హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smartphones: రూ.30 వేలలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నారా..? ఈ రేంజ్‌లో మార్కెట్‌లో ఉన్న టాప్ మోడల్స్ ఇవే..

Smartphones: రూ.30 వేలలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నారా..? ఈ రేంజ్‌లో మార్కెట్‌లో ఉన్న టాప్ మోడల్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మీరు రూ.30వేలలో బెస్ట్ ఫోన్ కోసం చూస్తుంటే, ఈ మోడళ్లను పరిశీలించండి.

ఇండియాలో(India) స్మార్ట్‌ఫోన్ల(Smartphones) ధరలు పెరుగుతున్నాయి. 5G డివైజ్‌ల(Devise) ప్రవేశం, ఖరీదైన హార్డ్‌వేర్(Hardware), ఇన్‌పుట్(Input) కాస్ట్ కారణంగా స్మార్ట్‌ఫోన్(Smartphone) తయారీ సంస్థలు తమ ప్రొడక్ట్స్ ధరలను(Product Cost) పెంచాయి. ఇప్పుడు మంచి క్వాలిటీ ఫోన్‌(Quality Phone) కోసం రూ.15,000 కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ మీ బడ్జెట్(Budget) రూ. 30,000కి దగ్గరగా ఉంటే.. మీకు మరిన్ని ఆప్షన్స్(Options) ఉన్నాయి. మీరు రూ.30వేలలో బెస్ట్ ఫోన్(Best Phone) కోసం చూస్తుంటే, ఈ మోడళ్లను పరిశీలించండి.

Samsung Galaxy M53 5G

ఈ లేటెస్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 120Hz FHD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. 108-మెగాపిక్సెల్, 8-మెగాపిక్సెల్, 2-మెగాపిక్సెల్, 2-మెగాపిక్సెల్ సెన్సార్ల క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను దీంట్లో ఉంది. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీతో వస్తుంది. అయితే అడాప్టర్‌ను విడిగా కొనుగోలు చేయాలి.

Xiaomi 11i హైపర్‌ఛార్జ్ 5G

ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 SoC ద్వారా పనిచేస్తుంది. ఈ ఫోన్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని ఇన్‌బిల్ట్ 4500mAh బ్యాటరీ 20 నిమిషాలలోపు ఫుల్ ఛార్జ్ అవుతుంది.

Business Idea: ఇంటి నుంచే చేసే బిజినెస్.. నెలకు కనీసం రూ. 20 వేల ఆదాయం.. తెలుసుకోండి

OnePlus Nord 2

ఈ డివైజ్ 90Hz AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 1200 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. గరిష్టంగా 12GB వరకు RAM ఉంటుంది. నార్డ్ 2 ఫోన్.. OIS సపోర్టెడ్ 50-మెగాపిక్సెల్ సెన్సార్‌తో, ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది 65W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీతో రన్ అవుతుంది.

Poco F3 GT

రూ.30వేలలో లభిస్తున్న బెస్ట్ గేమింగ్ ఫోన్ ఇది. పోకో F3 GT ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే వంటివి దీని స్పెషల్ ఫీచర్లు. 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5,065mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్‌ సపోర్ట్, ఇతర ఫీచర్లతో డివైజ్ లభిస్తుంది.

మోటరోలా ఎడ్జ్ 20

ఎడ్జ్ 20 స్మార్ట్‌ఫోన్‌ 6.7-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ దీనికి రక్షణ ఇస్తుంది. ఇది 8GB RAM, 128GB స్టోరేజ్‌తో వచ్చే స్నాప్‌డ్రాగన్ 778G చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఈ డివైజ్‌ 4,000mAh బ్యాటరీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 12 బేస్ట్ UIతో ఎడ్జ్ 20 ఫోన్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

First published:

Tags: 5g mobile, 5g technology, New smartphone, Technology

ఉత్తమ కథలు