హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Layoff Season: గూగుల్​ ఉద్యోగులకు భారీ షాక్​.. 10 వేల మందిని తొలగించే యోచనలో టెక్​ దిగ్గజం

Layoff Season: గూగుల్​ ఉద్యోగులకు భారీ షాక్​.. 10 వేల మందిని తొలగించే యోచనలో టెక్​ దిగ్గజం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మెటా, అమెజాన్, ట్విట్టర్​ వంటి దిగ్గజ సంస్థలు పెద్ద ఎత్తున తమ ఉద్యోగులను తొలగించాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌​లోకి టెక్ దిగ్గజం గూగుల్ కూడా చేరింది. గూగుల్​ మాతృ సంస్థ ఆల్ఫాబెట్​ ఏకంగా 10 వేల మంది ఉద్యోగులను సాగనంపేందుకు సిద్ధమవుతోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

ఐటీ రంగంలో ఇప్పుడు లే ఆఫ్స్​ ట్రెండ్(Layoffs Trend) నడుస్తోంది. దీంతో ఉన్నత స్థాయి ఉద్యోగుల నుంచి ఫ్రెషర్స్(Freshers)​ వరకు అందరికీ భయం పట్టుకుంది. ఉద్యోగాల కోత వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికే మెటా, అమెజాన్(Amazon), ట్విట్టర్​ వంటి దిగ్గజ సంస్థలు పెద్ద ఎత్తున తమ ఉద్యోగులను తొలగించాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌​లోకి టెక్ దిగ్గజం గూగుల్ కూడా చేరింది. గూగుల్​ మాతృ సంస్థ ఆల్ఫాబెట్​ ఏకంగా 10 వేల మంది ఉద్యోగులను సాగనంపేందుకు సిద్ధమవుతోంది. పనితీరు సరిగాలేని 10 వేల మంది ఉద్యోగులను లేదా మొత్తం వర్క్​ ఫోర్స్‌లో 6 శాతం మందిని తొలగించాలని యోచిస్తోంది. త్వరలోనే ఈ తొలగింపు ప్రక్రియను ప్రారంభించనుంది.

గూగుల్ ఇంటర్నల్ ర్యాంకింగ్​ సిస్టమ్ ద్వారా అత్యల్ప ర్యాంక్​ ఉన్న ఉద్యోగులను ఇంటికి పంపాలని భావిస్తోంది. ఉద్యోగుల పనితీరును విశ్లేషించి, వారికి ర్యాంక్​ ఇవ్వాల్సిందిగా తమ మేనేజర్​లను కోరినట్లు ది ఇన్ఫర్మేషన్‌ నివేదిక పేర్కొంది. ఆల్ఫాబెట్​ ఇటీవల తీసుకొచ్చిన కొత్త పనితీరు వ్యవస్థ ద్వారా పర్ఫార్మెన్స్​ సరిగా లేని ఉద్యోగులను గుర్తించి వారికి బోనస్, స్టాక్​ గ్రాంట్లను నిలుపుదల చేయాలని యోచిస్తోంది. ఆయా ఉద్యోగులను గుర్తించేందుకు ఇంటర్నల్ ర్యాంకింగ్​ సిస్టమ్‌​ను ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తోంది.

CTET Applications: తెలంగాణ నుంచి CTETకు వెల్లువెత్తిన దరఖాస్తులు.. పరీక్షకు పక్క రాష్ట్రం వెళ్లాల్సిందే..

కొత్త సిస్టమ్ ప్రకారం, గూగుల్ తన మొత్తం ఉద్యోగుల్లో 6 శాతం మందిని సాగనంపేందుకు ప్రణాళిక సిద్దం చేసింది. ఇందులో భాగంగానే పనితీరు పేలవంగా ఉన్న వారికి ర్యాంకులను ఇవ్వాలని మేనేజర్లను కోరినట్లు సమాచారం. అయితే, ఈ నివేదికపై ఆల్ఫాబెట్ ఇంకా స్పందించలేదు.

* 27 శాతం పడిపోయిన ఆదాయం..

కాగా, ఆల్ఫాబెట్ ప్రస్తుతం దాదాపు 187,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ఫైలింగ్ ప్రకారం, ఆల్ఫాబెట్ ఉద్యోగులను తొలిగిస్తే.. పరిహారం కింద ప్రతి ఉద్యోగికి సుమారు $295,884 చెల్లించే అవకాశం ఉంది. మరోవైపు, ఆల్ఫాబెట్ మూడవ త్రైమాసికంలో (Q3) $13.9 బిలియన్ల నికర లాభాన్ని నివేదించింది. అంటే, అంతకు ముందు సంవత్సరం కంటే కంపెనీ లాభం 27 శాతం తగ్గింది. అయితే, ఆదాయం 6 శాతం పెరిగి సంస్థ నికర విలువ $69.1 బిలియన్లకు చేరుకుంది.

TSPSC Exam Update: అభ్యర్థులకు అలర్ట్.. ఆ పరీక్ష షెడ్యూల్ విడుదల..

ప్రపంచ మందగమనం, మాంద్యం భయాల మధ్య కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ ఉద్యోగాల కోతలను సూచిస్తూ ఆల్ఫాబెట్‌ను మరింత సమర్థంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే గూగుల్ సంస్థ​ క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి దీర్ఘకాలిక ప్రాజెక్టులలో భారీ పెట్టుబడులు పెడుతోందని పిచాయ్ చెప్పారు. అందువల్ల ఉద్యోగులు సమర్ధవంతంగా పనిచేయాలని గుర్తుచేశారు.

యుఎస్‌లో కోడ్ కాన్ఫరెన్స్‌లో సమావేశాన్ని ఉద్దేశించి పిచాయ్ మాట్లాడుతూ, ‘కంపెనీ స్థూల ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదు. అందువల్ల, ఖర్చులు తగ్గించడంపై దృష్టి పెట్టాం. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో కఠినమైన చర్యలు తీసుకోబోతున్నాం.’ అని పేర్కొన్నారు. మరోవైపు, ఈ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో గూగుల్​ కొత్త ఉద్యోగుల నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఉద్యోగుల పనితీరు సరిగా లేకపోతే "షేప్ అప్ లేదా షిప్ అవుట్" ప్రక్రియను అనుసరించనుంది.

First published:

Tags: Employees, Google, Tech employees

ఉత్తమ కథలు