హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart Big Billion Days: పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ కొంటే రూ.22 వేల తగ్గింపు! ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్లు

Flipkart Big Billion Days: పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ కొంటే రూ.22 వేల తగ్గింపు! ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్లు

 పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ కొంటే రూ.22 వేల తగ్గింపు! ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్లు

పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ కొంటే రూ.22 వేల తగ్గింపు! ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్లు

Flipkart Sale | మీరు కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? పాత ఫోన్ ఎక్స్చేంజ్‌లో ఇచ్చేసి కొత్తది తీసుకునే యోచనలో ఉన్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Flipkart Offers | మీరు కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ప్రస్తుతం ఉన్న ఫోన్‌ను వెనక్కి ఇచ్చేసి అంటే ఎక్స్చేంజ్ ఆఫర్ కింద కొత్త ఫోన్ కొనేందుకు సిద్ధం అవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) అదిరిపోయే ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చేస్తోంది. బిగ్ బిలియన్ డేస్ (Big Billion Days) సేల్ తీసువస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే ఈ సేల్ ప్రారంభం కాబోతోంది. ఎక్స్చేంజ్‌లో ఫోన్ కొనాలని భావించే వారికి మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ఒప్పొ రెపో8 5జీ ఫోన్‌ కొంటే ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 22 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అలాగే షావోమి 11ఐ 5జీ ఫోన్‌పై కూడా భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. రూ. 20 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. ఇంకా రియల్‌మి 9 ప్రో 5జీ ఫోన్‌పై 17 వేల వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు లభిస్తోంది. ఇంకా పిక్సల్ 6ఏ ఫోన్‌పై కూడా రూ. 20 వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద తగ్గింపు పొందొచ్చు. అలాగే శాంసంగ్ ఎస్22 ప్లస్ 5జీఫోన్‌పై కూడా ఆఫర్ ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 22 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. రియల్‌మి 9 ఫోన్‌పై రూ. 13,850 వరకు తగ్గింపు లభిస్తుంది.

డబ్బు సంపాదించాలనుకునే వారికి అద్భుత అవకాశం.. సెప్టెంబర్ 14న మిస్ అవ్వొద్దు!

ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది పలు అంశాల ప్రాతిపదికన పైనా ఆధారపడి ఉంటుంది. అంటే మీ ఫోన్ ఏ కండీషన్‌లో ఉందనే దానిపై ఆఫర్ విలువ మారుతుంది. అలాగే మీ ఫోన్ ఏ కంపెనీది అన్న విషయం కూడా ఎక్స్చేంజ్ విలువను ప్రభావితం చేస్తుంది. అందువల్ల మీ ఫోన్ విలువ కొన్ని సందర్భాల్లో చాలా తక్కువగా కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు పాత ఫోన్ అలాగే ఉంచుకొని కొత్త ఫోన్ కొనుగోలు చేయడం ఉత్తమం.

బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి అలర్ట్.. ఈ 7 రకాల సర్వీసులకు డబ్బులు చెల్లించాల్సిందే!

ఇకపోతే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో పలు రకాల ఆఫర్లు కూడా ఉన్నాయి. వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్, ఏసీ, స్మార్ట్ టీవీ సహా ఇతరత్రా వాటిపై కూడా డిస్కౌంట్లు సొంతం చేసుకోవచ్చు. గరిష్టంగా 80 శాతం వరకు తగ్గింపు ఉందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంటోంది. అంతేకాకుండా ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు 10 శాతం తక్షణ తగ్గింపు కూడా పొందొచ్చు.

First published:

Tags: Amazon, Amazon Great Indian Festival Sale, Flipkart, Flipkart Big Billion Days, Latest offers

ఉత్తమ కథలు