Smartphones: రూ. 20 వేల లోపు బెస్ట్​ బ్యాటరీ బ్యాకప్​ గల స్మార్ట్​ఫోన్ల కోసం చూస్తున్నారా ?

(image: Redmi India)

ఎంత ఖరీదైన స్మార్ట్​ఫోన్​ కొన్నా సరే.. దాని ఫీచర్లను ఆస్వాదించాలంటే బ్యాటరీ బ్యాకప్​ చాలా కీలకం. అందుకే కేవలం బ్యాటరీ బ్యాకప్​ను ?

  • Share this:
స్మార్ట్‌ఫోన్లు మన నిత్య జీవితంలో భాగమైపోయాయి. ఎంతలా అంటే ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు స్మార్ట్​ఫోన్​లో​నే సహవాసం చేస్తుంటాం. ఇది నిత్యావసర వస్తువులా మారిపోయింది. అయితే ఎంత ఖరీదైన స్మార్ట్​ఫోన్​ కొన్నా సరే.. దాని ఫీచర్లను ఆస్వాదించాలంటే బ్యాటరీ బ్యాకప్​ చాలా కీలకం. అందుకే కేవలం బ్యాటరీ బ్యాకప్​ను చూసి ఫోన్లను కొనే వారి సంఖ్య ఇటీవల పెరిగింది. మరోవైపు భారత మార్కెట్​లో రూ .20,000లోపు వచ్చే మిడ్​రేంజ్ స్మార్ట్​ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో 5,000mAh బ్యాటరీతో రూ. 20 వేలలోపు లభిస్తున్న టాప్​ 5 స్మార్ట్‌ఫోన్లను పరిశీలిద్దాం.

రియల్​మీ 8 5జీ (సుమారు రూ. 14,499)

మీరు రూ. 15 వేలలోపు బెస్ట్​ బ్యాటరీ బ్యాకప్​ గల 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా?.. అయితే, మీకు రియల్​మీ 8 5జీ బెస్ట్​ ఆప్షన్​ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్-హెచ్‌డి ప్లస్​ డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్​ను అందించారు. దీని వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 18W క్విక్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 5,000mAh బ్యాటరీని అందించారు. కేవలం 5 శాతం ఛార్జ్‌తో ఫోన్ 34.2 గంటల స్టాండ్‌బై సమయాన్ని అందించగలదని కంపెనీ తెలిపింది. సూపర్ పవర్ సేవింగ్ మోడ్ ద్వారా ఇది వీలవుతుందని పేర్కొంది.

రెడ్‌మీ నోట్ 10 టి 5జి (సుమారు రూ. 13,999)

రెడ్‌మి నోట్ 10 టి 5 జి డివైజ్ 6.5 అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్​ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను రెడ్‌మీ అందించింది. ఇందులో 18W ఛార్జింగ్ సపోర్ట్​ గల 5,000mAh బ్యాటరీ ఉంటుంది. సాధారణ వినియోగంతో రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్​ను ఆస్వాదించవచ్చని కంపెనీ పేర్కొంది.

మోటో జీ60 (సుమారు రూ .17,999)

రూ. 20 వేలలోపు బెస్ట్​ బ్యాటరీ బ్యాకప్​ గల ఫోన్లలో మోటో జీ 60 కూడా ఒకటి. ఇది 6.8 అంగుళాల ఫుల్-హెచ్‌డి+ ఐపిఎస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732G SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీని వెనుక భాగంలో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించింది. మోటో జీ 60లో టర్బో పవర్ 20 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో వస్తుంది. దీన్ని ఒక్కసారి ఫుల్​ ఛార్జ్​ చేస్తే సాధారణ వినియోగంలో 54 గంటల పాటు పనిచేస్తుంది.

పోకో ఎం 3 ప్రో 5 జి  (సుమారు రూ. 13,999)

పోకో ఎం 3 ప్రో 5 జి స్మార్ట్‌ఫోన్‌ 6.53 అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో 6GB RAM, 48 -మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించింది. ఇది డైమెన్సిటీ 700 SoCతో పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే.. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందించింది. ఒక్కసారి ఫుల్​ ఛార్జ్​ చేస్తే సాధారణ వినియోగంలో 12 గంటల పాటు పని చేయగలదు.

శామ్సంగ్​ గెలాక్సీ ఎం32 5జీ (రూ. 20,999)

రూ. 20 వేల ధరలో అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్​ గల ఫోన్లలో శామ్సంగ్​ గెలాక్సీ ఎం32 5జీ బెస్ట్​ ఆప్షన్​ అని చెప్పవచ్చు. ఈ ఫోన్​ 6.5 అంగుళాల హెచ్​డీ+ TFT ఇన్ఫినిటీ- V డిస్‌ప్లేతో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 SoC ప్రాసెసర్​తో పని చేస్తుంది. దీని క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరాను అందించింది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. 15W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీని చేర్చింది. దీన్ని ఒక్కసారి ఫుల్​ ఛార్జ్​ చేస్తే 19 గంటల కాలింగ్ టైమ్, 20 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.
Published by:Krishna Adithya
First published: