హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ అదుర్స్.. ఈ శామ్‌సంగ్‌ ఫోన్‌పై రూ.20 వేల తగ్గింపు!

Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ అదుర్స్.. ఈ శామ్‌సంగ్‌ ఫోన్‌పై రూ.20 వేల తగ్గింపు!

ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.20 వేల తగ్గింపు

ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.20 వేల తగ్గింపు

Flipkart Sale | ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్‌ పేరుతో మరోసారి స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ S21 FEని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Flipkart offer | పండుగ సీజన్లో ఈకామర్స్‌ కంపెనీలు వరుస ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. వివిధ ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌పై బెస్ట్‌ డీల్స్‌ అందిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఇటీవల బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా కస్టమర్ల కోసం బిగ్ దివాలీ సేల్‌ (Flipkart Big Diwali Sale) పేరుతో మరోసారి స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ S21 FEని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. శామ్‌సంగ్‌ నుంచి వచ్చిన ఈ ప్రీమియం 5G స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం జనవరిలో లాంచ్‌ అయింది. ఇండియాలో ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.54,999గా ఉంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్ ఈవెంట్‌లో కేవలం రూ.35,999కి లభిస్తోంది.

శామ్‌సంగ్‌ గెలాక్సీ S21 FE ప్రస్తుతం రూ.35,999 ధరకు లభించడం బెస్ట్‌ డీల్‌గా చెప్పవచ్చు. ఫోన్‌లో అప్‌డేటెడ్‌ సాఫ్ట్‌వేర్, పవర్‌ఫుల్‌ AMOLED 120Hz డిస్‌ప్లే ఆప్షన్లు ఉన్నాయి. ఫోన్‌ ఫాస్ట్, లాగ్-ఫ్రీ వర్క్‌, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మంచి బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. కెమెరాలు రిచ్, వైబ్రెంట్ షాట్‌లను క్యాప్చర్ చేయగలవు. దీంట్లోని ఆటో ఫోకస్ ఫీచర్‌ కూడా యూజర్లను ఆకట్టుకుంటుంది. రూ.30,000 రేంజ్‌లోని ఇతర బ్రాండ్ ఫోన్ల కంటే శామ్‌సంగ్‌ గెలాక్సీ S21 FE బెస్ట్‌ కెమెరాలను అందిస్తోంది. ముఖ్యంగా లో లైట్లో కూడా మెరుగైన ఫొటోలను అందిస్తుంది. ఈ డివైజ్‌ వైర్‌లెస్ ఛార్జింగ్, IP68 వాటర్-రెసిస్టెంట్ రేటింగ్‌ను పొందింది.

ఈ స్మార్ట్ టీవీపై ఏకంగా రూ.35 వేల డిస్కౌంట్.. అమెజాన్ ఊరించే ఆఫర్!

శామ్‌సంగ్‌ గెలాక్సీ S21 FE డివైజ్‌తో కంపెనీ ఛార్జర్‌ అందించట్లేదు. వినియోగదారులు అడాప్టర్‌ను కొనుగోలు చేయడానికి అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. రూ.30,000 రేంజ్‌లో 80W ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే ఫోన్‌లు చాలా ఉన్నాయి. కానీ శామ్‌సంగ్‌ గెలాక్సీ S21 FE 5G ఫోన్‌లో 25Wకి మాత్రమే సపోర్ట్ ఉంది. దీనికి అదనంగా కంపెనీ స్టోరేజీ పెంచుకునేందుకు ఎలాంటి ఆప్షన్‌ అందించలేదు. కంపెనీ రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను ప్యాక్ చేయకపోవడాన్ని ఎక్కువ మంది వినియోగదారులు సమస్యగా భావించవచ్చు.

రూ.96 వేల ఫోన్‌ను రూ.33 వేలకే కొనండి.. రూ.41 వేల డిస్కౌంట్ + రూ.22 వేల ఎక్స్చేంజ్ ఆఫర్!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్‌లో శామ్‌సంగ్‌ గెలాక్సీ S21 FE ఫోన్‌పై ప్రస్తుతం రూ.19,000 డిస్కౌంట్‌ ఉంది. బ్యాంక్ కార్డులపై రూ.1,250 డిస్కౌంట్‌ కూడా లభిస్తోంది. 8GB RAM + 128 GB స్టోరేజ్ మోడల్‌పై SBI, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో మరింత డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ను వినియోగించుకుంటే స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 34,749కి తగ్గుతుంది.

First published:

Tags: Flipkart, Flipkart Big Diwali Sale, Latest offers, Mobile offers, Samsung Galaxy

ఉత్తమ కథలు