బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) గేమ్ భారతదేశం (India)లో బ్యాన్ అయిన విషయం తెలిసిందే. పాపులర్ గేమ్ పబ్జీ మొబైల్(PUBG Mobile)కి ఇండియన్ వెర్షన్‌గా బీజీఎంఐ(BGMI)ని క్రాఫ్టన్ తీసుకొచ్చింది. అయితే ఈ గేమ్ యూజర్ల డేటాను చైనా(China)లోని బీజింగ్‌లో ఉన్న సర్వర్లకు సెండ్ చేస్తోందన్న ఆరోపణల నడుమ భారత్ దీనిని బ్యాన్ చేసింది. దాంతో గూగుల్ (Google), యాపిల్(Apple) తమ యాప్ స్టోర్‌ల నుంచి BGMIను తొలగించాయి. అయితే యాప్ స్టోర్ లిస్ట్ నుంచి మాత్రమే వీటిని తొలగించారు కాబట్టి ఇప్పటికే గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారు గేమ్‌ను అడుగుతున్నారు. కానీ ఒక పెద్ద సమస్య మాత్రం వారిని తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. అదేంటంటే, గేమర్లు రాయల్ పాస్ (Royal Pass) కొనలేకపోతున్నారు. ఫలితంగా స్పెషల్ వెపన్స్, గిఫ్ట్స్ పొందడం అసాధ్యంగా మారింది.
ప్రస్తుతం భారతదేశంలోని గూగుల్ ప్లే, యాపిల్ యాప్ స్టోర్‌లలో యాప్ అందుబాటులో లేదు. ఈ కారణంగానే గేమ్‌లో రాయల్ పాస్‌లను గేమర్లు కొనుగోలు చేయలేకపోతున్నారు. ఈ రాయల్ పాస్‌లను కొనాలంటే.. గేమర్లు యాప్ స్టోర్ ద్వారా అందుబాటులో ఉండే ఇన్-గేమ్ కరెన్సీని ఉపయోగించాలి.
ఇప్పుడు భారతదేశంలో BGMI బ్యాన్ అయినందున.. యాప్ స్టోర్స్ BGMI సంబంధించి ఏ చిన్న ఫంక్షన్‌కు కూడా యాక్సెస్ అందించడం లేదు. దాంతో ప్లేయర్లు ఇన్-గేమ్ కొనుగోళ్లను జరపలేకపోతున్నారు. రాయల్ పాస్‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్న గేమర్లకు ఇప్పుడు “పర్ఛేజ్ ఫెయిల్డ్, ఐటెమ్ నాట్ ఫౌండ్” అనే మెసేజ్ కనిపిస్తోంది. ప్లేయర్లకు ఈ గేమ్ అప్‌డేట్ చేసుకోవడం కూడా కుదరడం లేదు.
క్రాఫ్టన్ తన గేమ్‌కు చైనా సర్వర్లకు ఎలాంటి సంబంధం లేదని బ్యాన్ చేసిన సందర్భంగా నొక్కి చెప్పింది భారతదేశం, సింగపూర్‌లో మాత్రమే BGMI సర్వర్లు ఉన్నట్లు చెప్పుకొచ్చింది. కానీ ఇండియా మాత్రం బ్యాన్ ఇప్పటి వరకు లిఫ్ట్ చేయలేదు. రాయల్ పాస్ కొనుగోళ్లు ఫెయిల్ కావడంపై క్రాఫ్టన్ కంపెనీ ఎలాంటి అఫీషియల్ నోటిఫికేషన్ షేర్ చేయలేదు.
భారత ప్రభుత్వం అధికారిక నిషేధాన్ని ఆదేశించినందున క్రాఫ్టన్ కంపెనీ ఇండియన్ ప్లేయర్లకు ఏ సహాయం అందించ లేక పోతోంది. ఈ బ్యాన్ ఎత్తివేయాలని కోరుతూ క్రాఫ్టన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కొన్ని టెక్ రిపోర్ట్స్ పేర్కొన్నాయి. అయితే బ్యాన్ లిఫ్ట్ చేసే ఆలోచన భారత ప్రభుత్వానికి ఇప్పటి వరకు లేదని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : దోశల్ని ప్రింట్ చేసే ప్రింటర్ వచ్చేసింది... నెటిజన్ల సెటైర్లు
BGMI గేమర్లకు చాలా ఆల్టర్నేటివ్ బ్యాటిల్ రాయల్ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్, అపెక్స్ లెజెండ్స్ మొబైల్, క్రియేటివ్ డిస్ట్రక్షన్ (Creative Destruction), Fortnite వంటి ఇతర బ్యాటిల్ రాయల్ గేమ్‌లు బాగా పాపులర్ అయ్యాయి. నిజానికి న్యూ స్టేట్ మొబైల్ అని పిలిచే మరొక PUBG గేమ్ భారత ప్లేయర్లకు అందుబాటులోనే ఉంది. BGMI గేమర్లందరూ కూడా ఈ గేమ్‌లలో దేనినైనా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లకు Google Play Store, iOS యూజర్లకు Apple స్టోర్ ద్వారా ఈ గేమ్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Battlegrounds Mobile India, China, PUBG, PUBG Mobile India, Tech news