Home /News /technology /

BHARTI AIRTEL HIKES TARIFF FOR PREPAID RECHARGE PLANS BY 20 TO 25 PER CENT KNOW LATEST PLANS AND BENEFITS SS

Airtel Tariff Hike: ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్... ప్రీపెయిడ్ ప్లాన్ ధరల పెంపు

Airtel Tariff Hike: ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్... ప్రీపెయిడ్ ప్లాన్ ధరల పెంపు
(ప్రతీకాత్మక చిత్రం)

Airtel Tariff Hike: ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్... ప్రీపెయిడ్ ప్లాన్ ధరల పెంపు (ప్రతీకాత్మక చిత్రం)

Airtel Tariff Hike | ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్ ఇచ్చింది కంపెనీ. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల (Prepaid Recharge Plans) ధరల్ని భారీగా పెంచింది. పెరిగిన ధరలు ఈ వారంలోనే అమల్లోకి రానున్నాయి. ఏఏ ప్లాన్లపై ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరల్ని భారీగా పెంచింది ఎయిర్‌టెల్ (Airtel). ప్లాన్ల ధరల్ని 20 నుంచి 25 శాతం వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. 2019 డిసెంబర్‌లో ఓసారి టారిఫ్‌ను పెంచిన ఎయిర్‌టెల్... రెండేళ్ల తర్వాత ఇప్పుడు టారిఫ్ పెంచుతున్నట్టు (Tariff Hike) ప్రకటించింది. పెరిగిన టారిఫ్ నవంబర్ 26 నుంచి అమలులోకి రానుంది. ఆర్థిక ఆరోగ్యపరమైన బిజినెస్ మోడల్ కోసం యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ARPU) పెరగాల్సి ఉందని, అందుకే ప్రీపెయిడ్ ప్లాన్స్ టారిఫ్ పెంచుతున్నామని ఎయిర్‌టెల్ ప్రకటించింది. భారతదేశంలో 5జీ తీసుకచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. మరి ఎయిర్‌టెల్ ఏఏ ప్లాన్లను ఎంతకు పెంచింది? బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి తెలుసుకోండి.

    రూ.79 ప్లాన్‌ను రూ.99 కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 200ఎంబీ డేటా వాడుకోవచ్చు. వాయిస్ టారిఫ్ సెకన్‌కు ఒక పైసా చొప్పున చెల్లించాలి. 50 శాతం ఎక్కువ టాక్‌టైమ్ వస్తుంది.

    Cash Withdrawal: సేవింగ్స్ అకౌంట్లలో లావాదేవీలపై లిమిట్ ఎంత? తెలుసుకోండి

    రూ.149 ప్లాన్‌ను రూ.179కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. 2జీబీ డేటా లభిస్తుంది.

    రూ.219 ప్లాన్‌ను రూ.265కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రోజూ 1జీబీ డేటా లభిస్తుంది.

    రూ.249 ప్లాన్‌ను రూ.299కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రోజూ 1.5జీబీ డేటా లభిస్తుంది.

    రూ.298 ప్లాన్‌ను రూ.359కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా లభిస్తుంది.

    SBI ATM: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్... ఏటీఎం కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేయండి ఇలా

    రూ.399 ప్లాన్‌ను రూ.479కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రోజూ 1.5జీబీ డేటా లభిస్తుంది.

    రూ.449 ప్లాన్‌ను రూ.549కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా లభిస్తుంది.

    రూ.379 ప్లాన్‌ను రూ.455కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. మొత్తం 6జీబీ డేటా లభిస్తుంది.

    రూ.598 ప్లాన్‌ను రూ.719కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రోజూ 1.5జీబీ డేటా లభిస్తుంది.

    Money Transfer: యూపీఐ పనిచేయట్లేదా? వెంటనే మనీ ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా

    రూ.698 ప్లాన్‌ను రూ.839కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా లభిస్తుంది.

    రూ.1498 యాన్యువల్ ప్లాన్‌ను రూ.1799కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. మొత్తం 24జీబీ డేటా లభిస్తుంది.

    రూ.2498 యాన్యువల్ ప్లాన్‌ను రూ.2999కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా లభిస్తుంది.

    రూ.48 డేటా టాప్‌అప్ ప్లాన్‌ను రూ.58కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 3జీబీ డేటా లభిస్తుంది. రూ.98 డేటా టాప్‌అప్ ప్లాన్‌ను రూ.118కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 12జీబీ డేటా లభిస్తుంది. రూ.251 డేటా టాప్‌అప్ ప్లాన్‌ను రూ.301కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 50జీబీ డేటా లభిస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: AIRTEL, Airtel recharge plans

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు