Home /News /technology /

BIG SHOCK FOR IPHONE LOVERS HUGE INCREASE ON THAT SERIES OF PHONES HOW MUCH UMG GH

iPhone 14 Series: ఐఫోన్ లవర్స్ కు బిగ్ షాక్.. ఆ సీరీస్ ఫోన్లపై భారీ పెంపు.. ఎంతంటే ?

 ఐఫోన్ లవర్స్ కు బిగ్ షాక్.. ఆ సీరీస్ ఫోన్లపై భారీ పెంపు.. ఎంతంటే ?

ఐఫోన్ లవర్స్ కు బిగ్ షాక్.. ఆ సీరీస్ ఫోన్లపై భారీ పెంపు.. ఎంతంటే ?

ఐఫోన్(IPhone) 14 ప్రో మోడల్స్ ధరలను యాపిల్(Apple) అధికంగా పెంచవచ్చని అభిప్రాయపడ్డారు ప్రముఖ యాపిల్ అనలిస్ట్ మింగ్-చి కువో (Ming-Chi Kuo). వీటి ధరలు ఐఫోన్ 13 ప్రో ఫోన్ల ధరల కంటే మరింత ఎక్కువగా ఉంటే కొనుగోలుదారులపై ప్రభావం పడనుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ఐఫోన్ 14 (iPhone 14) సిరీస్ ఫోన్లను యాపిల్ (Apple) కంపెనీ ఎప్పుడు రిలీజ్ చేస్తుందా అని ఐఫోన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వచ్చే నెలలో అంటే సెప్టెంబరు 6న ఐఫోన్ 14 సిరీస్‌ను యాపిల్ కంపెనీ లాంచ్‌ చేస్తుందని టెక్(Tech) వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సరికొత్త ఐఫోన్ సిరీస్ ఫోన్లలో ఐఫోన్ 13 సిరీస్‌ కంటే మరిన్ని మెరుగైన ఫీచర్లను అందించారని రూమర్స్ పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐఫోన్ 14 ప్రో మోడల్స్(Models) ధరలను యాపిల్ అధికంగా పెంచవచ్చని అభిప్రాయపడ్డారు ప్రముఖ యాపిల్ అనలిస్ట్ మింగ్-చి కువో (Ming-Chi Kuo). వీటి ధరలు ఐఫోన్ 13 ప్రో ఫోన్ల ధరల కంటే మరింత ఎక్కువగా ఉంటే కొనుగోలుదారులపై ప్రభావం పడనుంది.

ఐఫోన్ 14 ప్రో మోడళ్ల ధరలను యాపిల్ పెంచవచ్చని కువో తాజాగా ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే కచ్చితమైన ధరలను ఆయన వెల్లడించలేదు.ఐఫోన్ 14 సిరీస్ ధర ఈ ఏడాది 15 శాతం పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. దీనర్థం 1,000 డాలర్ల ఐఫోన్ ప్రో మోడల్ ధర 1,050 డాలర్లకు పెరగవచ్చు. ద్రవ్యోల్బణం కారణంగా ఐఫోన్ 14 ధరలను పెంచాలని యాపిల్ నిర్ణయించిందని సమాచారం. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ మోడళ్లలో ఉన్న కొత్త ఫీచర్లు కూడా అధిక ధరకు కారణమవుతున్నాయి. ఐఫోన్ 14 ప్రో, ప్రో మ్యాక్స్‌ బేస్ వేరియంట్లు 256GB ఇంటర్నల్ స్టోరేజీతో లాంచ్ కానున్నాయని టాక్. ఈ స్టోరేజ్ సాధారణ 128GB కంటే రెండింతలు కాబట్టి ఈ మెరుగైన ఫీచర్స్ ధర పెరుగుదలకు దారితీయవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: Mahindra EVs: ఇక అన్ని సెగ్మెంట్లలోకి ఈవీ కార్స్ లాంచ్.. మహీంద్రా ఫ్యూచర్ ప్లాన్ చూస్తే మతిపోతుందీ..!


 కొత్త ఐఫోన్ 14 సిరీస్ వచ్చే నెలలో మొబైల్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సంవత్సరం ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్‌, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌తో వంటి నాలుగు మోడళ్లను రిలీజ్ చేయండి. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ నాచ్‌తో కాకుండా కొత్త డిజైన్‌తో లాంచ్ కానున్నాయని రూమర్స్ పేర్కొన్నాయి. అయితే ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్‌ నాచ్‌ డిజైన్‌తో రానున్నాయి. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ మొబైల్స్ కొత్త Apple A16 బయోనిక్ చిప్‌సెట్‌తో లాంచ్ కానున్నాయి. ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్‌ యాపిల్ A15 బయోనిక్ చిప్‌సెట్ కొత్త వెర్షన్‌తో లాంచ్ కానున్నాయి.



ఈ కంపెనీ త్వరలోనే యాపిల్ వాచ్ SE మోడల్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 8, సరికొత్త యాపిల్ వాచ్ ప్రోను కూడా విడుదల చేస్తుంది. అలానే ఐఫోన్ 14 లాంచ్ సమయంలో కొత్త ఐప్యాడ్ మోడల్‌ను రిలీజ్ చేయనుంది. టెక్ రిపోర్ట్స్ ప్రకారం, ఐఫోన్ 14 సిరీస్ అధికారికంగా లాంచ్ అయిన 10 రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 16 నుంచి భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 6న ఐఫోన్ 14 ఈవెంట్ జరగవచ్చని టెక్ వర్గాలు పేర్కొన్నాయి.
Published by:Mahesh
First published:

Tags: Apple, Iphone, Price Hike, Tech news

తదుపరి వార్తలు