హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Indian OS: భారత్‌ కోసం BharOS పేరుతో స్పెషల్ ఆపరేటింగ్ సిస్టమ్.. ఆండ్రాయిడ్, iOSతో పోటీపడగలదా?

Indian OS: భారత్‌ కోసం BharOS పేరుతో స్పెషల్ ఆపరేటింగ్ సిస్టమ్.. ఆండ్రాయిడ్, iOSతో పోటీపడగలదా?

Indian OS: భారత్‌ కోసం BharOS పేరుతో స్పెషల్ ఆపరేటింగ్ సిస్టమ్.. ఆండ్రాయిడ్, iOSతో పోటీపడగలదా?

Indian OS: భారత్‌ కోసం BharOS పేరుతో స్పెషల్ ఆపరేటింగ్ సిస్టమ్.. ఆండ్రాయిడ్, iOSతో పోటీపడగలదా?

Indian OS: భారత్‌లో గూగుల్ ఎదుర్కొంటున్న లీగల్ సమస్యలను భారోస్(BharOS) సద్వినియోగం చేసుకోవాలని చేస్తోంది. యాప్ స్టోర్ లేకుండానే యాప్‌లను ఉపయోగించుకునే సురక్షితమైన మార్గాన్ని చూపించేందుకు అడుగులు వేస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

భారత్‌ (India)లో గూగుల్ (Google) ఎదుర్కొంటున్న లీగల్ సమస్యలను భారోస్(BharOS) సద్వినియోగం చేసుకోవాలని చేస్తోంది. యాప్ స్టోర్ లేకుండానే యాప్‌లను ఉపయోగించుకునే సురక్షితమైన మార్గాన్ని చూపించేందుకు అడుగులు వేస్తోంది. ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేటెడ్ ఫర్మ్ అభివృద్ధి చేసిన ఈ BharOS మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ద్వారా సెక్యూరిటీ పరంగా ఎన్నో కొత్త ఫీచర్లతో పాటు నచ్చిన యాప్‌ను యూజర్‌ వినియోగించుకునే సౌలభ్యం ఉంటుంది.

* భారోస్‌కు గూగుల్ బాటలు

గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌పైనే ఇప్పుడు ఇండియాలోని 95 శాతం కంటే ఎక్కువ డివైజ్‌లు వర్క్‌ చేస్తున్నాయి. ఇది డి-ఫాక్టో మొబైల్ ఓఎస్‌గా మారింది. అయితే ఇప్పుడు యాంటీట్రస్ట్‌ హియరింగ్‌తో ఇండియాలో గూగుల్ లీగల్ సమస్యలను ఎదుర్కొంటోంది. దీంతో సెక్యూరిటీ పరంగా మరింత ఫ్లెక్సిబుల్‌గా ఉండే ఓఎస్‌ కోసం ప్రజలు ఎదురుచూసే పరిస్థితి తలెత్తింది. దీన్ని BharOS చాకచక్యంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది.

* సెక్యూరిటీ ప్లస్ ఫ్లెక్సిబిలిటీ

సెక్యూరిటీ సెట్టింగ్‌లను యూజర్స్‌ తమకు నచ్చినట్లుగా మార్చుకునే సౌలభ్యాన్ని అందిస్తామని BharOS చెబుతోంది. దీంతో ఫలానా స్టోర్ నుంచి యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటేనే భద్రత ఉంటుందనే వాదనకు చెక్ పడినట్లు అవుతుంది. అంతేగాకుండా, ఇతర డెవలపర్లు లోకల్‌గా డెవలప్‌ చేసిన యాప్‌లను కూడా వినియోగించుకునేందుకు సాధ్యమవుతుంది. ఇది దేశీయంగా ఆపరేట్ అవుతుంది కాబట్టి సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని ఈ OSను రూపొందించిన డెవలపర్లు చెబుతున్నారు.

* పూర్తిగా లోకల్ ప్రొడక్టేనా?

IIT మద్రాస్ ఇంక్యుబేట్ చేసిన JandK ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (JandKops) అనే సంస్థ BharOSను డెవలప్ చేసింది. ఈ మొబైల్ OSచ ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ (AOSP)ను దాని బేస్ లేయర్‌గా ఉపయోగిస్తుంది. అంటే ఇండియాకు చెందిన సంస్థ BharOSలో పనిచేస్తున్నప్పటికీ, ఇది పూర్తిగా దేశంలో తయారైన ప్రొడక్ట్‌గా భావించకూడదు.

ఇది కూడా చదవండి :  ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌.. రూ.25వేల లోపు స్మార్ట్‌ఫోన్లపై ధమాకా ఆఫర్లు!

* BharOS ప్రయోజనాలు

యూజర్లు తమకు నచ్చిన యాప్‌లను సెలెక్ట్ చేసుకునే స్వేచ్ఛ, సౌలభ్యాన్ని భారోస్ అందిస్తోంది. అంటే, యాప్ స్టోర్ (ప్లే స్టోర్ లేదా గెలాక్సీ స్టోర్ వంటివి) లేకుండా ఈ ఓఎస్ వస్తుంది. వివిధ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి యాప్‌లను డౌన్‌లోడ్/సైడ్‌లోడ్ చేసే స్వేచ్ఛ యూజర్లకు ఉంటుంది. బ్యాడ్ డెవలపర్స్ సృష్టించే యాప్‌ల నుంచి భద్రత కోసం సెక్యూరిటీని కూడా పెంచుతుంది. ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఇస్తామని భారోస్ హామీ ఇస్తోంది. మరో ప్రయోజనం ఏంటంటే, ప్రీలోడెడ్‌ యాప్‌లను ఈ ఓఎస్‌ అందించదు.

* మన ఫోన్‌లో భారోస్‌ ఇన్‌స్టాల్‌ చేయగలమా?

ఇది వరకే Android (AOSP) ఉన్న పరికరాల్లో BharOSను ఇన్‌స్టాల్‌ చేయలేరు. Google అనేక సంవత్సరాలుగా హ్యాండ్‌సెట్ పార్ట్నర్‌షిప్‌ రూపంలో తన Play Store ఎకోసిస్టమ్‌ను అందిస్తోంది. ఇండియాలోని మొబైల్ యూజర్లను అట్రాక్ట్‌ చేయాలంటే ఇలాంటి ఎకోసిస్టమ్‌ భారోస్‌కి కూడా అవసరమవుతుంది. అందుకే మరిన్ని పరికరాల్లో BharOS వినియోగాన్ని పొందేందుకు ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రైవేట్ ఇండస్ట్రీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని JandKops నిర్వాహకులు భావిస్తున్నారు.

First published:

Tags: Android, Google, India, Ios, Tech news

ఉత్తమ కథలు