Blaupunkt TV: ఇంట్లోనే మినీ థియేటర్​... బ్లాపంక్ట్ నుంచి 50 అంగుళాల అతిపెద్ద స్మార్ట్​టీవీ వచ్చేసింది

Blaupunkt TV: ఇంట్లోనే మినీ థియేటర్​... బ్లాపంక్ట్ నుంచి 50 అంగుళాల అతిపెద్ద స్మార్ట్​టీవీ వచ్చేసింది (image: Flipkart)

Blaupunkt TV | మీ ఇంట్లో మినీ థియేటర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? బ్లాపంక్ట్ నుంచి 50 అంగుళాల సైబర్ సౌండ్ హెచ్‌డీ ఆండ్రాయిడ్ టీవీ లాంఛ్ అయింది.

  • Share this:
కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో అందరూ ఇళ్లలోనే సినిమాలు చూడటం అలవాటు చేసుకున్నారు. ఇలాంటి వారిని టార్గెట్​ చేస్తూ కొత్త సేవలను ప్రారంభించాయి ఓటీటీ ప్లాట్‌ఫాంలు. కొత్త సినిమాలు, వెబ్​సిరీస్​లను ఓటీటీల్లోనే రిలీజ్​ చేస్తుండటంతో ఇంట్లోనే థియేటర్​ సెటప్​ చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే పెద్ద సైజులో ఉన్న టీవీలు కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. తద్వారా ఇంట్లోనే మినీ​ థియేటర్​ అనుభవాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే జర్మనీకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్​ బ్రాండ్​ బ్లాపంక్ట్​ కొత్త స్మార్ట్​టీవీని లాంచ్​ చేసింది. 50- అంగుళాల సైబర్‌సౌండ్ అల్ట్రా-హెచ్‌డి ఆండ్రాయిడ్ టీవీని ఆగస్టు 5న భారత మార్కెట్​లోకి విడుదల చేసింది. ఇది ఈరోజు నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఈ స్మార్ట్​టీవీ DTS ట్రూసరౌండ్​, డాల్బీ ఎంఎస్​ 12, డాల్బీ అట్మాస్​ ఆడియో టెక్నాలజీలతో పనిచేస్తుంది. మరోవైపు క్లారిటీ కంటెంట్‌ కోసం ఇంటర్నల్​ క్రోమ్​కాస్ట్​, ఎయిర్‌ప్లే వంటి ఫీచర్లను అందించారు.

Mi 11 Lite: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.3,500 డిస్కౌంట్... ఆఫర్ వివరాలు ఇవే

Vivo Y72 5G: మీ పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.2,000 లోపే 5జీ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు... ఆఫర్ వివరాలివే

ధర, లభ్యత


బ్లాపంక్ట్ 50 అంగుళాల సైబర్ సౌండ్ అల్ట్రా-హెచ్‌డి ఆండ్రాయిడ్ టీవీ (50CSA7007) భారత మార్కెట్​లో రూ. 36,999 ధర వద్ద లభిస్తుంది. దీన్ని ఈ–కామర్స్​ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈరోజు (ఆగస్టు 6) నుంచి బుకింగ్స్​ ప్రారంభమయ్యాయి. ఈ స్మార్ట్ టీవీ సింగిల్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. బ్లాపంక్ట్ జులైలో 32 అంగుళాలు, 42 అంగుళాలు, 43 అంగుళాలు, 55 అంగుళాల నాలుగు స్మార్ట్​టీవీలను లాంచ్​ చేసింది. వీటికి అదనంగా ఇప్పుడు 50 అంగుళాల మోడల్​ను ఆవిష్కరించింది.

Mi 11x 5G: ఈ స్మార్ట్‌ఫోన్‍‌పై రూ.7,000 డిస్కౌంట్... ఆఫర్ వివరాలు ఇవే

Realme Narzo 30: రియల్‌మీ నార్జో 30 కొత్త వేరియంట్ వచ్చేసింది... ధర ఎంతంటే

స్పెసిఫికేషన్లు


కొత్త బ్లాపంక్ట్ టీవీ.. బేజిల్​ లెస్​ డిజైన్​తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఓఎస్​తో పనిచేస్తుంది. దీనిలోని 4 స్పీకర్లు గరిష్టంగా 60W డాల్బీ డిజిటల్ ప్లస్, DTS ట్రూ సరౌండ్​ సర్టిఫైడ్ ఆడియోను ఉత్పత్తి చేస్తాయి. ఈ స్పీకర్లు డాల్బీ MS12 సౌండ్ టెక్నాలజీ తో పనిచేస్తాయి. ఈ స్మార్ట్​టీవీలో ఆర్‌ఎమ్ కార్టెక్స్-ఎ 53 ఆధారిత మీడియాటెక్ చిప్‌సెట్​ను అందించారు. ఇది 2 జిబి ర్యామ్, 8 జిబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. దీనిలోని 50 అంగుళాల 4K IPS+ ప్యానెల్‌ గరిష్టంగా 500 నిట్స్‌ బ్రైట్​నెస్​ ఉత్పత్తి చేస్తుంది.

ఇది గూగుల్ అసిస్టెంట్‌తో పాటు వాయిస్ -ఎనేబుల్డ్ రిమోట్ ఫీచర్ సపోర్ట్​తో వస్తుంది. దీని రిమోట్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్, గూగుల్ ప్లే బటన్స్​ను కూడా చేర్చింది. ఇక, కనెక్టివిటీ ఆప్షన్లను పరిశీలిస్తే.. దీనిలో 2.4GHz, 5GHz బ్యాండ్స్​తో కూడిన డ్యుయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ v5.0, మూడు HDMI పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌ వంటివి అందించింది.
Published by:Santhosh Kumar S
First published: