Home /News /technology /

BLAUPUNKT TV ANNIVERSARY SALE SPECIAL DEALS WITH UP TO 40 PERCENTAGE DISCOUNT AVAILABLE ON FLIPKART UMG GH

Blaupunkt : స్మార్ట్ టీవీపై 40 శాతం డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీపై ఆఫర్లే ఆఫర్లు.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..!

స్మార్ట్ టీవీపై 40 శాతం డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీపై ఆఫర్లే ఆఫర్లు.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..!

స్మార్ట్ టీవీపై 40 శాతం డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీపై ఆఫర్లే ఆఫర్లు.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..!

జర్మనీ టెక్ కంపెనీ బ్లాపంక్ట్‌ (Blaupunkt) భారతదేశంలో మొదటి వార్షికోత్సవం జరుపుకొంటోంది. ఈ సందర్భంగా బ్లాపంక్ట్‌ అన్ని ప్రీమియం టీవీ మోడళ్లపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది. ఈ స్పెషల్ యానివర్సరీ సేల్ 2022 ఆగస్టు 1 నుంచి ఆగస్టు 3 వరకు కొనసాగుతుంది.

ఇంకా చదవండి ...
జర్మనీ టెక్ కంపెనీ బ్లాపంక్ట్‌ (Blaupunkt) భారతదేశంలో మొదటి వార్షికోత్సవం జరుపుకొంటోంది. ఈ సందర్భంగా బ్లాపంక్ట్‌ అన్ని ప్రీమియం టీవీ మోడళ్లపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది. ఈ స్పెషల్ యానివర్సరీ సేల్ 2022 ఆగస్టు 1 నుంచి ఆగస్టు 3 వరకు కొనసాగుతుంది. కస్టమర్లు కంపెనీ టీవీలపై 40 శాతం వరకు డిస్కౌంట్‌ అందుకోవచ్చు. 32 అంగుళాల నుంచి 65 అంగుళాల రేంజ్‌ వరకు టీవీలు అందుబాటులో ఉంటాయి.

బ్లాపంక్ట్‌ కంపెనీ 5కి 4.6 రేటింగ్‌తో 100 సంవత్సరాలకు పైగా రాణిస్తోంది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న ప్రముఖ, ప్రీమియం బ్రాండ్‌లలో ఒకటిగా ఉంది. బడ్జెట్-ఫ్రెండ్లీ రేంజ్‌లో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. భారతదేశంలో బ్లాపంక్ట్‌ టీవీలు భారతదేశపు అతిపెద్ద TV తయారీదారు అయిన SPPL(Super Plastronics Pvt.Ltd) ద్వారా తయారవుతాయి.

బ్లాపంక్ట్‌ భారతదేశంలో దాని ప్రయాణాన్ని సైబర్ సౌండ్ 32-అంగుళాల టీవీని రూ.13,499తో ప్రారంభించింది. ఇప్పుడు ఆ టీవీ రూ.11,999కి అందుబాటులో ఉంది. ఇది 40W స్పీకర్ అవుట్‌పుట్‌ను సపోర్ట్‌ చేసే HD-రెడీ స్క్రీన్, 2 స్పీకర్‌లను అందిస్తుంది. 40 అంగుళాల టీవీ మోడల్ ధర ఇంతకు ముందు రూ.16,999గా ఉండేది.. ఇప్పుడు రూ.15,999కు లభిస్తోంది. ఇందులో 42-అంగుళాల ఫుల్-హెచ్‌డి (1,920x1080 పిక్సెల్‌లు) మోడల్‌ ధర రూ.19,999కాగా.. ఇప్పుడు కేవలం రూ.17,999కు లభిస్తోంది. Android వెర్షన్, అల్ట్రా-సన్నని బెజెల్, 1GB RAM, 8GB ROM, అద్భుతమైన సరౌండ్ సౌండ్ సర్టిఫైడ్ ఆడియో, 40W స్పీకర్ అవుట్‌పుట్‌తో 2 స్పీకర్లను అందిస్తుంది.

ఇదీ చదవండి: టూర్ ప్లాన్ చేస్తున్నారా ? నార్త్ లో ఈ ప్రాంతాలకు వెళ్తే.. ఎప్పటికీ మీరు మరచిపోలేరు..!


ఒక అద్భుతమైన TV మోడల్.. 43-అంగుళాల అల్ట్రా-HD (3,840x2, 160 పిక్సెల్‌లు) ధర రూ.21,999 అయితే ఇప్పుడు కేవలం రూ.19,999కి అందుబాటులో ఉంది. ఇది ఇన్‌బిల్ట్ 2GB రామ్, 8GB ROM, Android 10 ద్వారా వస్తుంది. 50W స్పీకర్ అవుట్‌పుట్, డాల్బీ డిజిటల్ ప్లస్, DTS TruSurround సర్టిఫైడ్ ఆడియో, 4 స్పీకర్లు వంటి ఫీచర్లను అందిస్తుంది.

ఇటీవల లాంచ్‌ చేసిన విడుదల చేసిన కొత్త 43-అంగుళాల టీవీ ఇంతకుముందు రూ.28,999 ఉండగా.. యానివర్సరీ సేల్‌లో కేవలం రూ.26,999కి అందుబాటులో ఉంది. ఇది 1 GB RAM, 8 GB ROM, 3 HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లకు సపోర్ట్‌ చేస్తుంది.

బిగ్‌-స్క్రీన్ 50-అంగుళాల అల్ట్రా-HD (3840x2160 పిక్సెల్‌లు) టీవీ ధర ఇంతకముందు రూ.33,999కాగా.. ఇప్పుడు ఇది కేవలం రూ.31,999కి అందుబాటులో ఉంది. ఇది ఆండ్రాయిడ్ 10 ద్వారా పని చేస్తుంది, డాల్బీ డిజిటల్ ప్లస్, DTSతో 60W స్పీకర్ అవుట్‌పుట్‌తో వస్తుంది. TruSurround సర్టిఫైడ్‌ ఆడియో, 4 స్పీకర్లు, 2 GB ర్యామ్ వంటి ఫీచర్‌లు ఉన్నాయి.



Bezel-less 55-inch Ultra-HD(3840x2160 పిక్సెల్‌లు) గతంలో రూ.39,999 ధరలో ఉంది.. ఇప్పుడు ఇది కేవలం రూ.37,999కు దక్కుతోంది. డాల్బీ డిజిటల్ ప్లస్, DTS TruSurround సర్టిఫైడ్ ఆడియో, Dolby MS12 సౌండ్ టెక్నాలజీతో 60w సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. టీవీ రిమోట్‌ను గూగుల్ అసిస్టెంట్ ద్వారా కంట్రోల్‌ చేయవచ్చు.

65-అంగుళాల అల్ట్రా-HD ధర ఇంతకుముందు రూ.56,999గా ఉండేది.. ఇది ఇప్పుడు కేవలం రూ.54,999కు అందుబాటులో ఉంది. ఇది న్యూ ఆండ్రాయిడ్ 10 ద్వారా పని చేస్తుంది. డాల్బీ డిజిటల్ ప్లస్, DTS TruSurround సర్టిఫైడ్ ఆడియో, డాల్బీ MS12 సౌండ్‌తో 60W స్పీకర్ అవుట్‌పుట్‌తో వస్తుంది. Dolby Atmos, 4 స్పీకర్లను డీకోడ్ చేసి మెరుగుపరచగల టెక్నాలజీ ఉంది. ఇది 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.
Published by:Mahesh
First published:

Tags: Budget smart tv, Flipkart, Offers, Smart TV

తదుపరి వార్తలు