Alert: కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తున్నారా? మోసపోతారు జాగ్రత్త

ప్రముఖ కంపెనీల పేరుతో ఫేక్ కస్టమర్ కేర్ నెంబర్లను సృష్టిస్తున్నారు కేటుగాళ్లు. గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఆ నెంబర్లు కనిపించడంతో... వాటికే కాల్ చేస్తున్నారు కస్టమర్లు.

news18-telugu
Updated: March 14, 2019, 9:37 AM IST
Alert: కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తున్నారా? మోసపోతారు జాగ్రత్త
Alert: కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తున్నారా? మోసపోతారు జాగ్రత్త (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: March 14, 2019, 9:37 AM IST
మీరు గూగుల్‌లో కస్టమర్ కేర్ నెంబర్ వెతికి కాల్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త. మోసపోయే అవకాశం ఉంది. ఢిల్లీలో కొద్ది రోజుల క్రితం ఓ మహిళ ఇలాగే మోసపోయింది. ఆమె పేరు రేణు గుప్తా. ఢిల్లీలోని రోహిణీ సెక్టార్-24లో బొటిక్ నిర్వహిస్తోంది. ఓ ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఓ హ్యాండ్‌బ్యాగ్ ఆర్డర్ చేసింది. పార్శిల్ ఓపెన్ చేసి చూస్తే హ్యాండ్‌బ్యాగ్ ఊహించనంత గొప్పగా ఏమీ లేదు. దీంతో రిటర్న్ చేద్దామని అనుకుంది. ఆమె కూతురు గూగుల్‌లో కస్టమర్ కేర్ నెంబర్ వెతికింది. ఆ నెంబర్‌కు కాల్ చేశారు. అటువైపు నుంచి ఓ వ్యక్తి మాట్లాడాడు. తాను కంపెనీ ప్రతినిధినని నమ్మించాడు. రీఫండ్ ఇస్తామని చెప్పాడు. అందుకోసం అకౌంట్ వివరాలు చెప్పమని అడిగాడు. ఆమెకు ఎలాంటి అనుమానం రాలేదు. అకౌంట్ వివరాలన్నీ చెప్పేసింది. అంతే... క్షణాల్లో రూ.15,000 అకౌంట్ నుంచి మాయమయ్యాయి. ఆమె తన కార్డు బ్లాక్ చేసింది. కానీ... ఆ కేటుగాడు యూపీఐ అకౌంట్‌ ద్వారా మరిన్ని డబ్బులు నొక్కేశాడు. మొత్తం రూ.52,000 అకౌంట్ నుంచి మాయమయ్యాయి. ఈ కేసులో ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు.

Read this: RRB Level 1 Notification: రైల్వేలో 1,03,769 పోస్టులకు మొదలైన రిజిస్ట్రేషన్... ఇలా అప్లై చేయండి

Fake customer care, Fake customer care numbers, Fake call centers, call center cheating, customer care cheating, cyber crime, సైబర్ క్రైమ్, కస్టమర్ కేర్ మోసాలు, కాల్ సెంటర్ మోసాలు, ఫేక్ కస్టమర్ కేర్
(ప్రతీకాత్మక చిత్రం)


ఇదొక్కటే కాదు... ఇలాంటి మోసాలు ఇటీవల ఎక్కువయ్యాయి. ప్రముఖ కంపెనీల పేరుతో ఫేక్ కస్టమర్ కేర్ నెంబర్లను సృష్టిస్తున్నారు కేటుగాళ్లు. గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఆ నెంబర్లు కనిపించడంతో... వాటికే కాల్ చేస్తున్నారు కస్టమర్లు. కంపెనీకి చెందిన టోల్ ఫ్రీ నెంబర్ అనుకొని అకౌంట్ వివరాలన్నీ చెప్పేస్తున్నారు. ప్రొడక్ట్ రీఫండ్ కోసం ప్రయత్నించే కస్టమర్లే ఇలాంటి మోసాలబారిన పడుతున్నారు. సైబర్ నేరాల్లో ఆరితేరిన జార్ఖండ్‌కు చెందిన ముఠాలే ఈ మోసాలు చేస్తున్నట్టు తేలింది. మీరు కూడా ఏదైనా కస్టమర్ కేర్‌కు కాల్ చేయాలంటే గూగుల్‌లో వెతకకుండా... ఆ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న ఫోన్ నెంబర్‌కు కాల్ చేయండి. గూగుల్‌లో కనిపించే టోల్ ఫ్రీ నెంబర్లన్నీ ఒరిజినల్ కాకపోవచ్చు. అందుకే వాటిని గుడ్డిగా నమ్మారంటే ఇలాగే మోసపోవాల్సి వస్తుంది.



Photos: ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ఫాలోయర్స్ ఉన్న మహిళ ఏరియానా గ్రాండే

ఇవి కూడా చదవండి:
Loading...
GB WhatsApp: మీ జీబీ వాట్సప్ బ్లాక్ అయిందా? ఇలా చేయండి

Facebook: మీ ఫేస్‌బుక్ ఎక్కడెక్కడ లాగిన్ చేశారో తెలుసా? హ్యాక్ అయితే ఇలా చేయండి

Election 2019: ఓటరు జాబితాలో మీ పేరు లేదా? దరఖాస్తుకు 3 రోజులే గడువు... ఇలా అప్లై చేయండి
First published: March 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...