• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • BILLIONAIRE READY FOR SPACEX MOON FLIGHT WITH NASA INTERNATIONAL SPACE STATION HERE IS THE LATEST DEVELOPMENTS NK GH

Moon SpaceX: చంద్రుడి మీదకు ప్రైవేటు ప్రయాణం షురూ.. చాన్స్ కొట్టేసిన డేటా ఇంజినీర్

Moon SpaceX: చంద్రుడి మీదకు ప్రైవేటు ప్రయాణం షురూ.. చాన్స్ కొట్టేసిన డేటా ఇంజినీర్

చంద్రుడి మీదకు ప్రైవేటు ప్రయాణం షురూ.. చాన్స్ కొట్టేసిన డేటా ఇంజినీర్ (image credit - twitter - spacex)

SpaceX Moon Trip: అంతరిక్షంపై ఫోకస్ పెట్టిన స్పేస్ఎక్స్... త్వరలోనే చందమామ చెంతకు వెళ్లేందుకు ట్రిప్ ప్లాన్ చేసింది. అందులో ఓ డేటా ఇంజినీర్ వెళ్లబోతున్నాడు. అతను ఎలా సెలెక్ట్ అయ్యాడో తెలుసుకుందాం.

  • Share this:
SpaceX Moon Plan: చాలా మంది చంద్రుడిపైకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎప్పుడు ఆ అవకాశం వస్తుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. ఈ కలను నేను నిజం చేస్తానంటూ ముందుకొచ్చాడో బిలియనీర్. ఆయనే పైలట్, 38 ఏళ్ల వయసున్న ఐజాక్మన్. ఈ మిషన్‌లో తనతో పాటు మరో ముగ్గురిని చంద్రుడి మీదకు తీసుకెళ్తానని ప్రకటించాడు. కాగా, ఈ ప్రైవేట్ స్పేస్‌ఎక్స్ విమానంలో ఒక సీటును ఓ సైంటిస్ట్ దక్కించుకోగా, మరో సీటు డేటా ఇంజనీర్‌కు అవకాశం లభించింది. స్కెంబ్రోస్కీ (41) డేటా ఇంజినీర్‌కు స్పేస్‌ఎక్స్‌లో ప్రయాణించేందుకు లాటరీ దక్కలేదు. అయితే, అతడి స్నేహితుడికి లాటరీ దక్కగా, ఆ అవకాశాన్ని స్కెంబ్రోస్కీకి ఇచ్చాడు. అనుకోని అవకాశం లభించడంతో స్కెంబ్రోస్కీ స్పేస్​ఎక్స్​ ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు.

ఈ ఇద్దరితో పాటు, అరిజోనా టెంపేలో కమ్యూనిటీ కాలేజీ విద్యావేత్త, భూగర్భ శాస్త్రవేత్త సియాన్ ప్రొక్టర్‌తో పాటు... హేలే ఆర్కినాక్స్ కూడా చంద్రుడికి పైకి వెళ్లనున్నారు. ఈ నలుగురూ కలిసి 3 రోజుల పాటు చంద్రయానం చేయనున్నారు. కాగా, ఈ నలుగురూ మంగళవారం నాసా (NASA) కెన్నెడీ అంతరిక్ష కేంద్రంలో సమావేశమయ్యారు. ప్రస్తుతం అంతరిక్షయానంపై శిక్షణ తీసుకుంటున్నారు.

ఈ సందర్భంగా ఫ్లైట్ స్పాన్సర్ ఐజాక్మన్ తన ఇన్స్పిరేషన్ 4 మిషన్ గురించి అనేక ఆసక్తికర వివరాలను వెల్లడించారు. పెన్సిల్వేనియా అల్లెంటౌన్‌లోని క్రెడిట్ కార్డ్ - ప్రాసెసింగ్ సంస్థ షిఫ్ట్ 4 పేమెంట్స్‌‌కు అధిపతి అయిన ఐజాక్మన్... స్నేస్‌ఎక్స్ ప్రయాణానికి నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం, స్పేస్‌ఎక్స్ రాకెట్‌ను నాసా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సిద్ధం చేస్తున్నారు. ఇది 335 మైళ్ళు (540 కిలోమీటర్లు) ఎత్తులో ఉండే లక్ష్యంతో సెప్టెంబర్‌లో ప్రయోగానికి సిద్ధమవుతోంది. అయితే, స్పేస్‌క్రాఫ్ట్ మిషన్‌కు కమాండర్‌గా పనిచేస్తున్న ఐజాక్మన్... ఆ ప్రయోగానికి ఎంత మొత్తంలో చెల్లిస్తున్నారనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.


మొత్తం నలుగురు ప్రయాణికులతో స్పేస్‌ఎక్స్:
41 ఏళ్ల స్కెంబ్రోస్కి విరాళం ఇచ్చి లాటరీలోకి ప్రవేశించాడు. కాని ఈ నెల ప్రారంభంలో తీసిన లాటరీ డ్రాయింగ్‌లో అతను ఎంపిక కాలేదు. అతని స్నేహితుడికి లాటరీ దక్కడంతో అనుకోని అవకాశం లభించింది. స్నేహితుడికి లాటరీ దక్కినప్పటికీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల స్పేస్‌ఎక్స్​ ప్రయాణానికి నిరాకరించి, ఆ అవకాశాన్ని స్కెంబ్రోస్కీకి ఇచ్చాడు. ప్రస్తుతం డేటా ఇంజినీర్‌గా పనిచేస్తున్న స్కెంబ్రోస్కి.. కాలేజీ రోజుల్లో స్పేస్ క్యాంప్ కౌన్సెలర్‌గా, స్పేస్​అడ్వకసీ గ్రూప్‌లకు వాలంటీర్‌గా పనిచేశాడు.

అనుకోని అవకాశం లభించడంతో సెంబ్రోస్కి "నేను అంతరిక్షంలోకి వెళుతున్నానని ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను. చాలా సంతోషంగా ఉంది. నా కల నిజమవ్వబోతోంది." అని చెప్పాడు. స్పేస్‌ఎక్స్‌లో ప్రయాణానికి అవకాశం దక్కించుకున్న భూగర్భ శాస్త్రవేత్త ప్రొక్టర్ ఇదివరకే నాసా ఆస్ట్రోనాట్​కాప్స్‌కు మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నారు. ఆమెకు 2009లో నాసా చేపట్టిన అంతరిక్షయానంలో ప్రయాణానికి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఎట్టకేలకు ఇప్పడు ప్రైవేట్​ స్పేస్‌ఎక్స్ మిషన్‌లో అవకాశం దక్కించుకుంది. ఆమె గువామ్‌లో జన్మించింది. ఆమె తండ్రి హిడెన్ ఫిగర్ కూడా నాసా శాస్త్రవేత్త. ఆయన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్స్‌తో కలిసి నాసా ట్రాకింగ్ స్టేషన్‌లో పనిచేశారు.

ఇది కూడా చదవండి: Fruits Benefits: ఏ పండ్లతో ఏ మేలు కలుగుతుంది? ఏ వ్యాధికి ఏ పండు తినాలి?

ఈ ప్రాజెక్టులో భాగంగా... చందమామ చెంతకు వెళ్లేందుకు 3 రోజులు పడుతుంది. ఆ తర్వాత చందమామ చుట్టూ తిరిగేలా కక్ష్యలోకి రాకెట్ వెళ్తుంది. అలా జర్నీ పూర్తయ్యాక... మళ్లీ మూడ్రోజుల పాటూ ప్రయాణించి భూమికి వస్తారు. ఇది మొదటి ప్రైవేట్ ల్యూనార్ మిషన్. ఈ మిషన్‌లో స్పేస్‌ఎక్స్ రాకెట్... ఒకప్పటి అపోలో మిషన్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.
First published:

అగ్ర కథనాలు