BMW PRICE HIKE LATEST DECISION IS SHOCKING NEWS FOR NEW CAR BUYERS GH EVK
BMW Cars: బీఎండబ్ల్యూ తాజా నిర్ణయం.. కొత్తగా కారు కొనేవారికి షాకింగ్ న్యూస్!
(ప్రతీకాత్మక చిత్రం) (Image source: BMW
BMW Price Hike | జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ ఇండియా కారు ప్రియులకు షాకిచ్చింది. తన అన్ని కార్ మోడళ్లపై ఏకంగా 3.5 శాతం మేర ధరల పెంపును ప్రకటించింది. ఏప్రిల్ 1 నుండి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది.
జర్మనీ (Germany) కి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ (BMW) ఇండియా కారు ప్రియులకు షాకిచ్చింది. తన అన్ని కార్ మోడళ్లపై ఏకంగా 3.5 శాతం మేర ధరల పెంపును ప్రకటించింది. ఏప్రిల్ 1 నుండి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పెరిగిన మెటీరియల్, లాజిస్టిక్స్ ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. ఇదే క్రమంలో మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ ఇండియా కూడా కార్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఏప్రిల్ నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా (India) తన అన్ని మోడళ్లపై 3 శాతం ధర పెంపును ప్రకటించింది. లాజిస్టిక్స్ రేట్ల పెరుగుదలతో పాటు ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల కారణంగా అన్ని కారు మోడళ్లపై ధర పెంచుతున్నట్లు ప్రకటించింది.
అప్పటి నుంచి కొత్త ధరలు..
మరోవైపు, జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి సైతం భారతదేశం (India) లో తన అన్ని మోడళ్లపై 3% వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా ధరల పెంపు అనివార్యత ఏర్పడిందని పేర్కొంది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 01, 2022 నుండి అమలులోకి వస్తాయని తెలిపింది. ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, “భారత్ మాకు గణనీయమైన మార్కెట్ గల దేశం. ఇక్కడ మేము స్థిరమైన వ్యాపార నమూనాను నిర్వహించడానికి కట్టుబడి ఉన్నాము. అయితే, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, మారుతున్న ఫారెక్స్ రేట్ల కారణంగా మా అన్ని మోడళ్లపై 3% వరకు ధరలను పెంచాలని నిర్ణయించాం.”అని తెలిపింది.
ఆడి ఇండియా ప్రస్తుత లైనప్‌లో ఉన్న ఆడి A4, ఆడి A6, ఆడి A8 L, ఆడి Q2, ఆడి Q5 మోడళ్లతో పాటు ఇటీవల ప్రారంభించిన ఆడి Q7, ఆడి Q8, ఆడి S5 స్పోర్ట్‌బ్యాక్, ఆడి ఆర్ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్, ఆడి ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్, అద్భుతమైన ఆడి ఆర్ఎస్ Q8 మోడళ్లపై ధరల పెంపును ప్రకటించింది. మరోవైపు, భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సైతం తన వాణిజ్య వాహనాల ధరలను పెంచింది. కొన్ని పాపులర్ మోడళ్లపై 2 నుంచి -2.5% ధర పెంపును ప్రకటించింది. వ్యక్తిగత మోడల్, వేరియంట్ ఆధారంగా 1 ఏప్రిల్ 2022 నుండి ఈ కొత్త రేట్లు అమలులోకి వస్తాయని తెలిపింది. ఉక్కు, అల్యూమినియం,యు ఇతర విలువైన లోహాల వంటి వస్తువుల ధరల పెరుగుదల, ఇతర ముడి పదార్థాల అధిక ధరల కారణంగా వాణిజ్య వాహనాల ధరల పెంపును అనివార్యత ఏర్పడింది. మొత్తం ఇన్‌పుట్ ఖర్చులు బాగా పెరగడం వలన ధరలు పెంచామని టాటా మోటార్స్ (TATA Motors) ప్రకటించింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.