హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Gold: మీరు కొన్న బంగారం నకిలీదని డౌట్ ఉందా? ఈ యాప్ మీకోసమే

Gold: మీరు కొన్న బంగారం నకిలీదని డౌట్ ఉందా? ఈ యాప్ మీకోసమే

Gold: మీరు కొన్న బంగారం నకిలీదని డౌట్ ఉందా? ఈ యాప్ మీకోసమే
(ప్రతీకాత్మక చిత్రం)

Gold: మీరు కొన్న బంగారం నకిలీదని డౌట్ ఉందా? ఈ యాప్ మీకోసమే (ప్రతీకాత్మక చిత్రం)

Gold Hallmark | మీరు హాల్‌మార్క్ నగలే కొన్నారా? హాల్‌మార్క్ వేసిన సంస్థ అసలుదేనా నకిలీదా? తెలుసుకోండి ఇలా.

బంగారు నగలు కొనడానికి వెళ్లినప్పుడు స్వచ్ఛత గురించి ఆరా తీస్తుంటారు. ఇప్పటికే నగలు కొన్నవారికి తాము కొన్న బంగారం అసలుదా, నకిలీదా అన్న అనుమానాలు సామాన్యుల్లో ఉండటం మామూలే. నగల పైన హాల్‌మార్క్ ఉన్నా బంగారం నాణ్యత విషయంలో ఆందోళన ఉంటుంది. ఇలాంటి అనుమానాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఓ యాప్ రూపొందించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్-BIS కి చెందిన యాప్ ఇది. BIS-Care పేరుతో గూగుల్ ప్లేస్టోర్‌లో ఉంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎవరైనా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉపయోగించొచ్చు. ఇందులో యూజర్లు ఐఎస్ఐ క్వాలిటీ హాల్‌మార్క్స్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ను ఇప్పటికే 50 వేల సార్లు డౌన్‌లోడ్ చేయడం విశేషం.

Good News: డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయలేదా? కేంద్ర ప్రభుత్వం శుభవార్త

New Rules from January 1: జనవరి 1 నుంచి ఈ 12 కొత్త రూల్స్... మీపై ప్రభావం ఎంతో తెలుసుకోండి

BIS-Care app: బీఐఎస్-కేర్ యాప్ ఎలా ఉపయోగించాలి?


స్మార్ట్‌ఫోన్ యూజర్లు బీఐఎస్-కేర్ యాప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. Licence details, Verify Hallmark లాంటి ఆప్షన్స్ ఉంటాయి. మీరు కొన్న నగలకు హాల్‌మార్క్ గుర్తు ఉంటుంది. అయితే ఆ హాల్‌మార్క్ వేసింది ఎవరు? హాల్‌మార్క్ వేసేందుకు ఆ సంస్థకు అనుమతి ఉందా? అనుమతి లేకపోయినా హాల్‌మార్క్ వేస్తోందా? అన్న వివరాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత Verify Hallmark ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అందులో హాల్‌మార్క్ సెంటర్ నెంబర్ ఎంటర్ చేయాలి. అనుమతి లేకపోయినా హాల్‌మార్క్ వేస్తున్నట్టు తెలిస్తే ఇదే యాప్‌లో కంప్లైంట్ చేయొచ్చు.

Gold Price: బంగారం ధర ఢమాల్... రూ.7,500 తగ్గిన గోల్డ్ రేట్

LPG Gas Cylinder: అర్జెంటుగా గ్యాస్ సిలిండర్ కావాలా? వెంటనే తెచ్చుకోండి ఇలా

హాల్‌మార్క్ మాత్రమే కాదు ఐఎస్ఐ, లైసెన్స్ లాంటి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఐఎస్ఐ మార్క్, హాల్‌మార్క్, రిజిస్ట్రేషన్ మార్క్, తప్పుడు ప్రచారాలు, ప్రకటనలకు సంబంధించిన ఫిర్యాదులు చేయొచ్చు.

First published:

Tags: BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold ornmanets, Gold prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Mobile App, Personal Finance, Playstore, Silver rates

ఉత్తమ కథలు