ఎయిర్‌టెల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ యాప్.. త్వరలోనే లాంచ్..?

ప్రతీకాత్మక చిత్రం

జూమ్‌కు పోటీగా ఇప్పుడిప్పుడే పలు కంపెనీలు వీడియో కాన్ఫరెన్స్ యాప్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, జియో మీట్ కూడా మార్కెట్లోకి వచ్చాయి.

  • Share this:
    కరోనా కాలంలో వీడియో కాన్ఫరెన్స్ యాప్స్‌కు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఎక్కువ మంది నేరుగా కలవేని పరిస్థితి ఉన్నందున.. ఆన్‌లైన్ ద్వారానే కలుస్తున్నారు. విద్యార్థులు ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారానే పాఠాలు వింటున్నారు. కంపెనీలు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఉద్యోగులతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం జూమ్ యాప్‌ను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. దానికి పోటీగా ఇప్పుడిప్పుడే పలు కంపెనీలు వీడియో కాన్ఫరెన్స్ యాప్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, జియో మీట్ కూడా మార్కెట్లోకి వచ్చాయి.

    తాజాగా ఎయిర్ టెల్ సైతం ఓ వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీస్‌ను తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఎకనమిక్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. 'యూనిఫైడ్ వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్‌తో పాటు పలు ఎంటర్‌ప్రైజ్ గ్రేడ్ ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేసేందుకు ఎయిర్ టెల్ లాంచ్ చేయబోతోంది.' అని ఆ కథనంలో పేర్కొన్నారు. ఐతే దీనిపై ఎయిర్‌టెల్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, ఇటీవలే రిలయన్స్ సంస్థ జియ్ ఫ్లాట్‌ఫామ్స్‌ ద్వారా జియో మీట్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా ఉచితంగా 100 మందితో ఒకేసారి సమావేశం కావచ్చు.
    Published by:Shiva Kumar Addula
    First published: