Bharat Ke Veer app: వీరజవాన్ల కుటుంబాలను మీరూ ఆదుకోవచ్చు ఇలా...

దేశం కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన సైనికుల కుటుంబ సభ్యులకు మీ వంతు సాయం చేయొచ్చు. సాయం చేయాలంటే వారి కుటుంబాల దగ్గరకే వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం మీ ఫోన్‌లో ఓ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు. ఆ యాప్ ద్వారా మీరు విరాళం అందించొచ్చు.

news18-telugu
Updated: February 19, 2019, 11:21 AM IST
Bharat Ke Veer app: వీరజవాన్ల కుటుంబాలను మీరూ ఆదుకోవచ్చు ఇలా...
Bharat Ke Veer: సైనిక కుటుంబాల సహాయ నిధికి విరాళాల వెల్లువ... రూ.20 కోట్లు సాయం చేసిన 80,000 మంది
  • Share this:
ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం దేశాన్ని కదిలించింది. కన్నీళ్లు పెట్టించింది. పుల్వామా జిల్లాలో CRPF జవాన్లను తీవ్రవాదులు బలిగొన్న తీరు దేశ ప్రజల్ని కలచివేసింది. వీరజవాన్లకు నివాళులర్పిస్తున్నారు. ఈ దారుణంపై దేశప్రజల రక్తం మరుగుతోంది. ఒకరిద్దరు కాదు... పదుల సంఖ్యలో మన జవాన్లను తీవ్రవాదులు బలితీసుకోవడం పూడ్చలేని లోటే. భారత సైన్యానికే కాదు... ఆ జవానుల కుటుంబాలకు ఇది అతిపెద్ద లోటు. ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆ కుటుంబాలను మీరూ ఆదుకోవచ్చు. దేశం కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన సైనికుల కుటుంబ సభ్యులకు మీ వంతు సాయం చేయొచ్చు. సాయం చేయాలంటే వారి కుటుంబాల దగ్గరకే వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం మీ ఫోన్‌లో ఓ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు. ఆ యాప్ ద్వారా మీరు విరాళం అందించొచ్చు.

Read this: Flipkart Mobiles Bonanza: ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు

Bharat Ke Veer యాప్ ఎందుకు?


Bharat Ke Veer పేరుతో భారత ప్రభుత్వం 2017లో ఓ ట్రస్టు ఏర్పాటు చేసింది. ఆ ట్రస్టుకు వెబ్‌సైట్, మొబైల్ యాప్ ఉన్నాయి. అప్పట్లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సూచన మేరకు ఈ అడుగు పడింది. దేశం నలుమూలలా దేశం కోసం పనిచేస్తూ విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రజలకు కూడా అవకాశం కల్పించే ట్రస్టు ఇది. అంతేకాదు విపత్తుల సమయంలో జవాన్లు ప్రాణాలకు తెగించి ఎలా సాయం చేశారో వివరాలు ఉంటాయి. వీరమరణం పొందిన జవాన్ల వివరాలు ఆ వెబ్‌సైట్‌లో ఉంటాయి. వారి బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కూడా ఉంటాయి.

Read this: Jobs in Amazon: ఆ భాషలు తెలిస్తే అమెజాన్‌లో ఉద్యోగం... రూ.40 వేల జీతం

Pulwama terror attack, terrorist attack, Indian army, Indian jawan, bharat ke veer app, mobile app, Pulwama attack, kashmir attack, srinagar terror attack, millitary convoy attack, Black Day, Cabinet Committee on Security, CRPF, IED, పుల్వామా దాడి, కశ్మీర్ దాడి, మిలటరీ కాన్వాయ్‌పై దాడి, సీఆర్పీఎఫ్, నరేంద్ర మోదీ, భారత్ కే వీర్ యాప్, భారత్ కే వీర్ వెబ్‌సైట్ సైనిక సహాయ నిధి
image: https://bharatkeveer.gov.in

Bharat Ke Veer ద్వారా మీరు ఎలా సాయం చేయొచ్చు?

మీరు నేరుగా వారి అకౌంట్‌లోనే డబ్బులు జమ చేయొచ్చు. మీరు కూడా వీరజవాన్ల కుటుంబాలకు సాయం చేయాలనుకుంటే https://bharatkeveer.gov.in/ వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి. లేదా గూగుల్ ప్లే స్టోర్‌లో Bharat Ke Veer మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో Bravehearts పేజీలో వీర జవాన్ల ఫోటోలు ఉంటాయి. వీరిలో మీరు ఎవరికైనా సాయం చేయొచ్చు. ఫోటోపై క్లిక్ చేస్తే అకౌంట్ వివరాలు కనిపిస్తాయి. మీరు విరాళం ఇవ్వొచ్చు. ఇలా ఒక్కరికి కాకుండా అందరికి కలిపి ఇవ్వాలనుకుంటే Bharat Ke Veer corpus fund పేరుతో ఉన్న సహాయనిధికి మీ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అయితే ఎంత సాయం చేయాలన్నది మీ ఇష్టం. ప్రతీ కుటుంబానికి రూ.15 లక్షల వరకు సాయం అందేలా ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు. రూ.15 లక్షల సాయం అందిన తర్వాత వెబ్‌సైట్‌లోంచి వివరాలు ఆటోమెటిక్‌గా తొలగిపోతాయి. Bharat Ke Veer ట్రస్టుకు మీరు సాయం చేస్తే సెక్షన్ 80జీ కింద ఆదాయపు పన్ను శాఖ నుంచి మినహాయింపు లభిస్తుంది.

Bharat Ke Veer మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
Bharat Ke Veer వెబ్‌సైట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Photos: భారత ప్రభుత్వం ఖజానా నింపుతున్న చారిత్రక కట్టడాలు ఇవే...


ఇవి కూడా చదవండి:

మీ అమ్మాయి పెళ్లికి రూ.1 కోటి... సేవింగ్స్‌లో ఏ స్కీమ్ బెటర్?

IRCTC Discount: టికెట్ బుకింగ్‌లో వృద్ధులకు మినహాయింపు... నిబంధనలు ఇవే
Published by: Santhosh Kumar S
First published: February 19, 2019, 11:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading