Alert: రూపాయికే స్పీకర్... రూ.19 ధరకే స్మార్ట్‌ఫోన్... ఫ్లిప్‌కార్ట్ పేరుతో నకిలీ వెబ్‌సైట్

ఆ నకిలీ సైట్‌లో ఆఫర్లు చూస్తే దిమ్మదిరిగిపోతుంది. నమ్మలేని ఆఫర్లు ఊరిస్తుంటాయి. ఈ ఆఫర్లు నిజమని నమ్మి మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే అడ్డంగా బుక్కైపోతారు జాగ్రత్త.

news18-telugu
Updated: October 1, 2019, 6:28 PM IST
Alert: రూపాయికే స్పీకర్... రూ.19 ధరకే స్మార్ట్‌ఫోన్... ఫ్లిప్‌కార్ట్ పేరుతో నకిలీ వెబ్‌సైట్
Alert: రూపాయికే స్పీకర్... రూ.19 ధరకే స్మార్ట్‌ఫోన్... ఫ్లిప్‌కార్ట్ పేరుతో నకిలీ వెబ్‌సైట్ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 1, 2019, 6:28 PM IST
ఒక్క రూపాయికే స్పీకర్. సోనీ హెడ్‌ఫోన్ ధర రూ.9. ఒప్పో స్మార్ట్‌ఫోన్ ధర రూ.19. సాంసంగ్ మొబైల్ ధర రూ.29. ఈ ధరలు చూసి షాకయ్యారా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆఫర్లు ఇవీ అంటూ వాట్సప్‌లో ఓ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది. అందులో ధరలు చూసి అంతా షాకవుతున్నారు. రూ.19 ధరకే స్మార్ట్‌ఫోన్ అమ్ముతున్నారా అని అవాక్కవుతున్నారు. అసలు విషయం తెలిస్తే మీరు షాకవ్వాల్సిందే. అవి నిజమైన ఆఫర్లు కాదు. మిమ్మల్ని బుట్టలో వేసుకోవడానికి కేటుగాళ్లు సృష్టించిన మెసేజ్ అది. అందులో ఉన్న లింక్స్ క్లిక్ చేస్తే ఫ్లిప్‌కార్ట్ పోలినట్టుగా ఉన్న నకిలీ వెబ్‌సైట్‌ ఓపెన్ అవుతుంది. అందులో పేజ్ డిజైన్, ఫోటోలు అన్నీ ఫ్లిప్‌కార్ట్‌ అసలు వెబ్‌సైట్‌ను పోలినట్టుగానే ఉంటాయి. కాబట్టి యూజర్లు సులువుగా మోసపోయే అవకాశముంది. ఇక ఆ నకిలీ సైట్‌లో ఆఫర్లు చూస్తే దిమ్మదిరిగిపోతుంది. నమ్మలేని ఆఫర్లు ఊరిస్తుంటాయి. ఈ ఆఫర్లు నిజమని నమ్మి మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే అడ్డంగా బుక్కైపోతారు జాగ్రత్త.

Amazon Great Indian Festival Sale, Flipkart Big billion days sale, Fake Flipkart website, Fake amazon website, online offers, online shopping, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, ఫేక్ ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్, ఫేక్ అమెజాన్ వెబ్‌సైట్, ఆన్‌లైన్ ఆఫర్స్, ఆన్‌లైన్ షాపింగ్
ఫ్లిప్‌కార్ట్ పేరుతో నకిలీ వెబ్‌సైట్


ఫ్లిప్‌కార్ట్ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌లో ఏదైనా ఆర్డర్ చేస్తే మీ లాగిన్ డీటైల్స్ ఏవీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీ అడ్రస్ మాత్రమే అడుగుతుంది. మీరు అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఈ లింక్ 10 మందికి షేర్ చేయాలన్న మెసేజ్ కనిపిస్తుంది. మీరు మెసేజ్ షేర్ చేసిన తర్వాత ఆర్డర్ ప్లేస్ అవుతుందనుకుంటే పొరపాటే. అక్కడితో ప్రాసెస్ క్లోజ్ అవుతుంది. మళ్లీ మొదటి నుంచి ఆర్డర్ చేయాలి. ఇలా మీరు ఎన్నిసార్లు చేసినా ఆర్డర్ ప్లేస్ కాదు. దాంతో ఇది నకిలీ వెబ్‌సైట్ అని అర్థమవుతుంది. వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ పెంచుకోవడానికి, క్లిక్స్ సంపాదించడానికి కొందరు మోసగాళ్లు రూపొందించిన వెబ్‌సైట్ ఇది. ఈ మెసేజ్ నమ్మారంటే మీరు టైమ్ వేస్ట్ చేసుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు.

Amazon Great Indian Festival Sale, Flipkart Big billion days sale, Fake Flipkart website, Fake amazon website, online offers, online shopping, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, ఫేక్ ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్, ఫేక్ అమెజాన్ వెబ్‌సైట్, ఆన్‌లైన్ ఆఫర్స్, ఆన్‌లైన్ షాపింగ్
వాట్సప్‌లో వైరల్ అయిన మెసేజ్




ఇలాంటి మెసేజ్‌లు వస్తే మరి మీరేం చేయాలి? ఏం చేయొద్దు. డిలిట్ చేయడమే మంచిది. ఇలాంటి ఆఫర్లు మీరు నమ్మి, ఫార్వర్డ్ చేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు షేర్ చేశారంటే వాళ్లు కూడా మోసపోవాల్సి వస్తుంది. ఆఫర్ల పేరుతో ఇలాంటి మెసేజ్‌లు ఏవైనా వస్తే అవాక్కవకుండా నిజమేనా అని ఓసారి ఆరా తీయాలి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఏ ఆఫర్ ఉన్నా అఫీషియల్ వెబ్‌సైట్‌లో వివరాలుంటాయి.

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి

Loading...
ఇవి కూడా చదవండి:

Best TVs: ఆన్‌లైన్‌లో టీవీ కొంటున్నారా? ఫెస్టివల్ సేల్‌లో 12 బెస్ట్ టీవీలు ఇవే...

Dussehra Sale: మీకు సెల్ఫీలు ఇష్టమా? దసరా సేల్‌లో ఈ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్స్

Smartphone offer: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.10,000 లోపు బెస్ట్ 20 స్మార్ట్‌ఫోన్లు ఇవే...
First published: October 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...