భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL గుడ్ న్యూస్ చెప్పింది. కొంతకాలం క్రితం బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్లాన్ మార్చి 31న ముగుస్తుందని గతంలోనే ప్రకటించింది బీఎస్ఎన్ఎల్. కానీ కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఈ ప్లాన్‌ను జూన్ 29 వరకు పొడిగించింది. భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర రూ.499 మాత్రమే. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకున్నవారికి 20ఎంబీపీఎస్ స్పీడ్‌తో 100జీబీ డేటా లభిస్తుంది. ఆ తర్వాత స్పీడ్ 2ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. 2ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. అంతేకాదు... ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్లిమిటెడ్ లోకల్ కాల్స్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. ఐఎస్డీ కాల్స్‌కి నిమిషానికి రూ.1.20 ఛార్జీ చెల్లించాలి.
భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ లేదు. ఇతర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌కు రూ.999 విలువైన అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అందిస్తోంది బీఎస్ఎన్ఎల్. ఇక మార్చి 20న Work@Home పేరుతో మరో ప్రమోషనల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రకటించింది. ఇది ఫ్రీ ప్లాన్. డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కరోనావైరస్లాక్ డౌన్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్‌లో 10 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రోజుకు 5 జీబీ డేటా లభిస్తుంది. ఆ తర్వాత స్పీడ్ 1ఎంబీపీఎస్‌కు మారుతుంది.
ఇవి కూడా చదవండి:
JioPOS Lite App: ఈ జియో యాప్‌తో మీరూ డబ్బులు సంపాదించొచ్చు
Prepaid Plans: రోజుకు 3 జీబీ డేటా... జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ప్లాన్స్ ఇవే
Savings Account: ఏ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్‌తో ఎక్కువ లాభం... తెలుసుకోండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BSNL, Business, BUSINESS NEWS, Corona, Corona virus, Coronavirus, Covid-19, Lockdown, Technology, Work From Home