దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. వైరస్ వ్యాప్తి అందరినీ భయపెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి ఎంతో మందిని బలిగొంది. దీంతోపాటు వైరస్ వస్తుందేమోనన్న ఆందోళన చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో రక్తంలో ఆక్సిజన్ శాతం తెలుసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరిగా మారింది. దీంతో చాలా మంది ఆక్సిమీటర్లను కొనుగోలు చేస్తున్నారు. ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకుంటూ జాగ్రత్తలు పడుతున్నారు. అయితే ఇటీవల ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ఆక్సిమీటర్ యాప్స్ వచ్చేశాయి. ఒకటికాదు రెండు కాదు.. ఇలాంటి ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే అన్ని యాప్స్ నిజమైనవి కావు. అన్ని ఫోన్లలో ఆక్సిమీటర్ పని చేయదు. కొన్ని ఫేక్ యాప్స్ అయితే ఫోన్లోని డేటాను చోరీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్సిమీటర్ యాప్ వాడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూడండి..
అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ఎస్పీఓ2 మానిటర్ యాప్స్ పని చేయవు. అందుకోసం హార్డ్‌వేర్ పరంగా ప్రత్యేక సెన్సార్ ఉండాలి. అందుకే ఆక్సిమీటర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నంత మాత్రాన, అవి ఆక్సిజన్ స్థాయిలను గుర్తించలేవని తెలుసుకోవాలి. శామ్సంగ్ గెలాక్సీ 9తో పాటు మరికొన్ని ఫ్లాగ్షిప్ ఫోన్లలోనే ఈ ఎస్పీఓ2 సపోర్ట్ ఉంటుంది. అందుకే ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో సెన్సార్ ఉందో లేదో చెక్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ సపోర్ట్ చేసినా మొత్తంగా ఫోన్లో చూపించే ఆక్సిజన్ లెవెల్స్ పైనే ఆధాపడకూడదు. ఇవి చూపించే లెక్కలను వైద్యం కోసం పరిగణించకూడదు. కేవలం వ్యక్తిగతంగా, ఆక్సిజన్ స్థాయి, శాతం చూసుకునేందుకు ఈ యాప్స్ ఉపయోగపడతాయి.
Realme 5G Phone: రియల్మీ మరో సంచలనం... రూ.7,000 ధరకే 5జీ ఫోన్
Realme Anniversary Sale: రియల్మీ సేల్‌లో ఈ 28 స్మార్ట్ఫోన్లపై ఆఫర్స్
ఆక్సిమీటర్ అంటూ ఇటీవలి కాలంలో ప్లేస్టోర్‌లో చాలా యాప్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ నిజమైనవి కావు. ఫేక్యాప్స్ కూడా ఉన్నాయి. ఇలాంటివి డౌన్లోడ్ చేసుకుంటే ఫోన్ డేటాకు ప్రమాదంలో పడినట్లే. అందుకే ఎంతో జాగ్రత్తగా యాప్‌ను ఎంచుకోవాలి.
ఎస్ఎంఎస్లు, ఈమెయిల్, వాట్సాప్ మెసెజ్‌ల ద్వారా వచ్చిన లింక్‌లతో ఆక్సిమీటర్ యాప్‌ను అసలు డౌన్లోడ్ చేసుకోకూడదు. ఇలాంటివి ఎక్కువ శాతం ఫేక్, మాల్వేర్తో కూడిన యాప్స్ ఉంటాయి. వీటిద్వారా ఫోన్ డేటాకు ప్రమాదం ఏర్పడుతుంది.
WhatsApp: వాట్సప్ నుంచి మూడు కొత్త ఫీచర్స్... ప్రకటించిన జుకర్‌బర్గ్
Card Transactions: ఆన్లైన్ షాపింగ్‌కు మీ కార్డు పనిచేయట్లేదా? అకౌంట్లో ఈ సెట్టింగ్స్ మార్చండి
ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇన్స్టాలేషన్ ఫ్రమ్ అన్నౌన్ సోర్స్ ఆప్షన్‌ను డిసేబుల్ చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్ నుంచే యాప్స్ గురించి పూర్తిగా తెలుసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. థర్డ్‌పార్టీ ప్లాట్‌ఫామ్‌లను నమ్మకపోవడమే మంచిది.
ఇన్స్టాల్ చేసుకున్నాక ఆక్సిమీటర్ ఎలాంటి పర్మిషన్లను అడుగుతుందో జాగ్రత్తగా గమనించాలి. కాంటాక్ట్‌లు, ఎస్ఎంఎస్ కోసం అనుమతి అడిగితే అనుమానించాలి. ఈ పర్మిషన్లు అడిగితే ఎక్కువ శాతం అది ఫేక్ యాప్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆక్సిమీటర్‌కు కాంటాక్ట్‌లు, ఎస్ఎంఎస్లతో సంబంధం ఉండదు. అలాగే ఫేక్యాప్స్ నుంచి ఫోన్‌ను కాపాడుకునేందుకు పెయిడ్ యాంటీ వైరస్ సర్వీస్‌ను కూడా వాడవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకునే ముందు వాటి రివ్యూలు, రేటింగ్ పరిశీలించాలి. నెగిటివ్ రివ్యూలు ఉన్న వాటిని డౌన్లోడ్ చేసుకోకుండా జాగ్రత్త పడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid-19, FAKE APPS, Mobile App, Playstore