Home /News /technology /

BEWARE OF FAKE ONLINE SHOPPING SITES CYBER CRIME POLICE ANNOUNCE LIST OF THOSE FAKE SITES EVK

Cyber Crime: జాగ్ర‌త్త‌.. ఈ వెబ్‌సైట్‌ల‌లో షాపింగ్ చేస్తే మీ ఖాతా ఖాళీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రోజు రోజుకి సైబ‌ర్ నేర‌గాళ్లు కొత్త మార్గాలు ఎంచుకొంటున్నారు. ఆన్‌లైన్‌లో మ‌నం జాగ్ర‌త్త‌గా లేకుంటే క్ష‌ణంలో మన బ్యాంక్ ఖాతా(Bank Account) ఖాళీ అయిపోవ‌డం ఖాయం. ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారు కాస్తా జాగ్ర‌త్త‌గా ఎందులో షాపింగ్(Shopping) చేయాలో తెలుసుకొని చేస్తే త‌మ డ‌బ్బులు సుర‌క్షితంగా ఉంటాయ‌ని సైబర్ పోలీసులు చెబుతున్నారు. పోలీసులు పలు ఫేక్ వెబ్‌సైట్(Fake Websites) ల లిస్టును ప్రకటించారు.

ఇంకా చదవండి ...
    రోజు రోజుకి సైబ‌ర్ నేర‌గాళ్లు కొత్త మార్గాలు ఎంచుకొంటున్నారు. ఆన్‌లైన్‌లో మ‌నం జాగ్ర‌త్త‌గా లేకుంటే క్ష‌ణంలో మన బ్యాంక్ ఖాతా(Bank Account) ఖాళీ అయిపోవ‌డం ఖాయం. ఆన్‌లైన్ షాపింగ్(Online Shopping) చేసేవారు కాస్తా జాగ్ర‌త్త‌గా ఎందులో షాపింగ్(Shoping) చేయాలో తెల‌సుకొని చేస్తే త‌మ డ‌బ్బులు సుర‌క్షితంగా ఉంటాయ‌ని సైబ‌ర్ పోలీసులు చెబుతున్నారు. ఆ వెబ్‌సైట్‌లు ఎంటో తెలుసుకోండి. అమెజాన్‌93.కామ్‌, ఈబే19.కామ్‌, లక్కీబాల్‌, ఈజెడ్‌ ప్లాన్‌, డేబెట్‌, సన్‌ఫ్యాక్టరీ, ఈటీసీ వీటిల్లో షాపింగ్ చేయ‌కండ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

    Android Smartphone: ఫోన్‌లో ఖ‌చ్చితంగా ఉండాల్సిన సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే..


    అత్యాశే.. ఆస‌రాగా
    చాలా మంది వినియోగ‌దారులు ఏదైనా ఎల‌క్ట్రానిక్ గాడ్జెట్‌(Electronic Gadgets) గాని వేరే ఏదైన వ‌స్తువు త‌క్కువ ధ‌ర‌కు క‌నిపించ‌గానే ముందు వెనుక ఆలోచించ‌కుండా కొనేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఏదైనా వ‌స్తువు త‌క్కువ ధ‌ర‌కు ల‌భించిన‌ప్పుడు చూడాల్సింది ఆ వెబ్‌సైట్ నకిలీదా(Fake).. స‌రైందా ప‌రిశీలించుకోవాలి. ఇటీవ ఓ మ‌హిళ కుక్క‌పిల్ల కోసం ఆన్‌లైన్‌లో రూ.66 ల‌క్ష‌లు పోగొట్టుకొంది. అంతే కాకుండా కొన్ని చోట్ల రూ.25,000 విలువైన వ‌స్తువులు రూ.3,000 కే అభిస్తుందంటూ ప‌లు సామాజిక మాధ్య‌మాల్లో(Social media) ప్ర‌క‌ట‌న‌లు ఇస్తారు. వారిని నమ్మి మీ కార్డుల‌ను వినియోగిస్తే మీ ఎకౌంట్‌లో డ‌బ్బులు మాయం అవ్వ‌డం ఖాయం..
    ఇటీవ‌ల ఇలాంటి కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌(Facebook), వాట్స‌ప్‌(Whatsapp)లో వ‌చ్చే ప్ర‌క‌ట‌న‌లు నమ్మి మోస‌పోయేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈన ఏప‌థ్యంలో సైబ‌ర్‌క్రైం(Cyber Crime) పోలీసులు వినియోగ‌దారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. సైబ‌ర్ నేర‌గాళ్ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలిని, గుడ్డిగా న‌మ్మ‌కుండా ఉండాలంటున్నారు. ప‌లు ఫేక్ వెబ్‌సైట్‌ల(Fake Websites) పేర్ల‌ను విడుద‌ల చేశారు. అందులో అమెజాన్‌93.కామ్‌, ఈబే19.కామ్‌, లక్కీబాల్‌, ఈజెడ్‌ ప్లాన్‌, డేబెట్‌, సన్‌ఫ్యాక్టరీ, ఈటీసీ వెబ్‌సైట్‌లు ఉన్నాయి. అత్యాశాతో సైబ‌ర్ నేర‌గాళ్ల వ‌ల‌లో చిక్కుకోవ‌ద్ద‌ని సూచిస్తున్నారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: CYBER CRIME

    తదుపరి వార్తలు