పబ్‌జీ ఫ్యాన్స్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. పబ్‌జీ మొబైల్, పబ్‌జీ మొబైల్ లైట్ గేమ్స్ ఇండియాలో ఈరోజు నుంచి పనిచేయవు. ఈ గేమ్స్‌ని ఇప్పటికే బ్యాన్ చేశారు కదా అన్న అనుమానం రావొచ్చు. ఈ గేమ్‌ను భారత ప్రభుత్వం ఇప్పటికే బ్యాన్ చేసింది. అయితే ఈ బ్యాన్ కన్నా ముందే యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నవారు గేమ్‌ను ఆడే అవకాశం మాత్రం ఇన్నాళ్లూ ఉంది. అంటే బ్యాన్ కన్నా ముందే స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్‌లో పబ్‌జీ మొబైల్ లేదా పబ్‌జీ మొబైల్ లైట్ యాప్స్ ఉంటే యూజర్లు గేమ్ ఆడటానికి ఇబ్బంది ఏమీ ఉండేది కాదు. కొత్తగా డౌన్‌లోడ్ చేయాలనుకునేవారికి మాత్రం సాధ్యం కాలేదు. ముందే యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నవారంతా గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వారికి ఇప్పుడు పెద్ద షాక్ తగిలింది. అక్టోబర్ 30 నుంచి పబ్‌జీ మొబైల్, పబ్‌జీ మొబైల్ లైట్ గేమ్ అందుబాటులో ఉండదని పబ్‌జీ అధికారికంగా ప్రకటించింది. అంటే డౌన్‌లోడ్ చేసుకున్నవారు కూడా ఈ గేమ్ ఆడటం సాధ్యం కాదు. అక్టోబర్ 30 నుంచి ఇండియాలో తమ సేవల్ని నిలిపివేస్తామని, యూజర్లను తొలగిస్తామని టెన్సెంట్ గేమ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Flipkart Big Diwali sale: రెడ్‌మీ నుంచి రియల్‌మీ వరకు... ఈ 12 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్
సగం ధరకే iPhone 12... మీ పాత ఫోన్ ఇచ్చి కొనండి ఇలా
పబ్‌జీ మొబైల్, పబ్‌జీ మొబైల్ లైట్ యాప్స్ ముందే ఇన్‌స్టాల్ చేసుకున్నవారితో పాటు ఏపీకే ఫైల్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నవారు కూడా ఈ గేమ్ ఆడలేరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు నుంచి ఇండియాలో పబ్‌జీ మొబైల్, పబ్‌జీ మొబైల్ లైట్ యాప్స్ ఏ రకంగానూ పనిచేయవు. ఇక పబ్‌జీ మొబైల్‌కు సంబంధించిన పబ్లిషింగ్ రైట్స్‌ని పబ్‌జీ కార్పొరేషన్‌కు అందిస్తున్నట్టు ఫేస్‌బుక్ పోస్టులో పబ్‌జీ మొబైల్ ఇండియా వెల్లడించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు వివరించింది. యూజర్ల డేటా, సెక్యూరిటీ ఆందోళనల కారణంగా భారత ప్రభుత్వం మొత్తం 118 యాప్స్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. వాటిలో పబ్‌జీ మొబైల్, పబ్‌జీ మొబైల్ లైట్ యాప్స్‌తో పాటు టిక్ టాక్, వీచాట్, క్యామ్ స్కానర్ లాంటి పాపులర్ యాప్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China App Ban, India-China, Indo China Tension, PUBG, Video Games