Google Ads: ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. స్మార్ట్ఫోన్లు (Smart Phones), తక్కువ డేటా రేట్లతో అందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తోంది. ఈ క్రమంలో ఆయా కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు ఆన్లైన్ యాడ్స్‌పై ఆధారపడుతున్నాయి. ఇంటర్నెట్ వినియోగిస్తున్న వాళ్లు ఏదైనా వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసినప్పుడు కచ్చితంగా గూగుల్ యాడ్స్ (Google) చూసే ఉంటారు. వినియోగదారుల వెబ్ యాక్టివిటీస్(Web Activities) ఆధారంగా ఈ గూగుల్ యాడ్స్(Google Ads) కనిపిస్తుంటాయి. ఏదైనా ప్రొడక్ట్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు.. ఆ వస్తువుకు సంబంధించిన యాడ్స్ కనిపించేలా గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. ఆ యాడ్స్‌పై వినియోగదారులు క్లిక్ చేసినప్పుడు ఆ వస్తువును విక్రయిస్తున్న షాపింగ్ వెబ్సైట్ లేదా ప్రొడక్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. అయితే గూగుల్ యాడ్స్‌లా కనిపించే హానికరమైన యాడ్స్ కూడా ఉన్నాయని, వాటిపై క్లిక్ చేస్తే హ్యాకింగ్ బారిన పడే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ హెచ్చరిస్తోంది.
* మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ అలెర్ట్
దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్ ఓ కొత్త సెక్యూరిటీ అలెర్ట్‌ను విడుదల చేసింది. హ్యాకర్లు నకిలీ వెబ్సైట్ల ద్వారా గూగుల్ యాడ్స్ ముసుగులో మాల్వేర్(Malware), ర్యాన్సమ్‌వేర్లతో దాడులు చేస్తున్నట్లు పేర్కొంది. Royal(DEV-0569)గా పేర్కొనే ర్యాన్సమ్వేర్(Ransomware).. మైక్రోసాఫ్ట్ టీమ్స్(Microsoft Teams), జూమ్(Zoom), టీమ్ వ్యూవర్(Teamviewer) వంటి ప్రముఖ అప్లికేషన్ల ఇన్స్టాలెర్స్, అప్డేట్స్లా కనిపించే యాడ్స్ ద్వారా ప్రవేశిస్తోందని పేర్కొంది. ఒకవేళ మైక్రోసాఫ్ట్ సిస్టమ్‌లో మాల్వేర్ డౌన్లోడ్ అయితే.. యాంటీ-వైరస్ యాప్‌ల వంటి భద్రతా వ్యవస్థలను డిసేబుల్ చేసే శక్తి దానికి ఉందని, ఇది తదుపరి దాడులకు దారితీసే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. మాల్వేర్ను డిటెక్ట్ చేసి తొలగించే వరకు ముప్పు తప్పదని వివరించింది.
* మైక్రోసాఫ్ట్ డిఫెండర్ సెక్యూరిటీ అప్డేట్
అదే విధంగా దాడి చేసే వ్యక్తికి సిస్టమ్ రైట్స్ హక్కులను పొందే అవకాశం ఉంటుందని, ఇది సిస్టమ్, కంప్యూటర్లో స్టోర్ అయిన డేటాకు పూర్తి యాక్సెస్‌ను అందిస్తుందని తెలిపింది. ఈ విషయాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సెక్యూరిటీ థ్రెట్ పోస్ట్‌లో Microsoft తెలిపింది. అదృష్టవశాత్తూ మైక్రోసాఫ్ట్ నుంచి ఈ సెక్యూరిటీ అలెర్ట్ వచ్చింది. కంపెనీ ఇప్పటికే సమస్యను గమనించింది. Windows డివైజ్‌లలో ఇటువంటి మాల్వేర్, ర్యాన్సమ్వేర్తో పోరాడడంలో సహాయపడటానికి దాని మైక్రోసాఫ్ట్ డిఫెండర్ సెక్యూరిటీ సొల్యూషన్ని అప్డేట్ చేసింది. కంపెనీకి తన మైక్రోసాఫ్ట్ 365 సూట్‌ను అటువంటి బెదిరింపుల గురించి వినియోగదారులను అప్రమత్తం చేయగల సామర్థ్యం ఉంది. వాటిని సిస్టమ్ నుంచి కూడా తొలగించగలదు. మైక్రోసాఫ్ట్ తన ఎడ్జ్ బ్రౌజర్ ద్వారా సెక్యూరిటీ సపోర్ట్‌ను అందించింది. వినియోగదారులు అలాంటి దాడులతో పోరాడటానికి 'నెట్వర్క్ ప్రొటెక్షన్' ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలని సూచించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.