BISLERI MOBILE APP LAUNCH OF THE LATEST MOBILE APP FROM BISLERI DOOR DELIVERY WITHIN 24 HOURS OF BOOKING WATER CAN GH EVK
Bisleri Mobile App: బిస్లెరీ నుంచి సరికొత్త మొబైల్ యాప్ లాంచ్.. వాటర్ క్యాన్ బుక్ చేసుకున్న 24 గంటల్లోపు డోర్ డెలివరీ
బిస్లెరీ వాటర్ క్యాన్స్
Bisleri Mobile App: ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్ బిస్లెరీ పరిశుభ్రమైన తాగు నీటిని డబ్బాల్లో, ప్యాకెట్లలో విక్రయిస్తూ పాపులర్ బ్రాండ్‌గా రాణిస్తోంది. ఈ బ్రాండ్ తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. బిస్లెరీ ఇంటర్నేషనల్ D2C (డైరెక్ట్ టు కన్స్యూమర్) కాన్సెప్ట్‌ను ప్రోత్సహిస్తూ డోర్‌స్టెప్ అనే మొబైల్ అప్లికేషన్‌ను లాంచ్ చేసింది.
ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్ బిస్లెరీ (Bisleri) పరిశుభ్రమైన తాగు నీటిని డబ్బాల్లో, ప్యాకెట్లలో విక్రయిస్తూ పాపులర్ బ్రాండ్‌గా రాణిస్తోంది. ఈ బ్రాండ్ తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. బిస్లెరీ ఇంటర్నేషనల్ D2C (డైరెక్ట్ టు కన్స్యూమర్) కాన్సెప్ట్‌ను ప్రోత్సహిస్తూ డోర్‌స్టెప్ అనే మొబైల్ అప్లికేషన్ (Mobile Application) ను లాంచ్ చేసింది. ఈ యాప్ సహాయంతో వినియోగదారులు నేరుగా ప్యాకేజ్డ్ వాటర్‌ను బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసుకున్న 24 గంటల్లోపు డోర్‌స్టెప్ విధానంలో వాటర్ క్యాన్ల (Water Cans) ను ఇంటికే నేరుగా డెలివరీ చేస్తారు. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ (Android), ఐఓఎస్ (iOS) యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే కొన్ని నగరాల్లో బిస్లెరీ వాటర్ డోర్ డెలివరీ సేవలను ప్రారంభించింది. తొలుత హైదరాబాద్ (Hyderabad), బెంగళూరు (Bangalore), గురుగ్రామ్, అహ్మదాబాద్, చెన్నై (Chennai) తదితర నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
ఈ యూజర్ ఫ్రెండ్లీ యాప్ ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా 26 నగరాల్లో డోర్ డెలివరీ సేవలు ప్రారంభమయ్యాయి. బిస్లెరి ఇంటర్నేషనల్ (International) తన ఈ–కామర్స్ వెంచర్‌ను విస్తరించడానికి, యూజర్లకు పెరుగుతున్న అవసరాలను తీర్చడంలో భాగంగా ఈ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా వాటర్ క్యాన్ బుక్ చేసుకుంటే కేవలం 24 గంటలలోపు ఇంటి వద్దకే డెలివరీ చేస్తామని బిస్లెరీ ప్రకటించింది. కోవిడ్–19 -ప్రేరిత లాక్డౌన్ టైమ్‌లో ఆన్లైన్ బుకింగ్ (Online Booking)కు ఆదరణ పెరిగింది.
ముఖ్యంగా నిత్యావసర సరుకులు, ఫుడ్ ఐటమ్స్ (Food Items)ను బుక్ చేసుకునేందుకు ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపించారు. మరోవైపు, కరోనా భయంతో బయటికి వెళ్లి వస్తువులు కొనుగోలు చేయలేని వారికి ఆన్లైన్ బుకింగ్ వరంలా మారింది. దీంతో, ఆన్లైన్ బుకింగ్‌కు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా బిస్లెరీ కూడా డోర్ డెలివరీ సేవలను ప్రారంభించాలని లాక్డౌన్ (Lockdown) సమయంలోనే నిర్ణయించింది. దీంతో, కంపెనీ తాజాగా అన్ని ఉత్పత్తులను యాక్సెస్ చేయడానికి వన్-స్టాప్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రకటించింది.
ఆ సేవల కోసం సబ్స్క్రిప్షన్
బిస్లరీ మినరల్ వాటర్ (Mineral Water) ను నిరంతరాయంగా సరఫరా పొందడం కోసం కస్టమర్లు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. 122 ఆపరేషనల్ ప్లాంట్, 4500 డిస్ట్రిబ్యూటర్లతో దేశ వ్యాప్తంగా ఆయా నగరాల్లో 24 గంటల ప్యాకేజ్డ్ వాటర్‌ను డెలివరీ చేయనున్నట్లు బిస్లెరీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవిడ్–19 రాకతో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ డెలివరీ సేవలను ప్రారంభించినట్లు బిస్లెరీ సీఈవో అంజెలో జార్జ్ వెల్లడించారు. బిస్లెరీ మినరల్ వాటర్ కఠినమైన 10 దశల్లో ప్యూరిఫికేషన్, దాదాపు 114 టెస్ట్‌ల ద్వారా బెస్ట్ క్వాలిటీ (Best Quality) వాటర్‌ను సరఫరా చేస్తుంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.