ఇండియన్ వేరబుల్ బ్రాండ్ బోట్ (boAt) అన్ని రకాల స్మార్ట్ గాడ్జెట్లను(Gadgets) తయారు చేస్తూ మార్కెట్ వాటాలో(Market Share) దూసుకుపోతోంది. ఇప్పటికే వివిధ రకాల ఆడియో డివైజ్లతో పాపులర్(Popular Brand) అయిన ఈ బ్రాండ్, తాజాగా ఇండియన్ మార్కెట్లో కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. దీని పేరు బోట్ ఎక్స్టెండ్ టాక్ స్మార్ట్‌వాచ్ (boAt Extend Talk). కంపెనీ రీజనబుల్ కాస్ట్‌తో దీంట్లో హై రేంజ్ ఫీచర్లను అందించింది. ఈ స్మార్ట్‌వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్(Bluetooth Calling), అలెక్సా సపోర్ట్, IP68 రేటింగ్ వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఈ బడ్జెట్ స్మార్ట్‌వాచ్ 2.5D కర్వ్డ్ స్క్రీన్‌తో(Screen) వస్తుంది. దీని ధర రూ. 3,000 లోపు ఉంటుంది. ఈ వాచ్(Watch) గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
బోట్ స్మార్ట్‌వాచ్‌లో హార్ట్ రేట్ సెన్సార్, SpO2 మానిటర్, VO2 మ్యాక్స్ మానిటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది స్టెప్స్, కేలరీలు, మరిన్నింటిని ట్రాక్ చేయగలదు. ఈ డివైజ్ 60+ స్పోర్ట్స్ మోడ్స్‌తో వస్తుంది. ఆటో వర్కౌట్ డిటెక్షన్ ఫీచర్ దీంట్లో మరో ప్రత్యేకత.
* బ్యాటరీ, డిజైన్
ఎక్స్టెండ్ టాక్ వాచ్ 300mAh బ్యాటరీతో వస్తుంది. సాధారణ వినియోగంతో యూజర్లు 10 రోజుల బ్యాటరీ లైఫ్ పొందుతారు. బ్లూటూత్ కాలింగ్ యూజ్ చేస్తే పవర్ కెపాసిటీ 2 రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇది రెక్టాంగిల్ డయల్‌ను కలిగి ఉంటుంది. దీనికి కుడి వైపున ఒకే బటన్ ఉంటుంది. HD రిజల్యూషన్‌తో పనిచేసే 1.69-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్ IP68 రేటింగ్‌తో, 150కి పైగా వాచ్ ఫేసెస్ సపోర్ట్‌తో వస్తుందని కంపెనీ తెలిపింది.
* ధర ఎంత?
ఇండియాలో బోట్ ఎక్స్టెండ్ టాక్ ప్రారంభ ధర రూ. 2,999. దీనిని అమెజాన్ ఇండియా, ఇతర పోర్టల్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది పిచ్ బ్లాక్, చెర్రీ బ్లోసమ్, టీమ్ గ్రీన్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
* మరో బ్రాండ్ కూడా..
మరోవైపు ప్రముఖ వేరబుల్ బ్రాండ్ ఫిట్‌బిట్ కూడా వేర్వేరు ధరలతో మూడు కొత్త వేరబుల్స్‌ను లాంచ్ చేశాయి. కానీ వాటి ధరలు తాజా బోట్ స్మార్ట్‌వాచ్‌తో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి. ఇవి రూ. 5,000 విభాగంలోకి రావు. వీటిలో Fitbit Inspire 3 అత్యంత చౌకైనది. ఇండియాలో దీని ధర రూ. 8,999గా ఉంటుంది. మిగతా రెండింటిలో Fitbit Versa 4 ధర రూ. 20,499 కాగా, Fitbit Sense 2 రూ. 20,499కి లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g smart phone, Bluetooth, Smart watch, Technology