Home /News /technology /

BOAT AIRDOPES 181 TWS EARBUDS LAUNCHED IN INDIA WITH 20 HOUR BATTERY LIFE IPX4 WATER RESISTANT DESIGN HERE FULL DETAILS NS GH

boAt Airdopes: బోట్ నుంచి సరికొత్త ఇయర్ బడ్స్.. 20 గంటల బ్యాటరీ లైఫ్, వాటర్ రెసిస్టెన్స్‌.. ఇంకా ఎన్నో ఫీచర్లు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బోట్ (boAt) సంస్థ.. ఇండియన్ మార్కెట్‌లోకి మరో బడ్జెట్ వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ ను తాజాగా లాంఛ్ చేసింది. తాజాగా బోట్ ఎయిర్ డోప్స్ (boAt Airdopes) 181 TWS పేరుతో సరికొత్త ఇయర్‌బడ్స్‌ విడుదల చేసింది.

వివిధ రకాల ఆడియో ప్రొడక్ట్స్ రూపొందించే బోట్ (boAt) సంస్థ.. ఇండియన్ మార్కెట్‌లోకి మరో బడ్జెట్ వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ (Earbuds) ను తాజాగా లాంఛ్ చేసింది. తాజాగా బోట్ ఎయిర్ డోప్స్ (boAt Airdopes) 181 TWS పేరుతో సరికొత్త ఇయర్‌బడ్స్‌ విడుదల చేసింది. 10mm డ్రైవర్స్, బ్లూటూత్ 5.2, సింగిల్ ఛార్జ్‌పై 20 గంటల వరకు ప్లేటైమ్.. వంటి ఫీచర్లు ఈ ప్రొడక్ట్ సొంతం ఉన్నాయి. ఈ ఇయర్‌బడ్స్ ఇంతకు ముందే ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో లిస్ట్ అయ్యాయి. అయితే కంపెనీ ఇప్పుడే డివైజ్ ధరను ప్రకటించింది. ఇవి బ్రాండ్ నుంచి విడుదలైన వైర్‌లెస్ ఆడియో ప్రొడక్ట్స్ లిస్ట్‌లో కొత్తగా చేరాయి. ఇవి కూడా ఇటీవల బోట్ లాంచ్ చేసిన Airdopes 601 ANC, Airdopes 161 TWS మాదిరిగానే కనిపిస్తున్నాయి.

BoAt Airdopes 181 TWS భారత్‌లో బడ్జెట్ ధరలోనే లభిస్తున్నాయి. వీటిని రూ. 1,499కే సొంతం చేసుకోవచ్చు. బోల్డ్ బ్లూ, కార్బన్ బ్లాక్, కూల్ గ్రే, స్పిరిట్ వైట్ వంటి నాలుగు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఇయర్‌బడ్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
Vivo Wireless Earphones: వివో వైర్‌లెస్ స్పోర్ట్ లైట్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్లు లాంచ్​.. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
బోట్ ఎయిర్‌డోప్స్ 181 TWS ఇయర్ బడ్స్ తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్లతో లభిస్తున్నాయి. వీటిలో ఉపయోగించిన 10mm డ్రైవర్స్‌ సౌండ్ క్వాలిటీని పెంచనున్నాయి. బెస్ట్ బాస్ సౌండ్ అవుట్‌పుట్‌ను ఇవి అందిస్తాయని సంస్థ చెబుతోంది. ENx టెక్నాలజీతో పనిచేసే ఈ బడ్స్, బెస్ట్ కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. బీస్ట్ మోడ్‌తో వచ్చే ఎయిర్‌డోప్స్, గేమింగ్ టైమ్‌లో 65 మిల్లీసెకన్ల క్విక్ రెస్పాన్స్ అందిస్తాయి. Airdopes 181 TWS బ్లూటూత్ 5.2 టెక్నాలజీ కనెక్టివిటీతో వస్తుంది. ఈ ఇయర్‌బడ్స్ మొత్తం 20 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తాయి. ఫాస్ట్ ఛార్జ్ (ASAP ఛార్జ్) ఫీచర్ సాయంతో 10 నిమిషాల టాప్-అప్‌తోనే 1.5 గంటల ప్లేబ్యాక్‌ టైమ్ అందిస్తుంది.
Nothing ear 1 black: కాసేపట్లో నథింగ్ ఇయర్ 1 బ్లాక్ ఎడిషన్ సేల్... ఫీచర్స్ ఇవే

డిజైన్ పరంగా చూస్తే.. బోట్ ఎయిర్‌డోప్స్ 181 డివైజ్‌ కూడా స్టాండర్డ్ TWS డిజైన్‌లో, ప్లాస్టిక్ బిల్డ్ బాడీ, టేపరింగ్ స్టెమ్, రబ్బర్ టిప్స్‌తో వచ్చాయి. ఈ బడ్స్ 2.9 గ్రాముల బరువు ఉంటాయి. వీటిలో ఇన్‌స్టంట్ వేక్ 'n' పెయిర్, టచ్ కంట్రోల్స్, IPX4 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్, టైప్-సి పోర్ట్, వాయిస్ అసిస్టెంట్‌ సపోర్ట్ ఫీచర్లు ఉన్నాయి.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Boat, Earbuds

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు