 ఎంఎం డ్రైవర్లను చేర్చింది. ఇవి శక్తివంతమైన 360- డిగ్రీ గేమింగ్ అనుభవాన్ని అందిస్తాయి. ఈ హెడ్‌ఫోన్‌లు 7.1 ఛానల్ సరౌండ్ సౌండ్, డాల్బీ అట్మోస్‌తో ఉత్తమంగా పనిచేస్తాయి. వీటిలో డ్యూయల్​ మైక్​ సెట్​ అందించింది. యూట్యూబ్, డిస్కార్డ్, ట్విచ్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో సీమ్​లెస్​ వాయిస్​, మెరుగైన వీడియో సంభాషణల కోసం హెడ్‌ఫోన్‌ రిమోట్​ను కూడా చేర్చింది. ఈ సరికొత్త ఉత్పత్తిపై బోట్ ప్రతినిధి మాట్లాడుతూ “బోట్​ ఇమ్మోర్టల్ 1000 డి హెడ్​ఫోన్స్​ గేమర్స్​కు అద్భుతమైన గేమింగ్ ఎక్స్​పీరియన్స్​ ఇస్తుంది. దీనిలో 7.1 ఛానల్ సరౌండ్ ఆడియోను అందించాం. ఇది అధిక క్వాలిటీ సౌండ్​ను ప్రాసెస్ చేస్తుంది. గేమింగ్ చేసేటప్పుడు వినియోగదారులు 7.1 ఛానల్ సరౌండ్ ఆడియో లేదా డాల్బీ అట్మోస్ మధ్య మారవచ్చు” అని పేర్కొన్నారు.
Published by:Santhosh Kumar S
First published: