Blaupunkt: బ్లాపంక్ట్ నుంచి 4 స్మార్ట్​టీవీలు... ధర రూ.14,999 నుంచి

Blaupunkt: బ్లాపంక్ట్ నుంచి 4 స్మార్ట్​టీవీలు... ధర రూ.14,999 నుంచి (image: Flipkart)

Blaupunkt Smart Tv | కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? జర్మనీకి చెందిన బ్లాపంక్ట్ 4 ఆండ్రాయిడ్ స్మార్ట ్టీవీలను లాంఛ్ చేసింది. ధర, ఫీచర్స్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
జర్మన్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బ్లాపంక్ట్ భారత మార్కెట్లోకి మరోసారి ప్రవేశించింది. తాజాగా ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీల రీ-ఎంట్రీని ప్రారంభించింది. భారత్​కు చెందిన సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SPPL) కంపెనీతో ఒప్పందం చేసుకొని కొత్తగా నాలుగు "మేడ్ ఇన్ ఇండియా" టీవీలను విడుదల చేసింది. ఈ స్మార్ట్​టీవీల తయారీ, బ్రాండింగ్, డిజైనింగ్, ప్యాకేజింగ్, రిటైల్ వంటి అన్ని పనులను ఎస్పి ​SPPL సంస్థే నిర్వహించనుంది. జులై 10 నుంచి ఈ కొత్త బ్లాపంక్ట్ స్మార్ట్​టీవీలను ఫ్లిప్‌కార్ట్‌ అందుబాటులోకి తేనుంది.

ఈ నాలుగు స్మార్ట్​టీవీలు రూ.14,999 నుంచి రూ.40,999 ధరల శ్రేణిలో లభిస్తాయి. బ్లాపంక్ట్ ఆండ్రాయిడ్ టివి మోడల్స్​ను పరిశీలిస్తే.. దీనిలో 32 అంగుళాల హెచ్‌డి రెడీ సైబర్‌సౌండ్ ఆండ్రాయిడ్ టివి, 42 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ఆండ్రాయిడ్ టివి, 43 అంగుళాల సైబర్‌సౌండ్ 4 కె ఆండ్రాయిడ్ టివి, 55 అంగుళాల 4 కె ఆండ్రాయిడ్ టీవీ వంటివి ఉన్నాయి.

Swiggy: స్విగ్గీకి షాక్... రూ.4.50 జీఎస్‌టీ వసూలు చేసినందుకు రూ.20,000 ఫైన్

WhatsApp: వాట్సప్ యూజర్లకు ఊరట... ప్రైవసీ పాలసీపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే


32 అంగుళాల హెచ్‌డి రెడీ సైబర్‌సౌండ్ ఆండ్రాయిడ్ టీవీ.. ఆండ్రాయిడ్ 9 బెజెల్ లెస్​ డిస్​ప్లేతో వస్తుంది. దీనిలో 40W స్పీకర్ అవుట్‌పుట్​ను అందించింది. ఇది ఎడ్జ్-ఫ్రీ సరౌండ్ సౌండ్ టెక్, రెండు స్పీకర్లు, 1GB RAM, 8 GB ROM ​తో వస్తుంది. ఈ స్మార్ట్​టీవీ రూ. 14,999 ధర వద్ద లభిస్తుంది. 42 అంగుళాల బ్లాపంక్ట్ ఎఫ్‌హెచ్‌డి ఆండ్రాయిడ్ టివి ఆండ్రాయిడ్ 9, అల్ట్రా స్లిమ్​ బెజెల్స్‌ డిస్​ప్లేతో వస్తుంది. ఇది 40W స్పీకర్ అవుట్​పుట్​, ఎడ్జ్-ఫ్రీ సౌండ్ టెక్నాలజీ, 2 స్పీకర్లు, 1GB RAM, 8 GB ROM ​ వంటివి అందించింది. 42 అంగుళాల ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ రూ, 21,999 ధర వద్ద లభిస్తుంది.

Zomato IPO: జొమాటో ఐపీఓ డేట్ ఫిక్స్... గ్రే మార్కెట్ ప్రీమియం ఎంతంటే

Zomato: జొమాటో వాడుతున్నారా? రూ.3,00,000 రివార్డు గెలుచుకోవచ్చు ఇలా

ఫ్లిప్​కార్ట్ ద్వారా అమ్మకాలు


మంచి సౌండ్ క్వాలిటీ కోసం చూసే వారి కోసం ప్రత్యేకంగా 43 అంగుళాల సైబర్‌సౌండ్ 4 కె ఆండ్రాయిడ్ టివిని విడుదల చేసింది. దీనిలో 50W స్పీకర్లను అందించడం విశేషం. ఈ స్మార్ట్​ టీవీ డాల్బీ డిజిటల్ ప్లస్, డిటిఎస్ ట్రూసరౌండ్ అనే నాలుగు స్పీకర్లతో వస్తుంది. ఇది డాల్బీ ఎంఎస్ 12 సౌండ్ టెక్నాలజీతో పని చేస్తుంది. ఇది 2GB RAM, 8 GB ROM 2 కలిగి ఉంటుంది. ఇక, ఈ స్మార్ట్​టీవీ రూ.30,999 ధర వద్ద లభిస్తుంది.

చివరగా 55 అంగుళాల అతి పెద్ద స్మార్ట్​టీవీ 60W స్పీకర్ అవుట్​పుట్, డాల్బీ డిజిటల్ ప్లస్, డిటిఎస్ ట్రూ సరౌండ్ సర్టిఫైడ్ ఆడియో, డాల్బీ ఎంఎస్ 12 టెక్ మొదలైన ఫీచర్లతో వస్తుంది. ఇందులో కూడా నాలుగు స్పీకర్లను అందించింది. దీనిలో వాయిస్- ఎనేబుల్డ్ రిమోట్‌తో పాటు 5.0 బ్లూటూత్, 2 యుఎస్‌బి పోర్ట్‌లు, 3 హెచ్‌డిఎంఐ పోర్ట్‌ వంటి కనెక్టింగ్​ ఫీచర్లను అందిచింది. ఇవన్నీ ARM కార్టెక్స్ A53 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఈ 55 అంగుళాల బ్లాపంక్ట్ స్మార్ట్ టీవీ రూ. 40,999 వద్ద లభిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published: