కొత్త ఫీచర్లతో భీం యాప్ 2.0

జాతీయ చెల్లింపుల సంస్థ భీం యూపీఐ 2.0ని అధికారికంగా ఆవిష్కరించింది. మరిన్ని సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

news18-telugu
Updated: August 17, 2018, 4:28 PM IST
కొత్త ఫీచర్లతో భీం యాప్ 2.0
జాతీయ చెల్లింపుల సంస్థ భీం యూపీఐ 2.0ని అధికారికంగా ఆవిష్కరించింది. మరిన్ని సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
  • Share this:
భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ... భీం యూపీఐ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడీ సర్వీస్‌ కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ అయింది. నోట్ల రద్దు తర్వాత యూపీఐ ఎంతో ప్రాచుర్యం పొందింది. నగదు లావాదేవీలు, నగదు బదిలీలకు ప్రత్యామ్నాయంగా మారింది ఈ సర్వీస్. భారతదేశంలోని అనేక బ్యాంకులు భీం యూపీఐతో టైఅప్ చేసుకున్నాయి.

భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ... భీం యూపీఐ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడీ సర్వీస్‌ కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ అయింది. నోట్ల రద్దు తర్వాత యూపీఐ ఎంతో ప్రాచుర్యం పొందింది.

నగదు లావాదేవీలు, నగదు బదిలీలకు ప్రత్యామ్నాయంగా మారింది ఈ సర్వీస్. భారతదేశంలోని అనేక బ్యాంకులు భీం యూపీఐతో టైఅప్ చేసుకున్నాయి.

భీం యూపీఐ 2.0 కొత్తగా ఏమున్నాయి?
భీం యూపీఐని మరిన్ని ఫీచర్లతో అభివృద్ధి చేసింది జాతీయ చెల్లింపుల సంస్థ. అందులో ప్రధానమైనవి నాలుగు.
1. ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్: కస్టమర్లు తమ ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్‌ని భీంతో అనుసంధానం చేయొచ్చు. ఇంతకుముందు కేవలం ఫిక్స్‌డ్, సేవింగ్స్ అకౌంట్లను మాత్రమే భీంతో అనుసంధానం చేసేందుకు అనుమతిచ్చారు.
2. ఇన్వాయిస్‌ టు ఇన్‌బాక్స్: ఇన్వాయిస్‌ టు ఇన్‌బాక్స్ ఫీచర్‌ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. వ్యాపారికి చెల్లింపులు చేసిన తర్వాత ఇన్‌బాక్స్‌లోకే ఇన్‌వాయిస్ వచ్చే సదుపాయమిది. ప్రస్తుతం వెరిఫై చేసుకున్న వ్యాపారులకు మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుంది.

3. క్యూఆర్ కోడ్: వ్యాపారికి సంబంధించిన విశ్వసనీయ సమాచారాన్ని క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు. వ్యాపారి దగ్గరున్న క్యూఆర్ కోడ్‌ స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు.

4. మ్యాండేట్: వన్ టైమ్ మ్యాండేట్ ఫీచర్ కూడా ఉంది. క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా యూపీఐ ద్వారా వస్తువు డెలివరీ అయ్యాక పేమెంట్ చేయొచ్చు. అయితే ఈ ఫీచర్‌ని ఒకేసారి వాడుకోవచ్చు.

2016 ఏప్రిల్‌లో భీమ్ సర్వీస్ లాంఛైంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ యాప్ ఎన్నో సంచలనాలు సృష్టిస్తోంది. నగదు బదిలీ చేసే ప్రముఖ పద్ధతిగా పేరుతెచ్చుకుంది. ఒక్క జులైలోనే రూ.45,845 కోట్ల విలువగల 23.5 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి.
First published: August 17, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading