BSNL: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్... మే 19 వరకు ఈ ఫ్రీ ప్లాన్ వేలిడిటీ

BSNL Work@Home plan | కస్టమర్లకు ఉచితంగా బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని అందించేందుకు బీఎస్ఎన్ఎల్ వర్క్ ఎట్ హోమ్ ప్లాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్లాన్ వేలిడిటీని పొడిగించింది బీఎస్ఎన్ఎల్.

news18-telugu
Updated: April 27, 2020, 11:00 AM IST
BSNL: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్... మే 19 వరకు ఈ ఫ్రీ ప్లాన్ వేలిడిటీ
BSNL: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్... మే 19 వరకు ఈ ఫ్రీ ప్లాన్ వేలిడిటీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL వర్క్ ఎట్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకున్నవారికి శుభవార్త. ఈ ప్లాన్ వేలిడిటీని మే 19 వరకు పొడిగించింది. మార్చి 20న Work@Home పేరుతో ప్రమోషనల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రారంభించింది బీఎస్ఎన్ఎల్. ఇది ఉచిత ప్లాన్. యూజర్లు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉన్నందున వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారి కోసం ఈ ప్లాన్ ప్రకటించింది బీఎస్ఎన్ఎల్. మొదట ఈ ప్లాన్ వేలిడిటీ ఒక నెల అని ప్రకటించింది. అంటే ఏప్రిల్ 19న ప్లాన్ ముగుస్తుందని ముందే ప్రకటించింది. ఈప్లాన్‌ను మరో నెల పొడిగించింది బీఎస్ఎన్ఎల్. వర్క్ ఎట్ హోమ్ ప్లాన్ తీసుకున్నవారు మే 19 వరకు ఉపయోగించుకోవచ్చు.

బీఎస్ఎన్ఎల్ వర్క్ ఎట్ హోమ్ ప్లాన్ విశేషాలు చూస్తే ఈ ప్లాన్ తీసుకున్న యూజర్లకు 10 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రోజూ 5 జీబీ డేటా లభిస్తుంది. ఆ తర్వాత స్పీడ్ 1ఎంబీపీఎస్‌కు మారుతుంది. అయితే ఈ ప్లాన్ ఇప్పటికే ఉన్న కస్టమర్లకు మాత్రమే అందిస్తోంది బీఎస్ఎన్ఎల్. కొత్త కస్టమర్లు ఈ ప్లాన్ తీసుకోలేరు. ఇన్‌స్టాలేషన్ ఛార్జీలను కూడా తీసుకోవట్లేదు కంపెనీ. మీ దగ్గర బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ కనెక్షన్ ఉంటే బీఎస్ఎన్ఎల్ వర్క్ ఎట్ హోమ్ ప్లాన్‌కు అప్లై చేయొచ్చు.

ఇక ఇప్పటికే భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను వేలిడిటీని కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా మార్చి 31 నుంచి జూన్ 29 వరకు పొడిగించింది బీఎస్ఎన్ఎల్. భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర రూ.499 మాత్రమే. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకున్నవారికి 20ఎంబీపీఎస్ స్పీడ్‌తో 100జీబీ డేటా లభిస్తుంది. ఆ తర్వాత స్పీడ్ 2ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. 2ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. అంతేకాదు... ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్, ఎస్‌టీడీ కాల్స్ చేసుకోవచ్చు. ఐఎస్‌డీ కాల్స్‌కి నిమిషానికి రూ.1.20 ఛార్జీ చెల్లించాలి.

ఇవి కూడా చదవండి:

Aadhaar: ఆధార్‌పై కొత్త ఆర్డర్స్... మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునేముందు ఈ విషయాలు మర్చిపోవద్దు

మీ అకౌంట్లోకి రూ.1500 రాలేదా? ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి 
First published: April 27, 2020, 10:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading