జనవరిలో రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే...

జనవరిలో రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లల్లో మీకు కావాల్సిన ఫోన్ ఎంచుకోండి. స్టైల్, పవర్, బ్యాటరీ బ్యాకప్, కెమెరా, ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ లాంటి అంశాలన్నీ చూసుకొని ఫోన్ సెలెక్ట్ చేసుకోండి.

news18-telugu
Updated: January 7, 2019, 5:11 PM IST
జనవరిలో రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే...
జనవరిలో రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే...
  • Share this:
మీరు కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.10,000 లోపేనా? మీ బడ్జెట్‌కు తగ్గ ఫోన్ సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారా? ఈ బడ్జెట్‌తో ఎంట్రీ లెవెల్ ఫోన్లు కాదు ఏకంగా మిడ్ రేంజ్ ఫోన్లే కొనొచ్చు. మరి రూ.10,000 బడ్జెట్‌లో ఏఏ స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయో తెలుసుకోండి.

జనవరిలో రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే... | BEST SMARTPHONES UNDER RS 10,000 TO BUY IN INDIA: JANUARY 2019 EDITION
ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2


1. ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2
ఏసుస్‌లో జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం సిరీస్ బాగా క్లిక్ అయింది. ఇటీవల ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2 రిలీజైంది. 3జీబీ+32జీబీ ధర రూ.9,999. డిస్‌ప్లే: 6.26 అంగుళాల హెచ్‌డీ+, ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 632, రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్, బ్యాటరీ: 4000 ఎంఏహెచ్, ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ ఓరియో లాంటి ప్రత్యేకతలున్నాయి.

జనవరిలో రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే... | BEST SMARTPHONES UNDER RS 10,000 TO BUY IN INDIA: JANUARY 2019 EDITION
ఏసుస్ జెన్‌పోన్ మ్యాక్స్‌ ప్రో ఎం1


2. ఏసుస్ జెన్‌పోన్ మ్యాక్స్‌ ప్రో ఎం1
ఏసుస్ నుంచి వచ్చిన బెస్ట్ ఫోన్లల్లో ఇది ఒకటి. 3జీబీ+32జీబీ ధర రూ.9,999. స్పెసిఫికేషన్స్ చూస్తే డిస్‌ప్లే: 5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+(2160 x 1080) ఎల్సీడీ, ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636, అడ్రినో 509, 1.8 గిగాహెర్జ్, రియర్ కెమెరా: 13+5 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్, బ్యాటరీ: 5000 ఎంఏహెచ్, సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ ఓరియో 8.1, కలర్: బ్లాక్, గ్రే, సిమ్: డ్యూయెల్ సిమ్ లాంటి ప్రత్యేకతలున్నాయి.
జనవరిలో రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే... | BEST SMARTPHONES UNDER RS 10,000 TO BUY IN INDIA: JANUARY 2019 EDITION
రెడ్‌మీ 6


3. రెడ్‌మీ 6
ఇండియాలో షావోమీ రెడ్‌మీ సిరీస్ ఫోన్లకు మంచి డిమాండే ఉంది. రెడ్‌మీ 3 నుంచి 6 వరకు అన్ని ఫోన్లూ స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఆకట్టుకున్నవే. రెడ్‌మీ 6 కూడా మీ బడ్జెట్ ఫోనే. 3 జీబీ + 32 జీబీ ధర రూ.8,499, 4 జీబీ + 64 జీబీ ధర రూ.9,499. స్పెసిఫికేషన్స్ చూస్తే డిస్‌ప్లే: 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 18:9 యాస్పెక్ట్ రేషియో, ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ22, రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్, బ్యాటరీ: 3000 ఎంఏహెచ్, ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో ఎంఐయూఐ 10.

జనవరిలో రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే... | BEST SMARTPHONES UNDER RS 10,000 TO BUY IN INDIA: JANUARY 2019 EDITION
హానర్ 9ఎన్


4. హానర్ 9ఎన్
హువావే సబ్‌-బ్రాండ్ హానర్ ఇండియాలో రిలీజ్ చేసిన ఫోన్ ఇది. 3 జీబీ + 32 జీబీ ధర రూ.9,999. స్పెసిఫికేషన్స్ చూస్తే డిస్‌ప్లే: 5.84 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+, 19:9 యాస్పెక్ట్ రేషియో, ప్రాసెసర్: కిరిన్ 659, రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్, బ్యాటరీ: 3000 ఎంఏహెచ్, ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, ఈఎంయూఐ 8.0, కలర్స్: బ్లాక్, బ్లూ, పర్పుల్, లైమ్, జాస్పర్ గ్రీన్. 13+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా హెచ్‌డీఆర్, టైమ్-ల్యాప్స్, బరస్ట్ మోడ్‌ను సపోర్ట్ చేస్తుంది. రియర్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్లున్నాయి.

జనవరిలో రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే... | BEST SMARTPHONES UNDER RS 10,000 TO BUY IN INDIA: JANUARY 2019 EDITION
మోటోరోలా మోటో జీ6


5. మోటోరోలా మోటో జీ6
నాచ్ డిస్‌ప్లేతో గ్లాస్ స్టైల్ స్మార్ట్‌ఫోన్ కావాలనుకుంటే మోటోరోలా మోటో జీ6 ట్రై చేయొచ్చు. 3 జీబీ + 32 జీబీ ధర రూ.9,699. స్పెసిఫికేషన్స్ చూస్తే డిస్‌ప్లే: 5.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ, 18:9 యాస్పెక్ట్ రేషియో, ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 450, రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్, బ్యాటరీ: 3,000 ఎంఏహెచ్, ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ ఓరియో 8.0.

జనవరిలో రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే... | BEST SMARTPHONES UNDER RS 10,000 TO BUY IN INDIA: JANUARY 2019 EDITION
ఇన్ఫినిక్స్ నోట్ 5


6. ఇన్ఫినిక్స్ నోట్ 5
ఇన్ఫినిక్స్ నోట్ 5 ఆండ్రాయిడ్ వన్ డివైజ్. మీ బడ్జెట్‌లో అన్ని ఫీచర్లతో పాటు ఆండ్రాయిడ్ వన్ కూడా పొందొచ్చు. 3 జీబీ + 32 జీబీ ధర రూ.8,999. స్పెసిఫికేషన్స్ చూస్తే డిస్‌ప్లే: 6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+, 18:9 యాస్పెక్ట్ రేషియో, ప్రాసెసర్: మీడియాటెక్ పీ23, రియర్ కెమెరా: 12 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్, బ్యాటరీ: 4500 ఎంఏహెచ్, ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, ఈఎంయూఐ 8.0, కలర్స్: బ్లాక్, బ్లూ, పర్పుల్, లైమ్, జాస్పర్ గ్రీన్. 13+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా హెచ్‌డీఆర్, టైమ్-ల్యాప్స్, బరస్ట్ మోడ్‌ను సపోర్ట్ చేస్తుంది. రియర్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్లున్నాయి.

ఇవీ ఈ జనవరిలో రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు. మరి మీకు కావాల్సిన ఫోన్ ఎంచుకోండి. స్టైల్, పవర్, బ్యాటరీ బ్యాకప్, కెమెరా, ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ లాంటి అంశాలన్నీ చూసుకొని ఫోన్ సెలెక్ట్ చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

భారీ డిస్కౌంట్: షావోమీ ఎంఐ ఏ2పై రూ.4,500 తగ్గింపు

మీ ఫోన్‌లో వెదర్ యాప్ ఉందా? మీ డేటా గల్లంతే...

షావోమీ నుంచి మరో గ్యాడ్జెట్... ఎంఐ పవర్ బ్యాంక్ 3 ప్రో

జనవరి 31 తర్వాత టీవీ ఛానెళ్లు ఆగిపోతాయా?జర భద్రం: కాఫీ కప్పులతో భయంకరమైన రోగాలు తప్పవా?
Published by: Santhosh Kumar S
First published: January 7, 2019, 5:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading